Ram Charan : రామ్ చరణ్ భార్య ఉపాసన బిడ్డ బొడ్డుతాడు భద్రపరచడానికి గల కారణం ఏమిటి..?
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఉపాసన లకి పెళ్లయిన 11 సంవత్సరాల తర్వాత ఇటీవల జూన్ 20న పాప జన్మించడం తెలిసిందే. దీంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. పాప గర్భంలో ఉన్నప్పుడే తమ కుటుంబంలో ఎన్నో శుభకార్యాలు జరిగాయని చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడని ఆ పిల్ల ప్రభావం కారణమని చిరంజీవి మీడియా సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే సమయంలో రామ్ చరణ్ కూతురు మహాజాతకురాలు.. అంటూ చాలామంది ప్రముఖ జ్యోతిష్యులు ఆమె పుట్టిన గడియలు బట్టి జ్యోతిష్యం వ్యవహరిస్తున్నారు. చిరంజీవిని మించిపోతుందని.. సాక్షాత్తు శ్రీరాముడి జాతకం లాంటిదని వివరించడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే ఉపాసన బిడ్డ పుట్టిన అనంతరం బొడ్డుతాడు రక్తం నీ భద్రపరుచుకుంటున్నానని సోషల్ మీడియా ఖాతాలో వీడియోని పోస్ట్ చేసింది. తన బిడ్డ బొడ్డుతాడు రక్తాన్ని ఓ ప్రైవేటు సంస్థ దగ్గర భద్రపరుస్తున్నట్లు వెల్లడించింది. ఇదే మాదిరిగా ఉపాసన లాగానే గతంలో కాజోల్, సూపర్ స్టార్ మహేష్ భార్య నమ్రత, శిల్పా శెట్టి తమ పిల్లల బొడ్డుతాడు (అంబిలికల్ కార్డు బ్లడ్) నీ ఈ విధంగానే భద్రపరిచారు. అసలు బొడ్డుతాడు అంటే ఏమిటి దానిని భద్రపరచడానికి ఖర్చు ఎంత ఉందో తెలుసుకుందాం. ఈ బొడ్డుతాడు గర్భస్థ శిశువుకు అవసరమైన ఆక్సిజన్ మరియు గ్లూకోజ్ పోషకాలు అందేందుకు.. గర్భంలో పెద్ద ఉన్న సమయంలో తల్లికి బిడ్డకి మధ్య వారధిగా వ్యవహరిస్తది. డెలివరీ తర్వాత బిడ్డ బయటికి వచ్చినప్పుడు బొడ్డుతాడు అటాచ్ అయి ఉంటుంది.
డెలివరీ సమయంలో బొడ్డు దాడులు కట్ చేసి ముడి వేస్తారు. ఇది 5, 15 రోజుల్లో ఎండి నలుపు రంగులోకి మారుతుంది. బొడ్డుతాడు దాన్ని అంతటాదే ఉడిపోతుంది. అయితే ఈ తాడును భద్రపరచాలంటే 25 సంవత్సరాలకు 55 వేల రూపాయలు, 75 సంవత్సరాలు అయితే 70 వేల రూపాయలు.. అదనంగా అయితే ట్రీట్మెంట్ కోసం ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం చెల్లించాల్సి ఉంటుందట. అయితే ఎంతో అదృష్టవంతమైన పాప కావడంతో పాటు పాప చాలా ఆరోగ్యవంతంగా పుట్టినట్లు వైద్యులు తెలియజేయడంతో.. సెంటిమెంట్ గా బొడ్డుతాడును ఉపాసన భద్రపరుస్తున్నట్లు సమాచారం.