Siddharth : స్టార్ హీరోయిన్స్ మధ్య సిద్దార్థ్ ఫొటో.. చనిపోయాడంటూ వార్తలు..!
Siddharth : క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో సిద్దార్థ్. తమిళం, హిందీ తో పాటు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. ఆయన హీరోగా ప్రభుదేవ దర్శకత్వం వహించగా తెలుగులో మొదటి సినిమాగా వచ్చి భారీ స్థాయిలో స్టార్ డం తెచ్చుకున్న బ్లాక్ బస్టర్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా. ఈ సినిమాతో సిద్దార్థ్ టాలీవుడ్‌లో స్టార్ అయ్యాడు. దీని తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన బొమ్మరిల్లు. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
ఆ తర్వాత మాత్రం తెలుగులో ఆయన చేసిన సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. బాలీవుడ్‌లో రంగ్ దే బసంతి లాంటి బ్లాక్ బస్టర్స్‌లో నటించాడు. అలాగే తమిళంలో కూడా ఈ హీరోకి ఒకప్పుడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు భారీ స్థాయిలో మార్కెట్..క్రేజ్ ఉండేది. అయితే ఒక్కసారిగా మూడు భాషలలో ఆయనకి వరుసగా పరాజయాలు పలకరించాయి. దాంతో దాదాపు కెరీర్ క్లోజ్ అనే టాక్ వచ్చింది. కాస్త గ్యాప్ తీసుకున్న సిద్దార్థ్ మళ్ళీ పుంజుకొని సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో మహా సముద్రం అనే సినిమాలో ఒక హీరోగా నటిస్తున్నాడు.
Siddharth : సిద్దార్థ్ ఆ వీడియో విషయంలో ఇదివరకే యూ ట్యూబ్ దృష్టికి తీసుకువెళ్లాడట.
కాగా ఇటీవల ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చారు. సిద్దార్థ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్న కాంట్రవర్సీ కామెంట్స్ పై తరచుగా రియాక్ట్ అవుతున్నాడు. ఈ క్రమంలో రీసెంట్‌గా యంగ్ ఏజ్ లో మరణించిన సినీ తారలు అని ఒక యూ ట్యూబ్ కు సంబంధించిన వీడియోపై ట్వీట్ చేశాడు.
అందులో సౌందర్య, ఆర్తి అగర్వాల్ వంటి దివంగత నటిమణుల ఫొటోలో మధ్యలో సిద్దార్థ్ ఫొటో కూడా ఉండటం షాకింగ్ విషయం. యూ ట్యూబ్ లో వ్యూవ్స్ కోసం ఇంతగా దిగజారడం ఏంటని నెటిజన్స్ కొందరు ఆ వీడియో లింక్ కు సిద్దార్థ్ ను ట్యాగ్ చేశారు. అయితే సిద్దార్థ్ ఆ వీడియో విషయంలో ఇదివరకే యూ ట్యూబ్ దృష్టికి తీసుకువెళ్లాడట. అయితే అందులో ఎలాంటి ప్రాబ్లమ్ లేదని అటు నుంచి సమాధానం వచ్చిందట. దీంతో సిద్దార్థ్ పాపాత్ముల్లారా అనే రియాక్షన్ ఇచ్చినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపాడు.