Bandla Ganesh : నిన్ను కోటి రూపాయల హీరోయిన్ ను చేస్తా.. ఆ నటికి బంపర్ ఆఫర్ ఇచ్చిన బండ్ల గణేశ్?
Bandla Ganesh : టాలీవుడ్ బడా నిర్మాత బండ్ల గణేశ్ గురించి తెలుసు కదా. చాలా జోవియల్ మనిషి. ఆయన ఎక్కడుంటే అక్కడ రచ్చే. చాలా సరదా మనిషి. అయితే.. బండ్ల గణేశ్ ఎక్కువగా ఏ షోలకు అటెండ్ కారు. కానీ.. యాంకర్ ఓంకార్ షో సిక్స్త్ సెన్స్ షోకు వెళ్లారు. అక్కడికి వెళ్లాక ఆయన చేసిన హడావుడి మామూలుగా లేదు. ఆయన చేసిన హంగామానే షోకు హైలెట్ గా నిలిచింది. అయితే.. అదే షోలో ప్రముఖ తెలుగు హీరోయిన్ నందితా శ్వేత పాల్గొన్నారు. ఇద్దరూ కలిసి చేసిన హంగామా మామూలుగా లేదు.

bandla ganesh and nanditha sweta in sixth sense 4 show
బండ్ల గణేశ్.. తన కూతురుతో కలిసి ఈ షోకు వచ్చారు. నిజానికి.. తన కూతురును బండ్ల గణేశ్ ఎక్కడికి తీసుకెళ్లరు కానీ.. యాంకర్ ఓంకార్ షోకు నువ్వు వెళ్తే నన్ను కూడా తీసుకెళ్తు నాన్నా.. అని తన కూతురు బండ్ల గణేశ్ ను అడిగిందట. దీంతో ఓంకార్ షో సిక్స్త్ సెన్స్ కు తీసుకెళ్లారట.

bandla ganesh and nanditha sweta in sixth sense 4 show
Bandla Ganesh : బండ్ల గణేశ్ ను చూడగానే అన్నయ్య అని పిలిచిన నందితా శ్వేత
ఈ షోకు రాగానే.. నందితా శ్వేత.. బండ్ల గణేశ్ ను చూసి అన్నయ్యా అని పిలిచింది. మామూలుగా నేను ఎవ్వరినీ అన్నయ్య అని పిలువను కానీ.. బండ్ల గణేశ్ ను చూడగానే.. నాకు ఎందుకో అన్నయ్య అని పిలువాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది నందిత. అయితే.. షోలో మాత్రం ఇద్దరూ పోటీదారులు కాబట్టి.. ఇద్దరూ గేమ్ ను గేమ్ గానే ఆడినప్పటికీ.. గుడ్లు పగులగొట్టే సమయంలో మాత్రం నందితా శ్వేతకు.. బండ్ల గణేశ్ సాయం చేశారు. అయితే.. మూడు గుడ్లలో ఏ గుడ్డును పగులగొట్టాలో తెలియక నందితా శ్వేత సతమతం అయింది. దీంతో.. నేను చెప్పిన గుడ్డును పగులగొట్టు.. ఒకవేళ అందులో లక్ష రూపాయల బంగారం లేకపోతే.. నేనే నీకు లక్ష రూపాయలు ఇస్తాను.. అంటూ శ్వేతకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

bandla ganesh and nanditha sweta in sixth sense 4 show
అయితే.. బండ్ల గణేశ్ చెప్పిన గుడ్డును శ్వేత పగులగొట్టబోతుండగా.. వన్ సెకండ్ అంటూ పదే పదే ఓంకార్ ఆపేయడంతో.. ఇక తప్పక.. బండ్ల గణేశ్.. ముందు నువ్వు ఆ గుడ్డు పగులగొట్టు.. నీకు నేను నా సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ ఇస్తా.. టాప్ హీరోయిన్ ను చేస్తా.. కోటి రూపాయల హీరోయిన్ గా చేస్తా.. అంటూ ఆఫర్ల మీద ఆఫర్లను ఇచ్చారు బండ్ల గణేశ్. దీంతో.. నాకు లక్ష రూపాయల బంగారం పోయినా అవసరం లేదు.. బండ్ల గణేశ్ అన్నయ్య నాకు సినిమా ఆఫర్ ఇస్తా.. అన్నారు అంటూ నందితా శ్వేత.. బండ్ల గణేశ్ చెప్పిన గుడ్డును పగులగొట్టింది. అందులో బంగారం లేదు.. దీంతో లక్ష రూపాయల బంగారాన్ని శ్వేత మిస్ చేసుకుంది. ఏం బాధపడకు. నీకు నేను ఎలాగూ హీరోయిన్ ఆఫర్ ఇస్తా.. అంటూ చెప్పేశారు బండ్ల.

