Prabhas Marriage : ప్రభాస్ పెళ్లి భీమవరం అమ్మాయి తోనే .. క్లారిటీ ఇచ్చేసిన శ్యామలాదేవి..!
Prabhas Marriage : టాలీవుడ్ లో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అయితే అభిమానులకు ఎప్పటినుంచో డార్లింగ్ కి పెళ్లి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అవన్నీ కూడా రూమర్స్ గానే మిగిలాయి. ఇక ఇటీవల ఏఐ ఇమేజెస్ తో ప్రభాస్ పెళ్లి అయినట్లు వైరల్ అయ్యాయి. ఏఐ ఇమేజెస్ తో ప్రభాస్ అనుష్కతో పెళ్లి అయినట్లుగా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ప్రభాస్ వీటన్నింటికీ చెక్ పెడుతూ నా పెళ్లి ఎప్పుడో నేనే మీకు స్వయంగా చెబుతానని ఇలాంటి రూమర్స్ నమ్మవద్దని అన్నారు. అయితే తాజాగా ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరగబోతుందని ఓ న్యూస్ బయటకు వచ్చింది.
మార్చి 17న ప్రభాస్ నిశ్చితార్థానికి సంబంధించి వార్త బయటకు రానుంది. మార్చి 17న ప్రభాస్ నిశ్చితార్థం జరగనుందట. ఆ తరువాత నెల గ్యాప్ లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సమాచారం. ఈ విషయాన్ని కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి అఫీషియల్ గా ప్రకటించారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే ఆమె భీమవరంకు చెందిన అమ్మాయి అని అంటున్నారు. ప్రభాస్ రిలేటివ్స్ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడని చెబుతున్నారు. అయితే ఆ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటనే విషయాలు ఇప్పటివరకు బయటకి రాలేదు. ప్రభాస్ అభిమానులు మాత్రం డార్లింగ్ పెళ్లి ఎప్పుడు అవుతుందని ఎదురుచూస్తున్నారు.
అయితే శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి ఏప్రిల్ 22న జరుగుతుందని, మార్చి 17న నిశ్చితార్థం జరుగుతుందని అనౌన్స్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరంలో ప్రభాస్ పెళ్లి కచ్చితంగా ఉంటుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇకపోతే ప్రభాస్ అనుష్క జోడి కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఫాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. కానీ వీరిద్దరూ పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదు. అయితే అనుష్క కూడా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. 40 ఏళ్లు దాటుతున్నా ఆమె కూడా పెళ్లి చేసుకోకపోవడంతో అందరికీ సందేహాలు వస్తున్నాయి. ప్రభాస్ అనుష్కలకు ఒకరిపై ఒకరికి ఇష్టమున్న పెళ్లి చేసుకోవడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారా అని ఆలోచిస్తున్నారు.
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
This website uses cookies.