Samantha Yashoda : స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు అధిక ప్రాధాన్యతనిస్తుంది. తాజాగా యశోద అనే చిత్రంతో పలకరించింది. దర్శక ద్వయం హరి మరియు హరీష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా కూడా ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రం గా తెరకెక్కింది. ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళీ శర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. యశోద చిత్రం మొదటి రోజు దేశవ్యాప్తంగా రూ.3.20 కోట్ల వసూలైనట్లు సమాచారం. వివిధ భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన యశోద మూవీ తెలుగులో 3 కోట్లు, హిందీలో 10 లక్షలు, తమిళంలో 10 లక్షలు, మలయాళంలో 10 లక్షలు వసూలు చేసింది.
అలా మొత్తంగా ఈ చిత్రం 3.25 కోట్ల వసూళ్లను రాబట్టగా.. ఓవర్సీస్‌లో వచ్చిన 80 లక్షలు కలిపితే మొత్తంగా ఫస్ట్ డే 5 కోట్ల వసూళ్లను రాబట్టింది. నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రానికి ఈ మాత్రం కూడా రాకపోవడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. నాగార్జునని మించిపోయిందిగా సమంత అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే యశోద మొత్తంగా 30 నుంచి 35 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని సమాచారం. మరో ప్రక్క ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ ఫామ్ కూడా ఫిక్స్ అయింది. ఈ చిత్రం డిజటల్ రైట్స్‌ను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది.
యశోద మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమాను ఇప్పుడప్పుడే ఓటీటీలో విడుదల చేసే అవకాశాలు కనిపించట్లేదు. కనీసం 4 లేదా 5 వారాలు తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్ కనిపించారు. రావురమేష్, సంపత్ కీలక పాత్రలు చేశారు. ఇటీవలే మయోసైటిస్ బారిన పడటంతో సమంత ప్రమోషన్స్‌లో సరిగా పాల్గొనలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించలేదు. అయినా సినిమా భారీగా కలెక్షన్స్ రాబడుతోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.