Intinti Gruhalakshmi : ప్రేమ్, శృతిని ఇంటి నుంచి తులసి ఎందుకు పంపించేసిందో నందు, లాస్యకు తెలుస్తుందా? బయటికెళ్లి ప్రేమ్, శృతి ఏం చేస్తారు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi : ప్రేమ్, శృతిని ఇంటి నుంచి తులసి ఎందుకు పంపించేసిందో నందు, లాస్యకు తెలుస్తుందా? బయటికెళ్లి ప్రేమ్, శృతి ఏం చేస్తారు?  

 Authored By gatla | The Telugu News | Updated on :6 March 2022,9:30 am

Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 7 మార్చి 2022, ఎపిసోడ్ 572 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి మనసు నిండా కుళ్లు కుతంత్రాలే అంటూ లాస్య రెచ్చిపోవడంతో ప్రేమ్ కు కోపం వస్తుంది. ఈ ఇంట్లో అందరినీ గుప్పిట్లో పెట్టుకోవడానికి తను ఎన్నో వేషాలు వేసింది. అంకితను పుట్టింటికి వెళ్లకుండా చేసింది.. అభిని తన అత్తారింటికి దూరం చేసింది అంటూ కోప్పడుతుంది లాస్య. చివరకు కోటీశ్వరుల సంబంధాన్ని నీకు కాకుండా చేసి.. అనాథ అయిన శృతిని నీకిచ్చి అంటకట్టింది అని ప్రేమ్ తో అంటుంది లాస్య. శశికళ దగ్గర తీసుకున్న అప్పు మీద నిజంగానే అంత వడ్డీ అయిందా లేక శశికళతో కుమ్మక్కయి అంత వడ్డీ అయినట్టు నాటకం ఆడుతుందా అని నందుతో తులసి గురించి అంటుంది లాస్య.

will tulasi regret after prem and sruthi leaves the house

will tulasi regret after prem and sruthi leaves the house

దీంతో లాస్య అంటూ కోపంతో రగిలిపోయిన ప్రేమ్.. లాస్యను కొట్టబోతాడు. దీంతో నా భార్యనే కొట్టబోతావా అని నందు.. ప్రేమ్ ను కొడతాడు. ఆ తర్వాత ప్రేమ్ కూడా నందు చొక్కా పట్టుకుంటాడు. అయినప్పటికీ.. తండ్రి చొక్కా పట్టుకుంటావా అని తులసి కోప్పడుతుంది. నీ ప్రవర్తనతో అందరి ముందు మీ అమ్మ తలదించుకునేలా చేశావు అంటుంది తులసి. ఇక్కడి దాకా వచ్చాక నేను ఊరుకుంటే నేనే తప్పు చేసిన దాన్ని అవుతాను అంటుంది తులసి. వెళ్లిపో.. వెంటనే శృతితో సహా ఇల్లు వదిలి వెళ్లిపో అంటుంది తులసి. దీంతో అందరూ షాక్ అవుతారు. నిజంగానే వెళ్లిపోమంటున్నావా అంటాడు ప్రేమ్. దీంతో అవును.. అవును అంటుంది తులసి.

ప్రేమ్ కాళ్లు పట్టుకున్నా కూడా తులసి కనికరించదు. దీంతో ప్రేమ్, శృతి.. ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత తులసి నీకోసం ప్రేమ్ ను ఇంట్లో నుంచి బయటికి పంపించలేదు అని నందుతో అంటుంది లాస్య. దీంతో తులసి మంచే చేసింది కదా అంటాడు నందు.

నీమీద గౌరవంతోనే.. ప్రేమ్ ఎదురు తిరిగాడనో పంపించలేదు తులసి అంటుంది లాస్య. తన ఇమేజ్ కన్నా.. నీ ఇమేజ్ ఎక్కడ పెరుగుతుందోనని ప్రేమ్ ను పంపించేసింది. నీకు విలువనిస్తున్నట్టు నటిస్తూ ప్రేమ్ ను ఇంట్లో నుంచి తరిమేస్తున్నట్టు నటిస్తుంది.

తన ఇమేజ్ ను కాపాడుకోవాలనే స్వార్థం. తన తల్లి ప్రేమను కూడా చంపుకొని కొడుకును తరిమేసిందంటే తులసి స్వార్థం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకో నందు అంటుంది లాస్య. ఇంట్లో వాళ్లు ఎలాగూ ఆలోచించరు. వాళ్లు తులసి మాయలో ఉన్నారు. కనీసం నువ్వయినా కళ్లు తెరువు. తులసిని గుడ్డిగా నమ్మకు. తులసి నిజస్వరూపం నువ్వు తెలుసుకొని ఇంట్లో వాళ్లకు కూడా చెప్పు అంటుంది లాస్య.

Intinti Gruhalakshmi : పరందామయ్యకు అసలు నిజం చెప్పిన తులసి

తులసి.. ఇంత నాటకం ఆడిందని నాకు తెలియదు లాస్య అంటాడు నందు. తులసి ఆటలు ఇక సాగనివ్వను లాస్య చూస్తూ ఉండు అంటాడు నందు. మరోవైపు ఇంట్లో వాళ్లంత ప్రేమ్ వెళ్లిపోయాడని బాధపడుతూ ఉంటారు. దివ్య, పరందామయ్య.. అనసూయ అందరూ బాధపడుతూ ఉంటారు.

ఇంతలో పరందామయ్య దగ్గరికి తులసి వచ్చి నా మీద కోపంగా ఉందా మామయ్య అని అడుగుతుంది తులసి. దీంతో లేదమ్మా భయంగా ఉంది. పొరపాటున మమ్మల్ని కూడా ఎక్కడ బయటికి పంపించేస్తావోనని భయం వేస్తోంది అంటాడు పరందామయ్య.

లాస్య రెచ్చగొట్టేలా మాట్లాడింది కాబట్టే.. ఎదురుతిరిగాడు అని అంటాడు. ఇంట్లో నుంచి దాని కోసమే తరిమేస్తామా.. అది కూడా కట్టుబట్టలతో. ఏదైనా ఈవెంట్ చేస్తేనే తప్ప వాడికి డబ్బులు రావు. చేతుల్లో డబ్బులు లేకుండా వాడు ఎలా బతుకుతాడు.. వాడి భార్యను ఎలా పోషిస్తాడమ్మా అంటాడు పరందామయ్య.

నీ కడుపున పుట్టినందుకు పిల్లలు అదృష్టవంతులు అనుకున్నా కానీ.. తల్లివన్న విషయం మరిచిపోయి ఇలా ప్రవర్తిస్తావని నేను అనుకోలేదు అంటాడు పరందామయ్య. వాడిని దూరంగా పంపి నువ్వు బతకగలవేమో కానీ.. నీకు దూరంగా వాడు ఉండలేడమ్మా అంటాడు పరందామయ్య.

చాలా పెద్ద శిక్ష వేశావమ్మా వాడికి అంటాడు పరందామయ్య. దీంతో అది వాడికి వేసిన శిక్ష కాదు.. ఈ కన్నతల్లి వేసుకున్న శిక్ష. నన్ను ఎవరూ అపార్థం చేసుకున్నా నేను పట్టించుకోను కానీ.. నా మనసు తెలుసుకున్న మీరే ఇలా చేస్తుంటే బాధేస్తుంది అంటుంది తులసి.

బిడ్డను తల్లి దండించినంత మాత్రాన రాక్షసి అయిపోదు. నేను ప్రేమ్ ను ఇంట్లో నుంచి బయటికి పంపించింది.. లాస్యను ఏదో అన్నాడనో.. తండ్రిని ఎదిరించాడనో కాదు.. జీవితం విలువ వాడు తెలుసుకోవాలని.. వాడి కాళ్ల మీద వాడు నిలబడాలని అంటుంది తులసి.

ఇన్నాళ్లు ఈ తల్లి వాడి బలం అనుకున్నాను కానీ.. ఆ తల్లే బలహీనత అనుకోలేదు. జీవితం అంటే తల్లి మాత్రమే అనుకుంటున్నాడు. నా వల్ల ఈవెంట్స్ వదిలేసుకుంటున్నాడు. నచ్చజెప్పాను. బతిమిలాడాను. మాట చెబితే వినకపోతే ఏం చేయను. వాడిని ఇంట్లో నుంచి పంపించేయడానికి దొరికిన అవకాశాన్ని వాడుకున్నాను. వాడు జీవితంలో గెలవాలనే ఆశ.. అంటుంది తులసి.

వాడు బాగుపడతాడనే నమ్మకం. ఈ నిజాన్ని మీకు తప్ప ఎవ్వరికీ చెప్పుకోలేను మామయ్య. వాడి మీద నాకు ఉన్న కోపానికి కారణం ఉంది.. తల్లిగా వాడి పట్ల బాధ్యత ఉంది. ఇప్పుడు చెప్పండి మామయ్య. నేను చేసింది తప్పా అని అంటుంది తులసి.

దీంతో నువ్వు చేసింది తప్పు కాదమ్మా.. కరెక్ట్ గానే చేశావు అంటాడు పరందామయ్య. సరే మీరు భోజనానికి రండి అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. పండుగ పూట అందరూ పస్తులు ఉండటం మంచిది కాదు అందరూ భోం చేయండి అంటుంది తులసి. కానీ.. ఎవ్వరూ భోజనాలు చేయరు.

ఇంతమందిని బాధపెట్టి ఇప్పుడు తినమంటున్నావా అంటుంది లాస్య. దీంతో ఆపుతావా నీ గోల అంటుంది తులసి. దీంతో కనీసం మా తరుపున అయినా ఎవరో ఒకరిని మాట్లాడనీయు మామ్ అంటుంది దివ్య. దీంతో తులసి షాక్ అవుతుంది.

ఒరేయ్ అభి, దివ్య.. ప్రేమ్ విషయంలో మీ అమ్మ చేసిన పని మీకు మంచి అనిపిస్తే.. హ్యాపీగా భోం చేయండి అని చెప్పి నందు భోజనం చేయకుండానే లేస్తాడు. దీంతో లాస్య, అభి, అంకిత, దివ్య అందరూ భోజనం చేయకుండానే లేస్తారు. దీంతో తులసి షాక్ అవుతుంది.

చివరకు అనసూయ, పరందామయ్య కూడా భోం చేయకుండానే లేచిపోతారు. దీంతో ఏం చేయాలో తులసికి అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది