Janaki Kalaganaledu : గుడిలోనే జ్ఞానాంబ ఫ్యామిలీ వేరుపడతారా? దసరా రోజే జ్ఞానాంబ ఇల్లు ముక్కలు.. అసలు ట్విస్ట్ ఏంటంటే?

Authored By Varun G | The Telugu News | Published on: October 23, 2022, 9:30 am

Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. జానకి కలగనలేదు సీరియల్ 24 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 415 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి.. విజయ దశమి సందర్భంగా గుడికి వెళ్లేందుకు, అక్కడ ప్రసాదం వండేందుకు అన్నీ సమకూర్చుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన గోవిందరాజు పదండి వెళ్దాం.. అన్నీ సర్దావా అని అడుగుతాడు. దీంతో అన్నీ సర్దాను మామయ్య.. మల్లిక వాళ్లు రావాలి అంటుంది. ఇంతలో మల్లిక చేతిలో సంచితో అక్కడికి వస్తుంది అవేంటి అని అడుగుతుంది జానకి. దీంతో గుడిలో అమ్మవారికి ప్రసాదం వండాలి కదా అని అడుగుతుంది. నేను తెస్తున్నాను అన్నా కూడా మల్లిక వినదు. ఎలాగూ రేపటి నుంచి వేరు కాపురం పెట్టాల్సిన వాళ్లమే కదా.. అందుకే నేను అమ్మవారికి ప్రసాదం వండిపెడతా అని అంటుంది.

will janaki also seperate from jnanamba family

will janaki also seperate from jnanamba family

జానకి ఎంత చెప్పినా మల్లిక మాత్రం వినదు. దీంతో వద్దని జ్ఞానాంబ.. జానకిని వారిస్తుంది. ఆ తర్వాత అందరూ బయటికి వస్తారు. కారులో మీరు అత్తయ్యతో పాటు వెళ్లండి అని మల్లిక, జెస్సీకి చెబుతుంది జానకి. కానీ.. మల్లిక మాత్రం ఏం వద్దు.. మేము ఆటోలో వెళ్తాం. ఇప్పటి నుంచే వేరుగా బతకడం నేర్చుకోవాలి కదా అని విష్ణును తీసుకొని వెళ్తుంది మల్లిక. వాళ్లను చూసి అఖిల్ కూడా మనం గుడికి నడుచుకుంటూ వెళ్దాం పదా అని జెస్సీని తీసుకొని వెళ్తాడు. ఇద్దరు కొడుకుల ప్రవర్తన చూసి జ్ఞానాంబకు ఏం చేయాలో అర్థం కాదు. అక్కడే కూలబడిపోతుంది. దీంతో తనకు సర్దిచెప్పి రామా, జానకి తనను గుడికి తీసుకెళ్తారు.

మరోవైపు గుడిలోనే మరో ప్లాన్ వేసి జ్ఞానాంబ ఫ్యామిలీ పరువు తీయాలని అనుకుంటుంది మల్లిక. అందుకే గుడికి నీలావతిని రమ్మని చెబుతుంది. కానీ.. నీలావతి తను రాకుండా మరో మహిళను పంపిస్తుంది.

Janaki Kalaganaledu : ప్లాన్ మొత్తం ఆ మహిళకు చెప్పి రెచ్చిపోవాలని చెప్పిన మల్లిక

దీంతో నీలావతి కోసం వెయిట్ చేస్తున్న మల్లిక దగ్గరికి ఆ మహిళ వచ్చి మీ నీలావతి పెద్దమ్మ నన్ను పంపించింది అని అంటుంది. సరే.. ప్లాన్ గుర్తుంది కదా అని తన అత్త జ్ఞానాంబ రాగానే ఏం చేయాలో చెబుతుంది మల్లిక.

మరోవైపు తనే సొంతంగా పొంగళి వండుతూ ఉంటుంది మల్లిక. ఇంతలో అక్కడికి జ్ఞానాంబ ఫ్యామిలీ వస్తారు. వాళ్లను చూడగానే ఆ మహిళ రెచ్చిపోతుంది. ఏంటి మల్లిక మీది ఉమ్మడి కుటుంబం కదా.. ఇలా నువ్వు ఒక్కదానివే పొంగళి వండుతున్నావేంటి అని జ్ఞానాంబ ముందే మల్లికను అడుగుతుంది.

ఒక్కోసారి పరిస్థితులు అలా మారిపోతాయి పిన్ని అంటుంది. విజయ దశమి తర్వాత మేము విడిపోతున్నాం అని చెప్పబోతుండగా అడ్డుకుంటుంది జానకి. ఎందుకు ఆపుతున్నావు తనను అంటుంది.

ఆ తర్వాత  మహిళపై సీరియస్ అవుతుంది జానకి. మా ఇంట్లో విషయాల గురించి మీకెందుకు అంటుంది. అత్తయ్య గారే మల్లిక కడుపుతో ఉందని పొంగళి వండమని చెప్పింది అని జానకి కవర్ చేస్తుంది.

ఆ తర్వాత అందరూ కలిసి అమ్మవారికి పొంగళి వండి సమర్పిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp