Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి షెడ్ కి వెళ్ళిపోయిన టాప్ 6 దర్శకులు..!
Pawan Kalyan : అన్ని రంగాలు వేరు. సినీ రంగం వేరు. ఇక్కడ ప్రతిభతో పాటు కాసింత లక్కు కూడా ఉండాలి. ఎందుకంటే ఎంత కష్టపడినా ఫలితం మాత్రం దక్కదు. అందుకే.. చాలామంది నటుడు కానీ.. దర్శకుడు కానీ నిర్మాతలు కానీ.. ఎంతో గొప్ప స్థాయికి ఎదిగినా చివరకు అట్టడుగుకు చేరుకున్నారు. ప్రతిభ, కష్టపడే తత్వం, నెట్ వర్క్, కాస్తో కూస్తో అదృష్టం.. ఇవన్నీ కలిస్తేనే సినీ రంగాన్ని ఏలొచ్చు. అందుకే కొందరైతే అలా కనిపిస్తారు.. ఇలా కనుమరుగైపోతారు. మళ్లీ కనిపించరు. కొందరు హీరోయిన్లు అయితే ఒకటి రెండు సినిమాల్లో కనిపిస్తారు. మళ్లీ మటుమాయం అయిపోతారు.
కొందరు డైరెక్టర్లు రెండు మూడు సినిమాలు తీస్తారు. ఆ సినిమాలు హిట్ అయితే ఓకే.. వరుసగా ఫ్లాప్ అయితే ఇక వాళ్ల సంగతి అంతే. వాళ్లను పట్టించుకునే నాథుడే ఉండడు. అయితే.. అప్పట్లో పవన్ కళ్యాణ్ తో సినిమాలు తీసిన ఈ డైరెక్టర్లు ఇప్పుడైతే మచ్చుకైనా కనిపించడం లేదు. వాళ్లు ఎక్కడికి వెళ్లారో.. ఏమయ్యారో కూడా తెలియదు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. చాలా ఏళ్ల పాటు బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్లీ పవన్ మేకప్ వేసుకున్న సినిమా వకీల్ సాబ్. ఆ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవన్. ఆ సినిమాకు దర్శకత్వం వహించింది వేణుశ్రీరామ్. ఆ సినిమా బాగానే ఆడింది. సూపర్ హిట్ అయింది.
Pawan Kalyan : వకీల్ సాబ్ డైరెక్టర్ వేణుశ్రీరామ్ ఏమయ్యాడు?
కానీ.. ఆ డైరెక్టర్ మాత్రం ఇప్పటి వరకు మరో సినిమాను ప్రకటించలేదు. ఆయన ఏమైపోయాడో కూడా ఎవ్వరికీ తెలియదు. బీమ్లా నాయక్ తో పవన్ కు హిట్ ఇచ్చిన సాగర్ కే చంద్ర కూడా తర్వాత మరే ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు. కాటమరాయుడు సినిమా డైరెక్టర్ కిషోర్ కుమార్ కూడా మరో సినిమాను ప్రకటించలేదు. పవన్ తో ఖుషీలాంటి సినిమా తీసిన ఎస్ జే సూర్య.. ఆ తర్వాత కొమరం పులి సినిమా తీశాడు. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఇక తెలుగులో ఏ సినిమాను ప్రకటించలేదు. పవన్ తో బంగారం సినిమాను తెరకెక్కించిన ధరణి.. ఆ తర్వాత తెలుగులో సినిమానే చేయలేదు. పవన్ తో తీన్ మార్ సినిమా తీసిన జయంత్ సీ పరాంజీ.. అప్పటి నుంచి తెలుగులో మరే సినిమా చేయలేదు.