Bigg Boss OTT Telugu : అఖిల్ కు ఆర్జే చైతూ అంటే ఎందుకు నచ్చదు.. తన బిహేవియర్ ఎందుకు అఖిల్ కు నచ్చదు?
Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ హౌస్ లో బద్ధ శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే అందులో మొదటి ప్లేస్ లో ఉంటారు అఖిల్, ఆర్జే చైతూ. అసలు.. బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వాళ్లకు అస్సలు పడదు. వాళ్లు ఎదురుపడితే చాలు.. ఒకరి ముఖాన్ని మరొకరు చూడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు. అసలు ఆర్జే చైతూ, అఖిల్ మధ్య ఎందుకు అంత శత్రుత్వం ఉందో మాత్రం ఎవ్వరికీ అర్థం కావడం లేదు.నిజానికి.. బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఎవరైనా ఉన్నారు అంటే అది అఖిల్, ఆర్జే చైతూ. వీళ్లిద్దరే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు. ఒకవేళ ఆ విషయమే ఇద్దరినీ విడదీస్తోందా? అదే ప్రేక్షకులకు అర్థం కావడం లేదు.
బిగ్ బాస్ 4లో ట్రోఫీకి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉండిపోయాడు అఖిల్. బిగ్ బాస్ 4 రన్నరప్ గా నిలిచాడు అఖిల్. నిజానికి… బిగ్ బాస్ 4 విన్నర్ గా అఖిల్ అయ్యేవాడే కానీ.. మోనల్ తో తనకు ఉన్న రిలేషన్ షిప్, మోనల్ తోనే ఎక్కువగా అఖిల్ గడపడం వల్లే తను బిగ్ బాస్ 4 విన్నర్ కాలేకపోయాడు.అందుకే ఈసారి మాత్రం ఎలాగైనా బిగ్ బాస్ ఓటీటీ తెలుగు విన్నర్ అవ్వాలని కలలు కంటున్నాడు. అందుకే మొదటి నుంచే ఎవరైతే హౌస్ లో స్ట్రాంగ్ గా ఉన్నారో.. వాళ్లతో ముందు నుంచే అఖిల్ కయ్యానికి కాలు దువ్వుతున్నాడు.

why akhil hates rj chaitu in bigg boss ott telugu
Bigg Boss OTT Telugu : అఖిల్, చైతూ.. ఇద్దరి మధ్య టైటిల్ పోరు నడుస్తోందా?
మరోవైపు చైతూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉండటం.. చాలెంజర్స్ టీమ్ ను కంట్రోల్ చేస్తున్నాడని అర్థం అవుతూనే ఉంది. ముందు నుంచి కూడా అది జరుగుతూనే ఉంది. చైతూతో పాటు యాంకర్ శివ కూడా చాలెంజర్స్ టీమ్ ను కంట్రోల్ చేస్తున్నారు. అందుకే.. అఖిల్.. శివతో కూడా కయ్యానికి కాలు దువ్వుతున్నాడు.మొత్తానికి అఖిల్ కు చైతూతో పాటు శివతో కూడా పడటం లేదు. అందుకే.. ఒకరిని మరొకరు.. నామినేషన్లలో నామినేట్ చేసుకుంటున్నారు. ఇంటి నుంచి బయటికి పంపించేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలోనే ఈ ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. నామినేషన్లలో అదే జరుగుతోంది.