Chiranjeevi : అప్పుడు ఎన్టీఆర్.. చిరంజీవి.. మరి ఈతరంలో ఆ స్థాయి ఎవరిది…?
Chiranjeevi : తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన హీరో నట సార్వభౌమ నంఎన్టీఆర్దమూరి తారకరామారావు అని చెప్పవచ్చు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన మరో నటుడు మెగాస్టార్ చిరంజీవి అని చెప్పవచ్చు. ఈ ఇద్దరూ కూడా తెలుగు సినిమాని ఓ స్థాయికి తీసుకెళ్లారనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీని మూడు తరాలుగా చెప్పుకుంటే… ఒకటి ఎన్టీఆర్ తరంగా… రెండోది చిరంజీవి తరంగా ఇక మూడోది ప్రస్తుత తరంగా చెప్పవచ్చు. అయితే ఈ తరంలో ఆ స్థాయి స్థానం ఏ హీరోకి దక్కుతుందనే దానిపై ఇప్పుడు తెలుసుకుందాం.
Sr NTR : ఎన్టీఆర్ తరంలో…
మొదటి తరం హీరోల్లో ఎన్టీఆర్ ముఖ్యుడిగా చెప్పుకుంటారు. ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, మోహన్ బాబు లాంటి హీరోలు ఎందరున్నా తెలుగు ఇండస్ట్రీ రికార్డులను నెలకొల్పిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. కమర్షియల్ మూవీస్ తో పాటు, రాముడు, కృష్ణుడు, కర్ణుడు, రావణాసురుడు మొదలైన పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ తప్ప మరెవరూ చేయలేరు అనే స్థాయికి ఎదిగారు. ఈ పాత్రలతో తెలుగు సినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. ఇక యమగోల, అడవి రాముడు, వేటగాడు, జస్టిస్ చౌదరి, సర్ధార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, మేజర్ చంద్రకాంత్ లాంటి కమర్షియల్ హిట్స్ కూడా అందుకున్నారు. అందుకే ఎన్టీఆర్ ఆ తరం హీరోలలో అగ్రగామిగా నిలబడగలిగారు.
Chiranjeevi : చిరంజీవి తరంలో…
అలాగే ఎన్టీఆర్ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీని మరో స్ఠాయికి తీసుకెళ్లిన నటుడు చిరంజీవి. ఈయన పౌరాణిక చిత్రాలు చేయకపోయినప్పటికీ మాస్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. డాన్స్ లతో, ఫైట్స్ తో అప్పటి వరకు ఒక పాత ధోరణిలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమకి కొత్త రంగులు పూశారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తన స్థానం పదిలం చేసుకున్నారు. ఖైదీ సినిమా తో ఇండస్ట్రీ లో తన స్ధానాన్ని ఖాయం చేసుకున్న చిరు ఆ తర్వాత.. అడవి దొంగ, కొండవీటి దొంగ, కొండవీటి రాజా, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ముఠామేస్త్రీ, జగదేక వీరుడు, అతిలోకసుందరి, ఇంద్ర, ఠాగూర్ వంటి సూపర్ హిట్ సినిమాలతో టాప్ పొజీషన్ లో ఉన్నారు.
చిరంజీవి టైమ్ లో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, సుమన్, రాజశేఖర్ లాంటి హీరోలు పోటీ పడినప్పటికీ వారందరి కంటే చిరు కెరీర్ లోనే అత్యధిక హిట్ సినిమాలు ఉండడం.. అభిమానుల్లో తనకంటూ ప్రత్యేక స్ధానాన్ని సంపాదించుకోవడం తో చిరునే ఆ తరం గ్యాంగ్ లీడర్ గా భావిస్తారు. ఇక ప్రస్తుత తరంలో అమోఘమైన ఫ్యాన్ బేస్ ఉన్న పవన్ కల్యాణ్ ఆ స్ధాయిలో కనిపించినప్పటికి.. రాజకీయాల మీద ఆసక్తి తో ఆయన సినిమాలను లైట్ తీసుకున్నారనే చెప్పాలి. ఇక మిగిలిన వాళ్లలో మహేష్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫామ్ లో ఉన్నప్పటికీ ఇంకా టాప్ హీరో కుర్చీని సొంతం చేసుకోలేకపోయారు. అయితే చిరంజీవి తర్వాత ఆ టాప్ పొజీషన్ కి చేరుకునేదెవరో వేచి చూడాల్పిందే…