Sreemukhi : కేవలం ఆ షో కోసం శ్రీముఖి ఇంత పని చేసిందా? ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది? షాక్ అవుతున్న నెటిజన్లు

Authored By Jagadesh Gatla | The Telugu News | Published on: September 10, 2022, 12:30 pm

Sreemukhi : శ్రీముఖి అంటేనే మైక్.. మైక్ అంటేనే శ్రీముఖి. అసలు ఎలాంటి మైక్ లేకుండానే అందరికీ వినపడేలా అరవగలిగే సత్తా ఉన్న యాంకర్ శ్రీముఖి. పుట్టడమే మైక్ తో పుట్టినట్టుగా లేదంటే మైక్ ను మింగేసి మాట్లాడినట్టుగా ఆమె మాట్లాడితే చాలు.. చెవులు దద్దరిల్లిపోవాల్సిందే. అందుకేనేమో.. తను తెలుగు బుల్లితెర మీద బెస్ట్ యాంకర్ అనిపించుకుంది. బుల్లితెర మీద చాలామంది యాంకర్లు ఉన్నప్పటికీ.. శ్రీముఖికి ఉండే స్థానమే వేరు. తనకి సపరేట్ బ్యాచ్. కల్ట్ బ్యాచ్ అంటారు కదా అలా అన్నమాట. ఏది ఏమైనా.. తన యాంకరింగే కాదు.. అందంతోనూ శ్రీముఖి అదరగొట్టేస్తుంది. తన మాటలతో మాయ చేస్తుంది.

నిజానికి.. తెలుగులో టాప్ యాంకర్ అంటే సుమ అని చెప్పాలి. కానీ.. సుమ తర్వాత అంత క్రేజ్ వచ్చింది శ్రీముఖికే. ఆ తర్వాత లిస్టులో అనసూయ, రష్మీ ఉంటారు. సోషల్ మీడియాలోనూ శ్రీముఖికి ఉన్న ఫాలోయింగ్ మామూల్ది కాదు. సోషల్ మీడియాలో మిలియన్లు ఫాలోవర్స్, అభిమానులు తనకు ఉన్నారు. సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ అవీ ఇవీ చేస్తూ శ్రీముఖి చేసే రచ్చ మామూలుగా ఉండదు.

Sreemukhi : డాన్స్ ఐకాన్ షోలో శ్రీముఖి వేసుకున్న డ్రెస్ ను చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు

why Sreemukhi took such dare decision for the show

why Sreemukhi took such dare decision for the show

ప్రస్తుతం యాంకరింగ్ స్థానం నుంచి జడ్జి స్థానానికి వెళ్లిపోయింది శ్రీముఖి. ఈటీవీలో జాతిరత్నాలు అనే కామెడీ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. అలాగే జెమినీ టీవీలో ప్రసారం అయ్యే డాన్స్ ఐకాన్ అనే షోకు కూడా జడ్జిగా ఉంది. ఈ షోకు ఓంకార్ యాంకర్. అయితే.. ఈ షోలో శ్రీముఖి వేసుకున్న డ్రెస్ చూసి అందరి మతి పోయింది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు కానీ.. నెటిజన్లు కానీ ఆమె డ్రెస్ చూసి అవాక్కయిపోయారు. శ్రీముఖి ఏంటి ఇలాంటి డ్రెస్ వేసుకోవడం ఏంటి.. ఇలా రెచ్చిపోయి అందాలను ఆరబోస్తుందేంటి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. కేవలం షో కోసమే అలా రెడీ అయిందా లేక సినిమాల్లో అవకాశాల కోసం అలా అందాలను ఆరబోస్తోందా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా.. తన అందాలను మాత్రం ఏమాత్రం సంకోచించకుండా శ్రీముఖి ఆరబోయడం తన డేర్ నెస్ అని… ఇలాంటి ట్రెండ్ నే శ్రీముఖి కొనసాగిస్తే త్వరలో స్టార్ హీరోయిన్ అయ్యే చాన్సెస్ మెండుగా ఉన్నాయని సినీ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp