Yashika anand : నా వల్ల నా స్నేహితురాలు చనిపోయింది..సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ యాషికా ఆనంద్..
Yashika anand : కోలీవుడ్ హీరోయిన్ యాషికా ఆనంద్..ఈ మధ్య ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ చేయించుకుంటోంది. ఈమె మహాబలిపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాషికా ఆనంద్ ప్రాణ స్నేహితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. వీరితో పాటు ఉన్నా మరో ఇద్దరు స్నేహితులకి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరగడానికి కారణం యాషికా ఆనంద్. ఆగస్టు 4వ తేదీన యాషికా ఆనంద్ బర్త్ డే. అయితే తన బర్త్ డే సెలబ్రేషన్ ఎవరూ చేయొద్దని తన అభిమానులకు విఙ్ఞప్తి చేసింది.
దీనికి సంబంధించి సోషల్ మీడియాలోనూ తెలిపింది. ఇప్పుడు నేను నా జీవితంలో ఎప్పుడూలేని విధంగా బాధ పడుతున్నాను. ఆ బాధను నేను మాటల్లో చెప్పలేను. అసలు నేనింకా ప్రాణాలతో ఎందుకున్నానో అని ఎంతో కుమిలిపోతున్నాను. మహాబలిపురం వద్ద జరిగిన కారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలో.. లేక నా ప్రాణ స్నేహితురాలిని కోల్పోయినందుకు భగవంతుడిని నిందించాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను.
Yashika anand : యాషికా ఆనంద్ కోలుకొని రాగానే పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్దంగా ఉన్నారు.
మా స్నేహితురాలు పావనీ.. మా నుంచి శాశ్వతంగా దూరమయింది. ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతున్నాము. నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించవని నాకు తెలుసు. కానీ, నీ కుటుంబాన్ని బాధాకరమైన స్థితిలోకి నెట్టినందుకు నన్ను క్షమించు.. నువ్వు మళ్ళీ మా మధ్యకు రావాలని దేవుడిని కోరుకుంటున్నాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’.. అంటూ యాషికా ఆనంద్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులో రాసుకొచ్చింది. వద్దనుకొని కూడా యాషికా ఆనంద్ తన ముగ్గురు స్నేహితులతో లాంగ్ డ్రైవ్ కి వెళింది. డ్రైవింగ్ సమయంలో వీరు మధ్యం సేవించి ఉన్నారు. దానికి తోడు అతివేగం వీరిని ప్రమాదానికి గురి చేసింది. కాగా యాషికా ఆనంద్
కోలుకొని రాగానే పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్దంగా ఉన్నారు.