Janaki Kalaganaledu : జానకిని మెచ్చుకున్న జ్ఞానాంబ.. జానకి ఐపీఎస్ విషయం కూడా తెలుస్తుందా? జ్ఞానాంబ నిర్ణయం ఏంటి?
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. జానకి కలగనలేదు సీరియల్ 27 జూన్ 2022, సోమవారం ఎపిసోడ్ 330 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి తలకు గాయం అవడంతో జ్ఞానాంబ ఫ్యామిలీ మొత్తం టెన్షన్ పడుతుంది. తర్వాత జానకికి డాక్టర్ వచ్చి ట్రీట్ మెంట్ చేసి పెద్ద ప్రమాదం నుంచి జానకి బయటపడిందని చెబుతుంది. తనను కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని చెబుతుంది. ఆ తర్వాత డాక్టర్ వెళ్లిపోతుంది. రామా జానకిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. మీ లాంటి భార్య నాకు దొరకడం చాలా అదృష్టం అంటాడు. మరోవైపు మల్లికకు చాలా కోపం వస్తుంది. తను శివుడికి అభిషేకం చేయడంతో తన కాళ్లకు నొప్పులు పుడుతాయి.

will janaki forgive jnanamba in janaki kalaganaledu
కట్ చేస్తే రాత్రి అవుతుంది. జానకి అన్నం తినడం కోసం డైనింగ్ టేబుల్ మీద కూర్చొంటుంది. ఇంతలో అక్కడికి జ్ఞానాంబ వస్తుంది. తనను క్షమించమని జానకిని వేడుకుంటుంది. దీంతో అయ్యో అత్తయ్య గారు మీరు అలాంటి మాటలు మాట్లాడకండి అంటుంది జానకి. మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి అని అంటుంది. మీరు అలా అడగకండి.. మీరు పెద్దవాళ్లు.. అమ్మలాంటి వాళ్లు.. మీకు నన్ను తిట్టే హక్కు ఉంది. నాలుగు మాటలు అనే హక్కు కూడా ఉంది అని జానకి.. జ్ఞానాంబకు చెబుతుంది.
Janaki Kalaganaledu : నిన్ను అర్థం చేసుకోలేకపోయానని జానకితో అన్న జ్ఞానాంబ
నా కోడలు నిజాయితీ గురించి నాకు తెలుసు కానీ.. కొందరి చెప్పుడు మాటలు విని.. నా కళ్ల ముందు జరుగుతున్న నిజాన్ని గ్రహించలేకపోయాను అంటుంది జ్ఞానాంబ. ఏది ఏమైనా నువ్వు నన్ను క్షమించాల్సిందే అని వేడుకుంటుంది జ్ఞానాంబ.
మరోవైపు రామా అప్పుడే జానకి కోసం అన్నం తీసుకొస్తాడు. తినండి జానకి అంటాడు. అక్కడే ఉన్న జ్ఞానాంబ నేను తినిపిస్తా అంటుంది. వద్దులే అత్తయ్య గారు నేను తింటా అన్నా కూడా వినదు జ్ఞానాంబ. ఈ అమ్మను తినిపించనివ్వు.. ఇవ్వు అంటూ తనకు అన్నం తినిపిస్తుంది జ్ఞానాంబ.
జ్ఞానాంబ.. జానకికి అన్నం తినిపించడం చూసి మల్లికకు కోపం కట్టలు తెంచుకుంటుంది. అయ్యో.. ఏంటిది అని అనుకుంటుంది మల్లిక. జానకికి జ్ఞానాంబ అన్నం తినిపించడం చూసి అందరూ సంతోషిస్తారు. ఆమెకు మర్యాదలు చేస్తున్నారు. నన్ను మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అని తెగ బాధపడుతుంది మల్లిక.
ఎన్ని ప్లాన్లు వేసినా.. జానకి, జ్ఞానాంబ ఇద్దరూ కలిసిపోతున్నారు కానీ.. వాళ్ల మధ్య వైరం పెరగడం లేదని తెగ బాధపడుతుంది మల్లిక. జ్ఞానాంబ ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.