Bigg Boss Telugu 7 : అమర్‌దీప్‌ను నేరుగా నామినేట్ చేసిన శివాజీ, సందీప్.. ఈసారి ఎలిమినేట్ అయ్యే లిస్టులో ఉన్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

Advertisement

Bigg Boss Telugu 7 : ప్రతి వారం లాగానే ఈ వారం కూడా బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. నామినేషన్ల సమయంలో కంటెస్టెంట్లు మళ్లీ గొడవ పెట్టేసుకున్నారు. నువ్వంటే నువ్వు అంటూ.. నువ్వు ఆ పని చేయడం నాకు నచ్చలేదు. నువ్వు అస్సలు పనే చేయడం లేదు. నేను ఇక్కడికి వంట వండటానికి వచ్చానా? బిగ్ బాస్ హౌస్ లో కేవలం వంట వండటానికే కాదు.. గేమ్ ఆడటానికి వచ్చాను.. అంటూ ఇలా కంటెస్టెంట్లు అందరూ కాసేపు గొడవ పడ్డారు. తమకు నచ్చని ఇద్దరు వ్యక్తులను నామినేట్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. అందరూ నామినేట్ చేశాక.. నామినేట్ అయిన వాళ్లు శుభశ్రీ, గౌతమ్, ప్రియాంక, తేజ, దామిని, రతిక, యావర్. మొత్తం ఏడుగురు నామినేట్ అవుతారు.

Advertisement
who will be eliminated this week from bigg boss telugu 7
tasty

కానీ.. ఈ సీజన్ ఉల్టా పుల్టా కదా. అందుకే బిగ్ బాస్ ఇక్కడే మరో తిరకాసు పెట్టాడు. ఇంటి సభ్యులుగా ఉన్న సందీప్, శివాజీ ఈ ఇద్దరికి ఒక పవర్ ఇస్తాడు. ఇప్పుడు నామినేట్ అయిన వాళ్లలో ఒకరిని సేవ్ చేయాలంటాడు. మరొకరిని నామినేట్ చేయాలంటాడు. అయితే.. నామినేట్ కాని వాళ్లలో ప్రశాంత్, అమర్ దీప్, శోభా శెట్టి ఈ ముగ్గురే మిగులుతారు. ఈ ముగ్గురిలో ఒకరిని వాళ్లు నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇద్దరూ కలిసి చర్చించుకొని ఒకరిని నామినేట్ చేయండి.. మరొకరిని సేవ్ చేయండి అని బిగ్ బాస్ చెప్పడంతో శివాజీ, సందీప్ ఇద్దరూ కలిసి చర్చించుకొని అమర్ దీప్ ను నామినేట్ చేస్తారు. దీంతో నన్నెందుకు నామినేట్ చేశారు. ప్రశాంత్ ను చేయొచ్చు కదా అంటాడు. దీంతో నీకు పవరాస్త్ర కంటెండర్ గా ఒక అవకాశం ఇచ్చాం కానీ.. దాన్ని నువ్వు ఉపయోగించుకోలేదు అంటాడు సందీప్.

Advertisement

Bigg Boss Telugu 7 : ప్రశాంత్ ను నామినేట్ చేసి ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని అన్న అమర్ దీప్

మీరు నిజంగా ప్రశాంత్ ను నామినేట్ చేసి ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని.. మీకు నేను ఫ్యాన్ అయ్యేవాడిని అని అమర్ దీప్.. శివాజీతో అంటాడు. నాకు పక్షపాతం జరిగింది అనిపిస్తోంది. ఇది చిన్న హౌస్. ప్రశాంత్ గాడు నాకేం కాడు. వాడు వచ్చి వాడు ఏదైనా అడిగినా గేమ్ గేమే.. అంటూ చెబుతాడు శివాజీ. ఆ తర్వాత తేజాను సేవ్ చేస్తున్నట్టు చెబుతారు. దీంతో ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి నామినేట్ అయిన వాళ్లు శుభశ్రీ, గౌతమ్, ప్రియాంక, దామిని, రతిక, యావర్, అమర్. అయితే.. ఈ ఏడుగురిలో డేంజర్ జోన్ లో ఉన్నవాళ్లు అంటే మాత్రం గౌతమ్ అనే చెప్పుకోవాలి. నిజానికి తేజ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. కానీ.. ఈ వారం నామినేషన్ల నుంచి సేవ్ అవడంతో ఇప్పుడు గౌతమ్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఈ వారం ఎలిమినేట్ అయ్యే ప్రమాదం గౌతమ్ కే ఎక్కువగా ఉంది. చూడాలి మరి ప్రేక్షకులు ఎవరిని ఇంటికి పంపిస్తారో?

Advertisement
Advertisement