Salaar Vs Guntur Kaaram : ఒకేసారి రెండు పెద్ద సినిమాలు రిలీజ్.. సలార్ దెబ్బను గుంటూరు కారం తట్టుకోగలదా?
Salaar Vs Guntur Kaaram : సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్య ఇదే. ఒకేసారి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే ఆ రెండింట్లో ఏదో ఒక సినిమాకు దెబ్బ పడిపోద్ది. అలాంటి సమస్యలు ఇదివరకు చాలా వచ్చాయి. ఒక సినిమా ప్రభావం మరో సినిమా మీద ఖచ్చితంగా పడుతుంది. ఇది పెద్ద పెద్ద పండుగలప్పుడే జరుగుతుంది. ఎందుకంటే.. మనకు ఉన్నవే మూడు నాలుగు పెద్ద పండుగలు. ఈ సమయంలోనే ఏ హీరో అయినా.. ఏ డైరెక్టర్ అయినా.. ఏ నిర్మాత అయినా తమ సినిమా రిలీజ్ కావాలని అనుకుంటారు. అక్కడే బెడిసికొడుతోంది. ఒకేసారి రెండు పెద్ద సినిమాలు ఏదైనా పండుగ పూట రిలీజ్ డేట్ పెట్టుకుంటే మొదటికే మోసం వస్తోంది.
ప్రస్తుతం అదే జరుగుతోంది. గుంటూరు కారం, సలార్ ఈ రెండు సినిమాలు కూడా ఒకేరోజు విడుదల కాబోతున్నాయి. దీని వల్ల ఏ సినిమాపై ఏ సినిమా ప్రభావం చూపిస్తుందో కానీ.. ఒకేరోజు రెండు సినిమాలు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అని ప్రేక్షకులు గగ్గోలు పెడుతున్నారు. సలార్ అనేది చిన్న ప్రాజెక్ట్ ఏం కాదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అక్కడ. కేజీఎఫ్ డైరెక్టర్. వాళ్ల కాంబోలో వచ్చే మూవీ అంటే ఇక మామూలుగా ఉండదు కదా. సలార్ సినిమాను జనవరి 12, 2024న సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మూవీ యూనిట్ సమాయత్తం అవుతోంది.

Salaar Vs Guntur Kaaram : ఒకేసారి రెండు పెద్ద సినిమాలు రిలీజ్.. సలార్ దెబ్బను గుంటూరు కారం తట్టుకోగలదా?
Salaar Vs Guntur Kaaram : మహేశ్ బాబు గుంటూరు కారం కూడా అదే రోజున రిలీజ్ కాబోతోందా?
ఇక.. మహేశ్ బాబు గుంటూరు కారం మూవీ కూడా వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. అయితే.. సలార్ అనేది పాన్ ఇండియా మూవీ. గుంటూరు కారం మాత్రం కేవలం ఒక తెలుగులోనే విడుదల కాబోతోంది. అంటే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే సలార్, గుంటూరు కారం మధ్య పోటీ నెలకొనబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో మాత్రమే ఈ రెండు సినిమాల మధ్య పోటీ రాబోతోంది. ఇద్దరూ పెద్ద స్టార్లే. పెద్ద హీరోలే. అందుకే.. ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అయితే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను ఎలా షేర్ చేస్తారో వేచి చూడాల్సిందే.