Home » Entertainment » Will Swapna Find About Jwala In Karthika Deepam
Entertainment

Karthika Deepam : జ్వాలపై స్వప్నకు అనుమానం.. జ్వాలే శౌర్య అని తెలుస్తుందా? జ్వాల ఊరు వదిలి వెళ్లిపోతుందా?

Authored By
Varun G
The Telugu News | Published on: July 3, 2022, 10:30 am
Advertisement

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. కార్తీక దీపం సీరియల్ సోమవారం, 4 జులై 2022 ఎపిసోడ్ 1395 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దాని ఆయుష్షు తీరగానే నిరుపమ్ తో నేను పెళ్లి చేస్తాను అంటుంది స్వప్న. దీంతో అయ్యో ఆంటి.. దానికి అసలు క్యాన్సరే లేదు అని మనసులో అనుకుంటుంది. హిమ మీద స్వప్నకు డౌట్ వచ్చేలా చేస్తుంది శోభ. మనకు తెలియనిది ఏదో జరుగుతోంది ఆంటి.. అని అంటుంది శోభ. ఆరోజు ఎంగేజ్ మెంట్ లో ఎందుకు చివరి నిమిషంలో తనకు పెళ్లి వద్దని చెప్పింది అని డౌట్ క్రియేట్ చేస్తుంది శోభ. తనకు నిరుపమ్ ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే.. నేను చేసుకుంటా అంటే ఎందుకు వద్దంటోంది. అదెవరో.. జ్వాలకు ఎందుకు ఇచ్చి చేస్తా అంటోంది. జ్వాల, హిమకు మధ్య ఏముంది.. అంటూ స్వప్నకు అనుమానం వచ్చేలా చేస్తుంది శోభ.

Advertisement

will swapna find about jwala in karthika deepam

మరోవైపు స్వప్న.. సౌందర్య ఇంటికి వస్తుంది. అప్పుడే సౌందర్య, ఆనంద రావు జ్వాల ఇంటికి వెళ్లేందుకు రెడీ అవుతారు. దీంతో ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని అడుగుతుంది. డాడీ మాట్లాడరేంటి అని అడుగుతుంది. ఇప్పుడు దీనికి శౌర్య గురించి చెబితే కొత్త గొడవ మొదలు పెడుతుంది. దాన్ని తిడుతుంది అని అనుకుంటుంది సౌందర్య. ఏం లేదు.. తెలిసిన వాళ్ల ఇంటికి వెళ్తున్నాం అంటుంది సౌందర్య. మిమ్మల్ని చూస్తుంటే ఏదో డౌట్ గా అనిపిస్తోంది అంటుంది స్వప్న. అసలు మీ మైండ్ లో ఏముందో మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మొత్తానికి ఏదో జరుగుతోంది అది మాత్రం నాకు అర్థం అవుతోంది అంటుంది స్వప్న. ఇంతలో జ్వాల ఫోన్ చేస్తుంది. దీంతో ఏదో జగదీశ్వరి అని పేరు చెప్పి వస్తున్నాం అని స్వప్న నుంచి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారు సౌందర్య, ఆనంద రావు.

Advertisement

Karthika Deepam : శోభ కోసం మంచి సంబందం చూసిన నిరుపమ్

తన పెళ్లి కార్డు చూసి మురిసిపోతున్న నిరుపమ్ కు ఫోన్ చేస్తుంది శోభ. నీకు ఏ గిఫ్ట్ ఇవ్వాలి అని అడుగుతుంది. దీంతో గిఫ్ట్ ఎవరైనా అడిగి తెస్తారా? అయినా నా పెళ్లికి రావడమే పెద్ద గిఫ్ట్ అంటాడు నిరుపమ్. అయినా నేనే నీకు పెద్ద గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నా అంటాడు. ఏంటా గిఫ్ట్ అంటుంది. నాకు తెలిసిన ఫ్రెండ్ వర్మ కెనెడాలో ఉంటున్నాడు. ఇండియాలో సెటిల్ అవుదామనుకుంటున్నాడు అంటాడు.

అతడు నీకు సరైన జోడి అంటాడు. దీంతో షాక్ అవుతుంది శోభ. ఫోన్ కట్ చేస్తుంది. నా మొగుడు నాకు ఇంకో మొగుడుని చూపిస్తాడట అంటూ కోపం తెచ్చుకుంటుంది శోభ. వెంటనే స్వప్న దగ్గరికి వెళ్తుంది శోభ. నేను మీ కోడలును అని మీరు అనుకుంటే సంతోషపడితే సరిపోదు కదా అంటుంది శోభ.

Advertisement

ఈ పెళ్లిని మీరు ఎలాగైనా ఆపండి అంటుంది శోభ. ఈ పెళ్లి అంటే తనకు ఇష్టం లేదని హిమే అంటోంది కదా అంటుంది శోభ. దీంతో నేను నిరుపమ్ కు మాటిచ్చాను. పెళ్లిని ఆపడం సాధ్యం కాదు అంటుంది స్వప్న. మరోవైపు జ్వాల ఇంటికి వెళ్తారు సౌందర్య, ఆనంద రావు.

వీళ్లకు నా మీద ఇంత ప్రేమ ఎందుకు కలిగింది. వీళ్లకు నిజం తెలిసిందా అని మనసులో అనుకుంటుంది జ్వాల. తనను ఓదార్చడానికి ట్రై చేస్తారు ఆనంద రావు, సౌందర్య. దీంతో మా బాబాయి, పిన్ని ఊరు నుంచి రాగానే.. ఈ ఊరునే వదిలేసి వెళ్లిపోతా అంటుంది జ్వాల.

దీంతో సౌందర్య, ఆనంద రావు షాక్ అవుతారు. నువ్వు వెళ్లిపోతే మేమేం కావాలి అంటారు. మిమ్మల్ని వదిలేసి వెళ్తావా అంటారు. మరోవైపు 500 చేంజ్ ఉంటే ఇస్తారా.. అని నిరుపమ్ నే అడుగుతుంది జ్వాల. వెనుక నుంచి చూసి.. నిరుపమ్ అనుకోదు.

ఎవరో అనుకుంటుంది జ్వాల. కానీ.. నిరుపమ్ ను చూసి షాక్ అవుతుంది. 500 నోటు తీసుకొని 5 వంద రూపాయల నోట్లను ఇస్తాడు నిరుపమ్. డాక్టర్ సాబ్ ఇచ్చిన నోట్లు.. వీటిని అస్సలు ఖర్చు పెట్టను అని అనుకుంటుంది జ్వాల. మరోవైపు దీన్ని వదిలించుకుందామంటే అస్సలు వదలడం లేదు అంటాడు నిరుపమ్.

Advertisement

ఏంటి డాక్టర్ సాబ్ ఇలా చేశారు. ప్రాణం కన్నా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించాను కదా అని అనుకుంటుంది. కొందరు మనుషులు కూడా ఇంతే కదా హిమ. ఎంత వదిలించకుందామన్నా అస్సలు వదలరు అని అంటాడు నిరుపమ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి