Hyper Aadi : హైపర్ ఆది లేకుంటే శ్రీదేవి డ్రామా కంపెనీ పరిస్థితి మరీ ఇంత దారుణమా?
Hyper Aadi : ఈటీవీలో జబర్దస్త్ తర్వాత అత్యధిక ఆదరణ సొంతం చేసుకున్న షో శ్రీదేవి డ్రామా కంపెనీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు ఢీ డాన్సర్స్ కూడా ఈ షోలో సందడి చేయడం మరియు కొత్త ట్యాలెంట్ ను ప్రత్యేకమైన సర్ ప్రైజ్ లను తీసుకు వస్తున్న కారణంగా ఆదివారం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని ఈ షో అందిస్తుంది. ముఖ్యంగా సుధీర్ యాంకరింగ్ మరియు రామ్ ప్రసాద్ ఇంకా హైపర్ ఆది కామెడీ ఈ షో స్థాయిని అమాంతం పెంచాయి. ఇక ఈ షో వారం వారం అలా అలా టాప్ రేటింగ్ దక్కించుకుంటూ వెళ్తున్న సమయంలో గత వారం అనూహ్యంగా డౌన్ ఫాల్ అయినట్టు అనిపించింది.తాజా ఎపిసోడ్ లో హైపర్ ఆది లేకపోవడం వల్లే రేటింగ్ తగ్గింది. కొన్ని కారణాల వల్ల హైపర్ ఆది క్రితం ఎపిసోడ్ లో లేడని టాక్ వినిపిస్తుంది.
హైపర్ ఆది మళ్ళీ వచ్చే ఎపిసోడ్ కి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని కొందరు అంటున్నారు. కానీ కొందరు మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి హైపర్ ఆది ని తొలగించారు.. ఆయన పారితోషికం మరీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆయన్ని తప్పించారని సమాచారం వస్తుంది. హైపర్ ఆది లేకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్ కూడా ఉండదని మొన్నటి ఎపిసోడ్ క్లారిటీ వచ్చింది. మరి ఇప్పటికైనా మల్లెమాల మరియు ఈటీవీ వారు ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ హైపర్ ఆది ని తీసుకు వస్తారా అనేది చూడాలి.సుడిగాలి సుదీర్ ని కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి తొలగించే అవకాశాలు ఉన్నాయంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలా సక్సెస్ గా నడుస్తున్న షో నుండి సక్సెస్ ఫుల్ క్రేజీ కమెడియన్స్ ను తొలగించడం ఏమాత్రం సబబు కాదంటున్నారు.

hyper aadi not participate last week sridevi drama company episode
మంచి పేరు ఉన్న వారిని తీసివేస్తే రేటింగ్ ఎలా కంటిన్యూ అవుతుంది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఆదివారం నాడు ప్రసారమవుతుంది కనుక మొత్తం ఫ్యామిలీ ఎంజాయ్ చేసేలా ఆది తో పాటు ఇంకా పలువురు కమెడియన్స్ ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీకి మునుపటి ఉత్సాహం తీసుకు రావాలంటే కచ్చితంగా హైపర్ ఆది ఉండాల్సిందే. హైపర్ ఆది మరియు రాంప్రసాద్ ల కామెడీకి మంచి ఆదరణ ఉంది. మొన్నటి ఆదివారం ఎపిసోడ్ హైపర్ ఆది లేకపోవడంతో రాంప్రసాద్ సైలెంట్ గా పెద్దగా సందడి లేకుండా కనిపించాడు. అందుకే హైపర్ ఆది ని తీసుకురావాలని ప్రేక్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు.