Dimple Hayathi : హీరోయిన్ పేరుతో రాంగ్ కాల్స్.. వెంట‌నే కంప్లైంట్ చేయండంటూ సూచ‌న‌

Authored By Sam C | The Telugu News | Published on: February 15, 2022, 7:40 am

Dimple Hayathi : ఈ మ‌ధ్య కాలంలో కొంద‌రు ప్ర‌బుద్దులు హీరోయిన్స్ పేరుతో అమాయ‌కుల‌ని బురిడి కొట్టిస్తున్నారు. ఇటీవ‌ల అనుప‌మ పేరుతో కూడా త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేయ‌గా, వెంటనే స్పందించింది. ఓ నంబర్ షేర్ చేసి.. ఇది తనది కాదంటూ, అందరూ జాగ్రత్తగా ఉండండి అని అనుపమ చెప్పుకొచ్చింది. ఇక ఖిలాడీ బ్యూటీ డింపుల్ హ‌య‌తి కూడా త‌న అభిమానుల‌ని అప్ర‌మ‌త్తం చేసింది. ఒక అపరిచితుడు పలువురుకి ఫోన్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నట్టు తెలిపింది. ఆ నంబర్ ను కూడా తన అఫిషియల్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. గుర్తు తెలియని వ్యక్తి తనను అనుకరిస్తున్నాడని, ఎవరూ మోసపోకూడదని పేర్కొంది. తను తెలిపిన నంబర్ నుంచి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే బ్లాక్ చేసి…

ఫిర్యాదుచేయాలని తన పరిశ్రమ స్నేహితులకు విజ్ఞప్తి చేసింది.అబ్బాయిల‌కు నా లాగా మెసేజ్‌లు చేసి ఓ అపరిచితుడు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాడు. అతడితో జాగ్ర‌త్త‌గా ఉండండి. అలాంటి వాడు కాల్స్ లిఫ్ట్ చేయ‌కండి. వెంట‌నే బ్లాక్ చేయండి అంటూ అత‌డి నెంబ‌ర్ కూడా షేర్ చేసింది. మొత్తానికి ఇటీవ‌ల హీరోయిన్స్ ఇలాంటి ప‌రిస్థితులు ఎదుర్కొన‌డం కాస్త ఆందోళ‌న క‌లిగిస్తుంది. డింపుల్ చివ‌రిగా ర‌వితేజ న‌టించి ‘ఖిలాడి’ చిత్రంలో మెరిసింది. 19 ఏండ్లకే టాలీవుడ్ లో ‘గల్ఫ్’ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చిందీ సుందరి. అయితే పలు సినిమాల్లో నటిస్తున్నా పెద్దగా డింపుల్ హయాతీకి గుర్తింపు రాలేదు

wrong calls in the name of dimple hayathi

wrong calls in the name of dimple hayathi

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ మూవీలో డింపుల్ హయాతీ స్పెషల్ సాంగ్ లో నటించిన మాస్ గాళ్ల మనస్సులను కొల్లగొట్టింది. ఆ తర్వాత యురేఖ మూవీలోనూ నటించింది. కానీ పెద్దగా ఆశించినంత ఫేమ్ రాలేదు. ప్రస్తుతం రవితేజ నటించిన ‘ఖిలాడీ’లో మాస్ మహారాజా సరసన నటించి మెప్పించింది. తన గ్లామర్ తో కుర్రాళ్లను కట్టిపడేంది. ప్రస్తుతం అంతో ఇంతో ‘డింపుల్ హయాతీ’కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. సోష‌ల్ మీడియాలో త‌న అంద‌చందాల‌తో తెగ ర‌చ్చ చేస్తుంటుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp