
Yatra 2 Movie Song : యాత్ర 2 సినిమా నుంచి ' చూడు నాన్న ' ఎమోషనల్ సాంగ్ రిలీజ్..!
Yatra 2 Movie Song : యాత్ర సినిమాకి సీక్వల్ గా ‘ యాత్ర 2 ‘ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ తెలుగు ప్రేక్షకుల గుండెలను తాకింది. ఆ టీజర్ తోనే సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. అయితే తాజాగా యాత్ర 2 సినిమా నుంచి ‘ చూడు నాన్న ‘ వీడియో సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సినిమా యాత్ర. ఈ సినిమాకు సీక్వెల్ గా యాత్ర 2 ఫిబ్రవరి 8న విడుదల కానుంది. వైయస్సార్ తనయుడు ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరు 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సినిమా ఉంటుంది.
తాజాగా ఈ సినిమా నుంచి వీడియో సాంగ్ విడుదలైంది. చూడు నాన్న అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ప్రముఖ గేయ రచయిత భాస్కరభట్ల ఈ పాటకు అద్భుతమైన సాహిత్యం అందించారు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఎమోషన్స్ తో కూడిన సంగీతాన్ని అందించారు. వై.యస్.జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా తనదైన నటనతో మెప్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఈ పాట ఉండడంతో అందరినీ మెప్పిస్తుంది. తండ్రి మరణం తర్వాత మొదటిసారి ప్రజల్లోకి వెళ్లిన వై.యస్.జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వేలాదిగా జనాలు తరలివస్తారు. ఆ సమయంలో జరిగిన కొన్ని ఘటనలను డైరెక్టర్ మహి వి. రాఘవ్ పాటలో చూపించారు.
యాత్ర 2 నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. మరోవైపు ఇటీవల లాంచ్ చేసిన టీజర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. తండ్రికొడుకులు మిలియన్ల సంఖ్యలలో జనాల మనసులో ఎలాంటి చెరగని ముద్ర వేసుకున్నారో తెలిపే ప్రయాణం నేపథ్యంలో సాగే చూడు నాన్న సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఓదార్పు యాత్రలో ఉన్న జీవా లుక్ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తుంది. ప్రజా సంక్షేమం కోసం తండ్రి ఆశయ సాధన కోసం వై.యస్.జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానాలను ఎలా నిలబెట్టుకున్నారు నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా చూసి ఏదో ఒక అప్డేట్ అందిస్తూ సూపర్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. కేవలం తండ్రి కొడుకుల జర్నీ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్లు సమాచారం.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.