Soundarya : సౌందర్య ఎవరిని పెళ్ళి చేసుకుందో తెలుసా.. తన మృతి తర్వాత భ‌ర్త ప‌రిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే..?

Advertisement

Soundarya : అలనాటి అగ్రతారామణి సావిత్రి తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న హీరోయిన్ సౌందర్య. తెలుగు, తమిళ సినిమాలలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సౌందర్య తండ్రి సత్యనారాయణకి సినిమా వాళ్ళతో బాగానే పరిచయాలున్నాయి. ఆ పరిచయాలతోనే ఈమె ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంటరయ్యారు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతికొద్దిరోజుల్లోనే పెద్ద స్టార్ గా మారారు. ఇటీవలే సౌందర్య 49వ జయంతి సందర్భంగా అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఆమెను గుర్తు చేసుకున్నారు.

whom soundarya-married....?
whom soundarya-married….?

ఈ సమయంలో ఎంతో మందికి తను నటించిన సినిమాలు..వాటిలోని ఆమె పోషించిన అద్భుతమైన పాత్రలు కళ్ళముందు మెదలాడాయి. సౌందర్య – వెంకటేశ్, సౌందర్య – చిరంజీవిలది హిట్ పెయిర్ అని చెప్పాలి. వీరితో కలిసి నటించిన సినిమాలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. తెలుగులో బాలకృష్ణ దర్శకత్వంలో నర్తనశాల మొదలై ఆగిపోయింది. ఇదే ఆమె చివరి సినిమా. సినిమాలలో వరుసగా అవకాశాలు అందుకుంటూ సాగుతున్న సమయంలోనే బీజెపి పార్టీలో చేరారు. పార్టీ ప్రచారానికి హెలికాఫ్టర్‌లో బయలుదేరిన ఆమె ప్రమాదవశాత్తు మరణించారు.

Advertisement

Soundarya : సౌందర్యతో పాటు తన అన్న కూడా మృతి చెందారు.

whom soundarya-married.
whom soundarya-married.

ఆమె సోదరుడు అమర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో సౌందర్యతో పాటు తన అన్న కూడా మృతి చెందారు. ఆమె మరణించే సమయానికి పెళ్ళి కూడా అయింది. చిన్నప్పటి స్నేహితుడు, వరుసకి మేనమామ, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన రఘుని 2003లో పెళ్ళి చేసుకుంది. పెళ్ళైన సంవత్సరానికే ఆమె మరణించడంతో రఘు డిప్రషెషన్ లోకి వెళ్లాడు. అతను కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. 2011లో మళ్ళీ పెళ్ళి చేసుకున్న రఘు ప్రస్తుతం గోవాలో ఉంటున్నాడు. ఇక సౌందర్య ఎంతో ఇష్టపడి కొనుకున్న ఇల్లు ఇపుడు పాడుపడిన బంగళాలా మారిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

ఇది కూడా చ‌ద‌వండి==> ముగ్గురు మొనగాళ్ళు మూవీలో చిరుకి డూప్‌గా ఆ ఇద్దరు మొనగాళ్ళు వీరే…!

ఇది కూడా చ‌ద‌వండి==> స్టార్ హీరోయిన్స్ మధ్య సిద్దార్థ్ ఫొటో.. చనిపోయాడంటూ వార్తలు..!

ఇది కూడా చ‌ద‌వండి==> నిన్ను కోటి రూపాయల హీరోయిన్ ను చేస్తా.. ఆ నటికి బంపర్ ఆఫర్ ఇచ్చిన బండ్ల గణేశ్?

Advertisement
Advertisement