Senior Actress Laxmi : సీనియర్ నటి లక్ష్మి విషయంలో ఎవ్వరికీ తెలియని దారుణ నిజం.. మొదటి భర్తని వదిలేసి రెండు పెళ్లిళ్లు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Senior Actress Laxmi : సీనియర్ నటి లక్ష్మి విషయంలో ఎవ్వరికీ తెలియని దారుణ నిజం.. మొదటి భర్తని వదిలేసి రెండు పెళ్లిళ్లు !

 Authored By kranthi | The Telugu News | Updated on :23 November 2022,12:20 pm

Senior Actress Laxmi : సినీ ఇండస్ట్రీలోని నటీనటులు, దర్శకనిర్మాతలు, ఇతర ఆర్టిస్టుల జీవితాలు తెరిచిన పుస్తకం లాంటివి. వాళ్ల గురించి ఏ విషయం తెలిసినా సామాన్య జనాలు ఊరుకోరు. సెలబ్రిటీల గురించి, వాళ్ల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని చాలామంది ఆరాటపడుతుంటారు. తాజాగా ఒకప్పటి నటి, సీనియర్ హీరోయిన్ లక్ష్మీ జీవితం గురించి తాజాగా కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. తన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ.. తన వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలియదు.

తను ఒక అమ్మగా, అమ్మమ్మగా, ఇతర క్యారెక్టర్లలో జీవించేస్తుంది. ఓ బేబీ సినిమాలోనూ తను ప్రధాన పాత్ర పోషించింది. మురారి సినిమాలోనూ తన పాత్రకు మంచి పేరు వచ్చింది. నిజానికి తను 15 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం తనకు 70 ఏళ్లు దగ్గరికి వస్తున్నా.. ఇంకా తన సినిమా ఇండస్ట్రీలో అడపా దడపా సినిమాలు చేస్తోంది. ఇక.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది లక్ష్మీ. లక్ష్మీకి 15 ఏళ్ల వయసులోనే భాస్కర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది.

why senior actress laxmi married three times

why senior actress laxmi married three times

Senior Actress Laxmi : 15 ఏళ్ల వయసులోనే భాస్కర్ అనే వ్యక్తితో లక్ష్మీకి వివాహం

అయితే.. పెళ్లయిన ఐదేళ్లకే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటికే లక్ష్మికి ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తున్నాయి. హీరోయిన్ గా సెటిల్ అయింది. అయితే.. సినిమా ఇండస్ట్రీలో లక్ష్మీ ఉండటం తన భర్తకు నచ్చకపోవడం, ఇతర కారణాలతో లక్ష్మీకి విడాకులు ఇచ్చేశారు. ఆ తర్వాత మలయాళం నటుడు మోహన్ శర్మను ప్రేమించి.. అతడిని మళ్లీ పెళ్లి చేసుకుంది. కానీ.. వాళ్లు కూడా ఎక్కువ కాలం కలిసి జీవించలేదు. 1980 లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. చివరకు 1987 లో శివచంద్రన్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది