Guppedantha Manasu : రిషి మీద పగ తీర్చుకోవడానికి సాక్షి, దేవయాని మరో ప్లాన్.. ఈ విషయం రిషికి తెలిసి షాకింగ్ నిర్ణయం

Authored By Varun G | The Telugu News | Updated on: August 21, 2022, 10:53 am

Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 22 ఆగస్టు 2022, సోమవారం ఎపిసోడ్ 535 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్లాస్ రూమ్ లో వసుధర డిస్టర్బ్ గా ఉండటం చూసి రిషి షాక్ అవుతాడు. తను ఎందుకు ఇంత డిస్టర్బ్ గా ఉంది అనుకొని ఏం చేయాలో అర్థం కాదు. యూనివర్సిటీ టాపర్ కావాల్సిన వసుధర.. ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అని అనుకుంటాడు. తర్వాత మహీంద్రా జగతితో మాట్లాడుతూ ఉండగా.. అక్కడికి వచ్చిన గౌతమ్.. రిషి గురించి మాట్లాడుతాడు. రిషి ఈ కాలేజీ ఎండీ అతడి గురించి అలా మాట్లాడొచ్చా అని అంటుంది జగతి. ఆ తర్వాత మహీంద్రా చాలా సంతోషంగా ఉండటం చూసి ఏమైంది అంకుల్ అంటాడు గౌతమ్. తర్వాత రిషి సర్ తో మీటింగ్ ఉంది వెళ్లాలి అని మహీంద్రాతో చెబుతుంది జగతి.

will devayani new strategy works in guppedantha manasu

will devayani new strategy works in guppedantha manasu

ఆ తర్వాత రిషితో మీటింగ్ కోసం మహీంద్రా, జగతి ఇద్దరూ వెళ్తారు. ఫైనల్ ఎగ్జామ్స్ కోసం మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. టీచర్లు అందరితో మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. ఫైనల్ ఎగ్జామ్స్ కు రెడీ అవ్వాలని చెబుతాడు. అందరూ వెళ్లిపోయాక.. జగతిని ఆపి మేడమ్ మీరు వసుధర విషయంలో కాస్త దృష్టి పెట్టండి అంటాడు. తను యూనివర్సిటీ టాపర్ కావాలి. కానీ.. ఇప్పుడు తన ప్రవర్తన బాగాలేదు.. తను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే చదవడం కష్టం అంటాడు.

Guppedantha Manasu : దేవయానితో మాట్లాడిన సాక్షి

మరోవైపు దేవయానిని సాక్షి కలుస్తుంది. ఏమైంది నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అంటుంది దేవయాని. రిషి కోసం ఎంత ఆరాటపడ్డావు. ఇప్పుడు ఇలా చేస్తావని అనుకోలేదు అంటుంది దేవయాని. రిషిని నువ్వు పెళ్లి చేసుకోకుండా రిజెక్ట్ చేస్తావని అనుకోలేదు అంటుంది.

నేను ఎంతో కష్టపడి రిషితో సెట్ చేపిస్తే నువ్వు ఇలా చేస్తావా? ఇప్పుడు చూడు ఏమైందో అంటుంది దేవయాని. రిషి.. నాతో సరిగ్గా ఉండకుంటే నేనేం చేయాలి. రిషి నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. ఎప్పుడు వసుధరను కలవరిస్తుంటే నాకు రిషిని పెళ్లి చేసుకోవాలనిపించలేదు అంటుంది సాక్షి.

ఆ తర్వాత రిషి.. వసుధర పని చేసే హోటల్ కు వెళ్తాడు. అక్కడ వసు ఉండదు. మేనేజర్ ను అడిగితే 10 వేలు కావాలని తీసుకొని వెళ్లింది అంటాడు. దీంతో డబ్బులు ఎందుకు అడిగింది అని అనుకుంటాడు. తనకు డబ్బులు కావాలంటే నన్ను అడగొచ్చు కదా అని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp