Nivetha Pethuraj : ఆ హీరోయిన్ డిక్కీ సంగ‌తి ఇదా.. జ‌నాల‌ని పిచ్చోళ్ల‌ని చేసావు క‌ద‌మ్మా..!

Nivetha Pethuraj : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచయాలు అక్క‌ర్లేదు. విశ్వక్ సేన్ నటించిన పాగల్, దాస్ కా ధమ్కీ సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది. ఇవే కాకుండా ఇతర చిత్రాలతో అలరించిన నివేదా పేతురాజ్ ఇటీవ‌ల ఓ ఇష్యూతో వార్త‌ల‌లో నిలిచింది. నివేదా పేతురాజ్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో నివేదా పోలీసులతో గొడవ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. కానీ ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. అయితే వీడియో చూసిన నెటిజన్లు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కామెంట్లు పెడుతున్నారు. నివేదా కూడా ఇప్పటి వరకు ఎక్కడా వీడియోపై స్పందించలేదు. అసలేం జరిగిందంటే?

Nivetha Pethuraj : ప్ర‌మోష‌న‌ల్ స్టంటా..

నివేదా కారులో వెళ్తుండగా.. ఆమె కారును పోలీసులు అడ్డుకోవడం.. డిక్కీ ఒపెన్ చేయాలని చెబితే పరువుకు సంబంధించిన విషయం అంటూ పోలీసులతోనే గొడవ పడింది నివేదా. డిక్కీ ఒపెన్ చేయను ఎందుకంటే ఇది నా పరువుకు సంబంధించిన విషయం అంటూ పోలీసులతో వాదించింది. అలాగే అక్కడే వీడియో తీస్తున్న వ్యక్తిపై సీరియస్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అసలు నివేదాకు ఏమైందంటూ నెటిజన్స్ షాకయ్యారు. ఉన్నట్లుండి పోలీసులతో ఈ బ్యూటీకి గొడవేంటీ అంటూ సందేహాలు వ్యక్తమయ్యాయి.తాజాగా ఈ విషయాన్ని జీ5 ట్వీట్ చేస్తూ నివేదా కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించింది. నివేదా పోలీసులతో గొడవ పడిన వీడియోను షేర్ చేస్తూ పరువు పేరుతో కొత్త సినిమా రాబోతుందంటూ వెల్లడించింది.

Nivetha Pethuraj : ఆ హీరోయిన్ డిక్కీ సంగ‌తి ఇదా.. జ‌నాల‌ని పిచ్చోళ్ల‌ని చేసావు క‌ద‌మ్మా..!

ఇందులో నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ మూవీ జూన్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. దీంతో నివేదా పోలీసుల గొడవ అంతా పబ్లిసిటీ స్టంట్ అని తేలడంతో షాకవుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుంది. నివేదా పేతురాజ్.. మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించినా ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మెరిసింది. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. ఇక ఇప్పుడు ఓటీటీలో పరువు అనే సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది.

Recent Posts

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

5 hours ago

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

6 hours ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

8 hours ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

10 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

12 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

14 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

15 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

16 hours ago