Young Heroes : పరిశ్రమ ఎవడబ్బ సొత్తు కాదు.. ఎవడు కష్టపడితే వాడే కింగ్.. ఎవడి సినిమా ఆడితే వాడే తోపిక్కడ..!
Young Heroes : తెలుగు ఇండస్ట్రీకి కొత్త కళ వచ్చిందా.. యువరక్తం పరుగులు తీస్తున్న ఈ టైం లో ఇండస్ట్రీకి హిట్లు సూపర్ హిట్లు వారే ఇచ్చేలా ఉన్నారు. ఏళ్ల తరబడి ఇండస్ట్రీని ఏలుతున్న సీనియర్ స్టార్లు ఒక పక్క ఉండగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తెలుగు తెర మీద అద్భుతాలు చేస్తున్నారు యువ కళాకారులు. ముఖ్యంగా యువ హీరోలు ఎంచుకుంటున్న కథలు.. సినిమా కోసం పడే కష్టం చూస్తే అవాక్కవ్వక తప్పదు. ప్రేక్షకులను అలరించడమే ముఖ్య ఉద్దేశంతో సినిమా కోసం ఎంతటి రిస్క్ అయినా పడుతున్నారు నేటి యువ హీరోలు.
అంతేనా కొందరు తమ కథని తామే రాసుకుంటూ కూడా తమని తాము ప్రెజెంట్ చేసుకుంటున్నారు. ఏం చేసినా ఎలా చేసినా వారి లక్ష్యం ఒకటే ప్రేక్షకులను అలరించడం. సినిమా లేకపోతే మరొక ఆలోచనే లేదనుకునే వారే ఇక్కడ ఉంటున్నారు. ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలంటే బ్యాక్ గ్రౌండ్ ఉండాలి.. బోలెండత ఆస్తి ఉండాలి అన్న రొటీన్ మాటలు రాకుండా నీలో టాలెంట్ ఉంటే చాలు అవకాశాలు నిన్నే వెతుక్కుంటూ వస్తాయని చూపెడుతున్నారు నేటి యంగ్ హీరోస్. సినిమా మీద వారికున్న కమిట్ మెంట్ ఎలాంటిది అంటే ఓ పక్క సినిమా చేస్తున్న టైం లో ఎలాంటి సందర్భం వచ్చినా సరే దాన్ని ఫేస్ చేసేందుకు అన్నివిధాలుగా కృషి చేస్తున్నారు.
ఎంత కష్టం వచ్చినా సరే సినిమాతో ప్రేక్షకులని అలరించాలనే ఒక్క ఆలోచనే వారి మైండ్ లో ఉంటుంది. టాలీవుడ్ యువ హీరోలు ఇండస్ట్రీ కోసం వారి కెరియర్ కోసం కష్టపడుతున్న తీరు సీనియర్స్ కు ముచ్చటేస్తుంది. వారి సినిమాలకు వారే కర్త కర్మ క్రియ అనేలా చేస్తున్నారు. సినిమా కోసం ఓ విధంగా గొడ్డు కష్టపడినట్టు కష్టపడి సినిమా హిట్ అయితే అంతకంత జోష్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదో విధంగా తెలుగు సినిమాకు మంచి తరుణమని చెప్పొచ్చు. ఇలానే కొనసాగితే మాత్రం ఇండియన్ సినిమాల్లో తెలుగు సినిమా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందని చెప్పొచ్చు.