Intinti Gruhalakshmi : 20 లక్షలు కాజేసింది లాస్య అని తులసికి తెలుస్తుందా? లేక.. తులసిని అరెస్ట్ చేస్తారా? అంకిత ఆ డబ్బులు ఇస్తుందా?
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ సోమవారం 27 జూన్ 2022, ఎపిసోడ్ 669 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి డబ్బులు ఇస్తుందని చెప్పడంతో అవి తీసుకోవడం కోసం శృతి తన ఇంటికి బయలుదేరుతుంది. మరోవైపు డబ్బులు రాగానే ఏం కొనుక్కోవాలో లిస్ట్ రాస్తుంటాడు ప్రేమ్. నేను డబ్బులు తీసుకొస్తా నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా అని చెప్పి తులసి ఇంటికి శృతి బయలుదేరుతుంది. మరోవైపు ఈరోజు డబ్బులు అకౌంట్ లో పడుతాయని తులసి సంతోషంలో ఉంటుంది.
తనకు కాళ్లు చేతులు ఆడవు. ఎప్పుడూ మొబైల్ పట్టుకొని మెసేజ్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటుంది తులసి. ఇంతలో పరందామయ్య, అనసూయ, అంకిత, దివ్య.. ఎందుకు ఊరికే మొబైల్ పట్టుకొని చూస్తున్నావు అని అడుగుతారు. దీంతో డబ్బులు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా అందులో నుంచి 5 లక్షలు ప్రేమ్ కు ఇవ్వొచ్చు అని అంటుంది తులసి. ఇంతలో తన మొబైల్ కు 20 లక్షలు తన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయినట్టు మెసేజ్ వస్తుంది. దీంతో తులసి సంతోషిస్తుంది. వెంటనే అందరూ నోటిని తీపి చేసుకుంటారు.
Intinti Gruhalakshmi : శృతికి ఫోన్ చేసి ఇంటికి రమ్మన్న తులసి
డబ్బులు అకౌంట్ లో పడటంతో తులసి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. వెంటనే శృతికి ఫోన్ చేసి ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్లాలని చెబుతుంది తులసి. దీంతో దారిలో ఉన్నా అని చెబుతుంది శృతి. మరోవైపు ఇంట్లో వాళ్లంతా చాలా సంతోషంగా ఉంటారు.
ఇంతలో తులసి సెల్ కు మరో మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ను చూసి అంకిత షాక్ అవుతుంది. మీ అకౌంట్ లో నుంచి 20 లక్షలు కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది అంటుంది. దీంతో తులసి షాక్ అవుతుంది. అదేంటి అలా డబ్బులు కట్ అవడం ఏంటి అని అంటుంది తులసి.
ఇంతలో శృతి అక్కడికి వస్తుంది. 20 లక్షలు అకౌంట్ లో నుంచి కట్ అయ్యాయి అని తెలియగానే శృతి కూడా షాక్ అవుతుంది. బ్యాంకు నుంచి ఏదైనా పొరపాటు జరిగి ఉంటుందని తులసి వెంటనే బ్యాంక్ మేనేజర్ కు ఫోన్ చేస్తుంది. దీంతో మీరే చెక్ ద్వారా డబ్బులు డ్రా చేసుకున్నారు కదా అంటాడు బ్యాంక్ మేనేజర్.
దీంతో నేను డ్రా చేసుకోలేదు అంటుంది తులసి. మీరంటే.. మీరు సంతకం పెట్టిన చెక్ ద్వారా డబ్బులు అకౌంట్ లో నుంచి వేరే అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ అయ్యాయి అంటాడు. దీంతో ఇదంతా కావాలని బ్యాంక్ ఏజెంట్ చేసిన మోసం అని తెలుసుకుంటారు. అతడు ఇచ్చిన జీరాక్స్ డాక్యుమెంట్స్ చూసి ఇవన్నీ ఫేక్ అని తెలుసుకుంటుంది అంకిత. ఇప్పుడు పోలీసులను ఆశ్రయించినా మనకే సమస్య అవుతుంది అని తులసితో చెబుతుంది అంకిత.
మరోవైపు నందు తులసి ఇంటికి కోపంగా వెళ్తాడు. ఒకరిని మోసం చేసి బతికేవాడు ఎప్పటికీ బాగుపడడు అని అనసూయ తులసితో అంటుండగా.. అక్కడికి వచ్చిన నందు.. ఈ సూత్రం అందరికీ వర్తిస్తుంది అంటాడు. ఎదుటివాళ్లను మోసం చేసి పబ్బం గడుపుకుందాం అనుకునే వాళ్లకు దేవుడు ఇలాంటి శిక్షే వేస్తాడు.. మోసపోయేలా చేస్తాడు. ఇంతవరకు నువ్వు ఏం సాధించావు. నీ చేతగానితనంతో నిన్ను నమ్ముకున్నవాళ్లను కూడా నట్టేట ముంచుతున్నావు అని నందు.. తులసిపై సీరియస్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.