MS Narayana : చనిపోయే ముందు ఎంఎస్ నారాయణ రాసిన చీటీ ఏంటి..? అందులో ఏముంది?
MS Narayana : నవ్వడం ఒక వరం.. అలా నవ్వించే వారిని దేవుడనే అనాలి.. ఎందుకంటే ఆ నవ్వుతోనే మనం మన బాధలన్నింటినీ మర్చిపోతాం. అలా నవ్వించే వారు చాలా అరుదు. ఇక మూవీలో యాక్ట్ చేసే కమెడియన్స్‌కు సైతం తెరవెనుక చాలా కష్టాలు, బాధలు ఉంటాయి. కానీ వారు వాటన్నింటిని దిగమింగుకుని తెరపై మాత్రం మనల్ని కడుపుబ్బా నవ్విస్తుంటారు. షూటింగ్ లో ఉన్న టైంలో ఎలాంటి బ్యాడ్ న్యూ్స్ విన్నా.. దానిని బయటకు చెప్పకుండా బాధను తట్టుకుంటూ తెరపైన నవ్వులు పూయిస్తుంటారు కొందరు. ఇలాంటి వారిలో ఒకరు ఎమ్ఎస్ నారాయణ.
తెలుగు సీని ఇండస్ట్రీలో తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఎంఎస్ నారాయణ. తన క్యారెక్టర్‌తో ఎలాంటి వారినైనా నవ్వించగల హస్యచక్రవర్తి. ఆయన కామెడీ కోసమే చాలా మంది మూవీస్ కు వెళ్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ, ఆయన చనిపోయేముందు ఓ చీటీ రాశారట. ఆ విషయాన్ని ఆలీతో సరదాగా షోలో వివరించాడు బ్రహ్మానందం.షోలో ఆలీతో ఆయన నారాయణకు సంబంధించిన పలు విషయాలు పంచుకున్నారు. నారాయణకు తనకు మంచి ఫ్రెండ్ షిప్ ఉందని చెప్పుకొచ్చాడు బ్రహ్మానందం. ప్రేమగా అన్నయ్య అంటూ పిలిచేవాడని గుర్తుచేసుకున్నారు.
MS Narayana : షూటింగ్‌లో ఉన్నపుడు సడెన్‌గా ఫోన్ వచ్చింది
ఆయన హెల్త్ బాగోలేక ఆస్పత్రిలో ఉన్న టైంలో తన కూతురిని అడిగి పెన్ను పేపర్ తీసుకున్నారని, బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని దానిపై రాశారట. అదే టైంలో షూటింగ్ లో ఉన్న తనకు నారాయణ కూతురు ఫోన్ చేసి విషయాన్ని చెప్పిందట. దీంతో వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారట బ్రహ్మానందం. అప్పుడు నారాయణ తన కొడుకును పిలిచి తనను, నన్ను అలాగే చూస్తూ ఉన్నడని, ఎదో చెప్పాలని ట్రై చేస్తున్నాడని గుర్తుచేసుకున్నారు బ్రహ్మనందం. చివరకు ఆయన బాధ చూడలేక బయటకు వచ్చేశానని, అనంతరం 15 నుంచి 20 నిమిషాల్లోనే ఆయన కన్నుమూశారని కాస్త ఎమోషనల్ అయ్యారు.