Karthika Deepam 2 Today Episode 25 Feb 2026 : దీప అనాథ కాదు.. జ్యోత్స్నకు షాకిచ్చిన దశరథ, కన్నకూతురి కష్టాలకు తల్లడిల్లిన తండ్రి

 Authored By jagadesh | The Telugu News | Updated on :25 February 2026,8:30 am

Karthika Deepam 2 Today Episode 25 Feb 2026 స్టార్ మాలో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ ‘కార్తీక దీపం 2’ Karthika Deepam 2 రోజురోజుకూ ఊహించని మలుపులతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీపయే తన కన్నకూతురు అని దశరథకు తెలిసిపోవడంతో కథ రసవత్తరంగా మారింది. నేటి ఫిబ్రవరి 25 ఎపిసోడ్‌లో జ్యోత్స్న వేసిన ఉచ్చు, దశరథ ఎమోషనల్ అవ్వడం, కార్తీక్ తెలివిగా పరిస్థితిని చక్కదిద్దడం హైలైట్‌గా నిలిచాయి. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Karthika Deepam 2 Today Episode 25 Feb 2026 : దీప అనాథ కాదు.. జ్యోత్స్నకు షాకిచ్చిన దశరథ, కన్నకూతురి కష్టాలకు తల్లడిల్లిన తండ్రి

Karthika Deepam 2 Today Episode 25 Feb 2026 : దీప అనాథ కాదు.. జ్యోత్స్నకు షాకిచ్చిన దశరథ, కన్నకూతురి కష్టాలకు తల్లడిల్లిన తండ్రి

Karthika Deepam 2 Today Episode 25 Feb 2026 జ్యోత్స్న నిలదీత.. దీప అనాథ కాదన్న దశరథ

ఎపిసోడ్ ప్రారంభంలోనే జ్యోత్స్న.. దశరథ, కార్తీక్‌లను సూటిగా ప్రశ్నిస్తుంది. “డాడీ.. నీ కూతురు, కాంచన అత్తకు కోడలు ఎలా అయింది? బావ నా మెడలో తాళి కట్టలేదు కదా? అలాంటప్పుడు నువ్వు అత్తకిచ్చిన మాట ఎలా నెరవేరింది?” అని దశరథను నిలదీస్తుంది జ్యోత్స్న. ఈ ఇంటికి వారసురాలిని నేను అయితే.. అమ్మానాన్న లేని ఓ అనాథను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారని జ్యోత్స్న దీపను కించపరుస్తూ మాట్లాడుతుంది.

కూతురిని అనాథ అనడంతో దశరథ కోపంతో రగిలిపోతాడు. “దీప అనాథ కాదు.. దీపకు అమ్మానాన్న ఉన్నారు. వాళ్ళు బతికే ఉన్నారు” అని జ్యోత్స్న ముఖం మీదే అసలు నిజం చెప్పేస్తాడు. ఆ మాటలకు జ్యోత్స్నతో పాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే దీప అమ్మానాన్న ఎక్కడున్నారు? వాళ్లెవరు? అని జ్యోత్స్న మరింత గట్టిగా అడుగుతుంది.

Karthika Deepam 2 Today Episode 25 Feb 2026 కార్తీక్ తెలివైన కవర్ డ్రైవ్

నిజం ఎక్కడ బయటపడిపోతుందో అని కంగారుపడిన కార్తీక్ వెంటనే జోక్యం చేసుకుంటాడు. “కొన్ని నిజాలు నువ్వు తట్టుకోలేవు జ్యోత్స్న” అంటూ అసలు లాజిక్ లాగుతాడు. “మా పెళ్లి మీ ఇంట్లోనే జరిగింది. నాకు కాళ్లు కడిగి కన్యాదానం చేసింది మీ నాన్నే. అప్పుడు మీ నాన్న నాకు మామగారు అవుతారు, దీపకు తండ్రి అవుతారు. ఆ లెక్కన మావయ్య కూతురినే మా అమ్మకు కోడలిగా పంపినట్లే కదా.. కాబట్టి మాట నెరవేరినట్లే” అని కార్తీక్ అదిరిపోయే కౌంటర్ ఇస్తాడు. దాంతో జ్యోత్స్న సైలెంట్ అవుతుంది.

స్వప్న వ్యాపార ఆలోచనలు.. శ్రీధర్ వార్నింగ్

మరోవైపు కాశీ, స్వప్నల ట్రాక్ నడుస్తుంది. తాను ఆగిపోయిన డిగ్రీ పూర్తి చేస్తానని, బిజినెస్ పెట్టి పదిమందికి ఉపాధి కల్పిస్తానని స్వప్న అంటుంది. దీనికి శ్రీధర్ కలుగజేసుకుని.. “బిజినెస్ చేయాలంటే ఎంతో ఓపిక కావాలి. ఆ ఓపికలో కొంచెం ఉన్నా కాశీతో సంసారాన్ని చక్కదిద్దుకోవచ్చు కదా” అని హితవు పలుకుతాడు. కాశీతో సంసారం కంటే సన్యాసం బెటర్ అని స్వప్న తేల్చి చెప్పేస్తుంది. కానీ శ్రీధర్ మాత్రం ఈ రోజు నుంచి కాశీ ఇక్కడే పడుకుంటాడని, రేపు ఉదయం గుడికి కూడా అతనే తీసుకెళ్తాడని ఖచ్చితంగా చెప్పేస్తాడు.

కుబేర ఫోటో ముందు కన్నీరుమున్నీరైన దశరథ

దీపను పెంచిన తల్లిదండ్రుల గురించి చర్చ రాగా.. అనసూయ గతం వివరిస్తుంది. “నా తమ్ముడు కుబేరకు పిల్లలు లేరు. ఒకరోజు బస్టాండ్‌లో వెళ్తుండగా ఈ బిడ్డ దొరికింది. అప్పటి నుంచి దీపను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. దీప కోసం మరో పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాన్ని త్యాగం చేశాడు” అని అనసూయ చెబుతుంది.

ఆ మాటలు విన్న దశరథ గుండె తరుక్కుపోతుంది. తన కన్నబిడ్డను అక్కున చేర్చుకుని పెంచిన కుబేర ఫోటో దగ్గరకు వెళ్లి ఎమోషనల్ అవుతాడు. “నీ తమ్ముడు దేవుడమ్మా. కుబేర ఆ రోజు దీపను బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిపోయి ఉంటే దీప మనకు దక్కేది కాదు కదా.. నీ తమ్ముడు బతికుంటే అతడి కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకునేవాడిని” అని దశరథ వెక్కి వెక్కి ఏడుస్తాడు. దశరథలో వస్తున్న ఈ మార్పులు, కుబేర పట్ల చూపిస్తున్న ఎమోషన్ చూసి శివన్నారాయణ, జ్యోత్స్నలకు అనుమానం మరింత బలపడుతుంది.

కన్నకూతురి తలరాతను తలుచుకుని తల్లడిల్లిన తండ్రి

దీపయే తన కూతురు అని దశరథ అందరికీ చెప్పబోతుండగా కార్తీక్ అతన్ని ఆపి బయటకు తీసుకువెళ్తాడు. అప్పుడు దశరథ తనలోని బాధను కార్తీక్ ముందు వెళ్లగక్కుతాడు. “గొప్పింట్లో మహారాణిలా బతకాల్సిన నా కూతురు పేదరికంలో మగ్గిపోయింది. దీనికి కారణం నేనే. ఆరోజు పుట్టిన బిడ్డ ఏది అని గట్టిగా అడిగి ఉంటే నా బిడ్డ నాకు దక్కేది. నా గుడ్డితనం వల్లే నా కూతురికి అన్యాయం జరిగింది. కుబేర ఉన్నంత వరకు దీపను బాగానే చూసుకున్నాడు. కానీ అతను చనిపోయాక దీప జీవితం రోడ్డున పడింది. కట్టుకున్న భర్త మోసం చేశాడు, అత్త నరకం చూపించింది. ఇదంతా తలుచుకుంటే తట్టుకోలేకపోతున్నానురా” అని దశరథ కుప్పకూలిపోతాడు.

దీప ఎవరో అందరికీ తెలియాలని దశరథ అనగా.. “జ్యోత్స్న కావాలనే నీ నుంచి నిజం రాబట్టాలని ఈ నాటకం ఆడుతోంది. చాలా తెలివిగా నిన్ను ట్రాప్ చేసింది. ఇప్పుడు మనం ముందుగా అత్తయ్య (సుమిత్ర) ప్రాణాలు కాపాడుకోవాలి. ఆ తర్వాతే అన్నీ చెబుదాం” అని కార్తీక్ సర్దిచెప్పడంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

దీప నిజస్వరూపం, ఆమె తల్లిదండ్రులెవరో తెలుసుకోవాలన్న జ్యోత్స్న ప్లాన్ వర్కౌట్ అవుతుందా? దశరథ ఈ నిజాన్ని ఇంకెన్ని రోజులు దాచగలడు? తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే!

Advertisement

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి