Home » Entertainment » Why Hyper Aadi Comedy Punches Not Doing Well
Entertainment

Hyper Aadi : అప్పుడు హైపర్ ఆది పంచ్‌ లకు నవ్విన వాళ్లే ఇప్పుడు విమర్శలు ఏంటో!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 3, 2022, 11:00 am
Advertisement

Hyper Aadi : జబర్దస్త్‌ కమెడియన్ ఆది ఇప్పటికే మల్లెమాల వారితో విభేదాల కారణంగా జబర్దస్త్‌ ను వీడిన విషయం తెల్సిందే. జబర్దస్త్‌ తో ఒప్పందం పూర్తి అయిన నేపథ్యంలో దాన్ని రెన్యూవల్‌ చేసుకునేందుకు హైపర్‌ ఆది ఒప్పుకోలేదు. మల్లెమాల వారితో పారితోషికంతో పాటు ఇతర విషయాల పట్ల విభేదాలు ఉన్న నేపథ్యంలో ఆయన కాస్త సీరియస్ గానే షో లకు దూరంగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు ఢీ షో తో కుదుర్చుకున్న ఒప్పందాల తాలూకు అగ్రిమెంట్స్ ఇంకా పూర్తి అవ్వలేదు. కనుక హైపర్ ఆది ఆ ఎపిసోడ్స్ ల్లో కనిపిస్తున్నాడు. ఢీ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ షో ల్లో ఆది కనిపిస్తున్నాడు..

Advertisement

కాని ఆయన గతంలో వేసిన మార్క్ పంచ్ లు కనిపించడం లేదు. జబర్దస్త్‌ లో రోజా ఉన్న సమయంలో బుగ్గలు నొస్తున్నాయి నవ్వి నవ్వి అంటూ ఎన్నో సార్లు ఆది స్కిట్ కు పది మార్కులు ఇచ్చిన సందర్బాలు ఉన్నాయి. కాని ఇప్పుడు అదే రోజా ముందు ఆది ఇటీవల పంచ్‌ లు వేస్తే అబ్బే ఇవేం పంచ్ లు.. ఇదేం కామెడీ అంటూ రోజా పెదవి విరిచే అవకాశాలు ఉన్నాయి. మరీ ఇలా ఆది పంచ్ లు పేలవంగా మారాయి ఏంటో అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అందుకు ఆయన వర్గీయుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆది ఈటీవీలో నోటీస్ పీరియడ్ లో ఉన్నాడు.

why hyper aadi comedy punches not doing well

Advertisement

ఏ ఉద్యోగి అయినా నోటీస్ పీరియడ్‌ లో ఎక్కువ పని చేయడం కాని.. గతంలో ఉన్నట్లుగా ఉండటం కాని మనం చూడలేం. ఆ విషయం ఆది ద్వారా మరోసారి అర్థం అవుతుంది. గతంలో నవ్వించిన ఆది ఇప్పుడు కూడా అంతో ఇంతో కామెడీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని అది పెద్దగా వర్కౌట్‌ అవ్వడం లేదు. ఆయన కావాలని కామెడీ డోస్ తగ్గించాడా.. స్క్రిప్ట్‌ రాసుకునేప్పుడు పెద్దగా ఇంట్రెస్ట్‌ పెట్టడం లేదా అనేది ఆయనే చెప్పాలి. ఆది త్వరలోనే స్టార్‌ మా లో సందడి చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి