Intinti Gruhalakshmi : మూతబడిన తులసి ఫ్యాక్టరీ.. దీని వెనుక ఉన్నది లాస్యేనని తెలిసి తులసి షాకింగ్ నిర్ణయం?
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ సోమవారం ఎపిసోడ్ 23 ఏప్రిల్ 2022, 614 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గాయత్రి తులసి ఇంటికి వెళ్లి అభి, అంకితను తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అభి.. తన ఎదుగుదలకు తన తల్లి అడ్డంగా ఉందని తన ఫ్రెండ్ తో చెప్పిన విషయం తెలిసిందే. ఫోన్ లో తన తల్లి గురించి ఫ్రెండ్ తో మాట్లాడుతున్న విషయాన్ని విన్న తులసి.. గాయత్రితో మాట్లాడి.. వాళ్లను తనతో తీసుకెళ్లాలని కోరుతుంది.
అయితే.. ఆ రోజు రాత్రే.. అంకితతో తులసి మాట్లాడుతుంది. నువ్వు మీ అమ్మతో వెళ్లిపోవాలని చెబుతుంది. మీ ఎదుగుదల కోసం మీరు ఈ ఇంట్లో నుంచి వెళ్లండి. అభి భవిష్యత్తు కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నా అని చెబుతుంది తులసి. చివరకు అంకితను ఎలాగోలా ఒప్పిస్తుంది. తెల్లారాక ఇంట్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇంతలో గాయత్రి వచ్చి.. అభి, అంకితను తీసుకెళ్లేందుకు వచ్చానని చెబుతుంది. దీంతో అభి, పరందామయ్య, అనసూయ షాక్ అవుతారు.
Intinti Gruhalakshmi : అభి, అంకిత వెళ్లిపోయిన విషయం ప్రేమ్ కు తెలుస్తుందా?
చివరకు అభి, అంకితను ఇంట్లో నుంచి పంపించేస్తుంది తులసి. గాయత్రి ఇద్దరినీ తీసుకొని వెళ్లిపోతుంది. దీంతో తులసి కుప్పకూలిపోతుంది. దివ్యకు తులసి మీద కోపం వస్తుంది.
ఇప్పటికే డాడీ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. చివరకు ప్రేమ్ అన్నయ్యను కూడా ఇంట్లో నుంచి పంపించేశావు. ఇప్పుడు అభి అన్నయ్యను పంపించేశావు అని దివ్య.. తులసిపై సీరియస్ అవుతుంది. నీకేదో సమస్య అని చెప్పావు కదా.. ఈరోజుతో సాల్వ్ అయినట్టే కదా మామ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దివ్య.
కట్ చేస్తే అభి, అంకిత.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన విషయం ప్రేమ్ కు తెలియదు. శృతి.. బట్టలు ఆరేస్తుండగా అక్కడికి వచ్చిన ప్రేమ్.. ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో.. నేను బట్టలు ఆరేస్తాను అంటాడు ప్రేమ్. ఆ తర్వాత కాసేపు ఇద్దరూ ఒక ఫన్ చాలెంజ్ పెట్టుకుంటారు.
మరోవైపు తులసి ఫ్యాక్టరీని అధికారులు మూసేస్తారు. ఈ విషయం తెలిసిన తులసి వెంటనే అక్కడికి కంగారుగా వెళ్తుంది. తులసి ఫ్యాక్టరీ మూతపడటం ఖాయం అని భాగ్య.. లాస్యతో అంటుంది. నిజంగానే ఆ ఫ్యాక్టరీ డాక్యుమెంట్స్ లో లొసుగులు ఉన్నాయంటావా అని లాస్య అంటుంది.
మీ ఫ్యాక్టరీ ఉన్న స్థలం ప్రభుత్వానిదని.. దాన్ని అక్రమంగా ఆక్యుపై చేశారు అని అధికారులు తులసితో చెబుతారు. దీంతో తులసితో పాటు.. పనివాళ్లు అందరూ వద్దండి.. ఫ్యాక్టరీని మూసేయకండి అని అడ్డుకుంటారు. దీంతో మీరు ఇలాగే చేస్తే పోలీసులను పిలవాల్సి వస్తుందని అధికారులు సీరియస్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.