Yash : మూడు వంద‌ల‌తో బెంగ‌ళూరు వ‌చ్చిన య‌ష్‌.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడుగా..!

Authored By Sam C | The Telugu News | Published on: April 19, 2022, 3:30 pm

Yash : కేజీఎఫ్ ఫ్రాంచైజీలో వ‌చ్చిన రెండు చిత్రాల‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు య‌ష్‌. తాను నటించిన‌ కేజీఎఫ్​ ఛాప్టర్​ 2 సూపర్ హిట్ టాక్​తో దూసుకెళ్తోంది. దీనితో థియేటర్లలో వసూళ్ల సునామీ కొనసాగుతోంది. యష్‌ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కన్నడ ఇండస్ట్రీలో ఈ స్థాయికి ఎదగడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు. ప్రస్తుతం తాను ఇంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ, ఒకప్పుడు సాధారణ జీవితం గడిపాడు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. తన కెరీర్ మొదటిలో పడ్డ ఇబ్బందుల గురించి యశ్ ఇటీవల పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. కేవ‌లం సినీ అవ‌కాశాల కోస‌మే తాను మూడు వంద‌ల రూపాయ‌ల‌తో బెంగ‌ళూరు వ‌చ్చాన‌ని అన్నాడు.

కర్ణాటకలోని హసన్ జిల్లాలో పుట్టిన యశ్ ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. తండ్రి బస్‌ డ్రైవర్, తల్లి గృహిణి. కాగా యశ్‌ సినిమాల్లోకి వెల్లేందుకు వారి కుటుంబం అంగీకరించలేదు. కానీ వారు యష్‌ కోసం సినిమాల్లో ప్రయత్నించేందుకు తనకు కొంత సమయం మాత్రం ఇచ్చారు.ఆ లోపు ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటే ప‌ర్వాలేదు లేదంటే తాము చెప్పిన పనిలో చేరాలని సూచించారు. దీనికి అంగీకరించిన యశ్ తన తండ్రి నుంచి తీసుకున్న మూడు వందల రూపాయలతో బెంగళూరు చేరుకున్నాడు. మొదట సీరియల్స్‌లో అవకాశం దక్కించుకున్న య‌ష్‌ తర్వాత మెల్లిగా సినిమాల్లోకి అడుగుపెట్టా అని చెప్పుకొచ్చాడు.

yash comes to bangalore with 300 rupees

yash comes to bangalore with 300 rupees

Yash  : ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో..

కన్నడ చిత్రాలలో చిన్న చిన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్‌ కూడా చేశాడు య‌ష్‌. చివరకు 2008లో ‘రాకీ’ చిత్రంతో హీరోగా మారాడు. ఆ తర్వాత వచ్చిన వరుస హిట్‌లతో యశ్ కన్నడనాట స్టార్‌ హీరోగా ఎదిగాడు. ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఇక ఇటీవలే విడుదలైన ‘కేజీఎఫ్-2’తో బాలీవుడ్‌, టాలీవుడ్‌ అని తేడా లేకుండా పాన్‌ ఇండియా స్టార్‌గా యష్‌ అవతరించాడు. ఇప్పుడు య‌ష్ సినిమాలంటే కేవ‌లం క‌న్న‌డ‌లోనే కాదు దేశ విదేశాల‌లో మంచి ఆస‌క్తి నెల‌కొంది. ఆయ‌న న‌టించిన కేజీఎఫ్ 2 చిత్రం క‌న్న‌డ‌లో క‌న్నా వివిధ భాష‌ల‌లో ఎక్కువ‌గా వ‌సూళ్లు రాబ‌డుతున్నాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp