Brahmamudi Today Episode 25 Feb 2026 : దుగ్గిరాల ఫ్యామిలీ బస్సును పేల్చేసిన రుద్రాణి.. రాహుల్‌ను కాల్చి చంపిన రాజ్.. మహా మలుపు!

 Authored By jagadesh | The Telugu News | Updated on :25 February 2026,9:00 am

Brahmamudi Today Episode 25 Feb 2026 స్టార్ మాలో ప్రసారం అవుతున్న నంబర్ వన్ రేటింగ్ సీరియల్ ‘బ్రహ్మముడి’ Brahmamudi రోజురోజుకూ ఉత్కంఠభరితంగా మారుతోంది. దుగ్గిరాల కుటుంబాన్ని నాశనం చేయడానికి రుద్రాణి పన్నిన పన్నాగం.. ఈరోజు ఫిబ్రవరి 25 ఎపిసోడ్‌లో మహా మలుపునకు దారి తీసింది. పచ్చని కుటుంబంపై రుద్రాణి బాంబులతో దాడి చేయగా, ఊహించని విధంగా రాహుల్ ప్రాణాలు కోల్పోవడం సీరియల్‌ను ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది. ఈరోజు ఎపిసోడ్‌లో జరిగిన పూర్తి ఉత్కంఠభరిత విశేషాలు ఇప్పుడు చూద్దాం.

Brahmamudi Today Episode 25 Feb 2026 : దుగ్గిరాల ఫ్యామిలీ బస్సును పేల్చేసిన రుద్రాణి.. రాహుల్‌ను కాల్చి చంపిన రాజ్.. మహా మలుపు!

Brahmamudi Today Episode 25 Feb 2026 : దుగ్గిరాల ఫ్యామిలీ బస్సును పేల్చేసిన రుద్రాణి.. రాహుల్‌ను కాల్చి చంపిన రాజ్.. మహా మలుపు!

Brahmamudi Today Episode 25 Feb 2026 స్వప్నను బస్సులోకి తీసుకెళ్లిన కావ్య, అప్పు

దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కలిసి టూర్ వెళ్తున్న బస్సులో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే రాహుల్, స్వప్న, రేఖ మాత్రం కారులో వెనుక వస్తుంటారు. కారులో ఉన్న స్వప్నను బస్సులోకి తీసుకెళ్లేందుకు కావ్య, అప్పు వస్తారు. “మేం అక్కడ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాం.. మీరు మాత్రం ఇలా సెపరేట్‌గా వస్తున్నారు. మా అక్క కూడా మాతో కలిసి ఎంజాయ్ చేస్తుంది” అని చెప్పి స్వప్నని బస్సులోకి తీసుకెళ్తారు అప్పు, కావ్య. ఇది చూసి రాహుల్ తీవ్ర కంగారు పడతాడు.

Brahmamudi Today Episode 25 Feb 2026 భార్య కావాలా.. బంగ్లా కావాలా? రాహుల్‌కు రుద్రాణి బ్రెయిన్ వాష్

స్వప్న బస్సు ఎక్కడంతో రాహుల్ వెంటనే తన తల్లి రుద్రాణికి ఫోన్ చేస్తాడు. “మనం వేసిన ప్లాన్ ఆపేద్దాం.. బస్సులో స్వప్న కూడా ఉంది. వీళ్ల చావు వీళ్లు చావకుండా నా పెళ్లాన్ని కూడా తీసుకెళ్లారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో స్వప్నని నేను కారులోకి తిరిగి తీసుకురాలేను కాబట్టి.. ఈ ప్లాన్‌ని ఆపడం మంచిది” అని అంటాడు. ఆ మాటలకు రుద్రాణి మండిపడుతుంది. “ఆ స్వప్నని నువ్వు నిజంగా ప్రేమించావా? మొన్నటి వరకు దానిని ఎలా వదిలించుకోవాలనే కదా ఆలోచించావు? సడెన్‌గా ఇంత ప్రేమ ఏంటి? నువ్వు చేసే ఒక్క త్యాగంతో నీ తలరాతే మారిపోతుంది. కోట్ల ఆస్తి ఒకవైపు.. భార్య ఒకవైపు ఏది కావాలో నువ్వే తేల్చుకో” అని ప్రశ్నిస్తుంది. “నాకు డబ్బే ముఖ్యం.. ఇంతదూరం వచ్చాక తగ్గేది లేదు” అని రాహుల్ చెప్పడంతో.. దూరంగా ఉండి వాళ్ల చావు చూసి ఆనందించమని రుద్రాణి చెబుతుంది.

బస్సును పేల్చేసిన రుద్రాణి.. చెల్లాచెదురైన దుగ్గిరాల ఫ్యామిలీ

దుగ్గిరాల ఫ్యామిలీ ప్రయాణిస్తున్న బస్సు.. రుద్రాణి నక్కి ఉన్న మూల మలుపు (శ్రీశైలం ఘాట్) దగ్గరికి వస్తుంది. ప్లాన్ ప్రకారం రుద్రాణి వెంటనే రిమోట్ నొక్కేస్తుంది. పెద్ద శబ్దంతో ఒక్కసారిగా బాంబు పేలిపోతుంది. బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంటుంది. లోపల ఉన్న దుగ్గిరాల ఫ్యామిలీ అంతా గాల్లోకి ఎగిరి చెల్లాచెదురుగా పడిపోతారు. నెత్తుటి మడుగులో శవాలై పడి ఉన్న వారిని చూసి రుద్రాణి ఆనందంతో సంబరాలు చేసుకుంటుంది. దూరం నుంచి కారులో కళ్లారా ఆ దృశ్యం చూసి రాహుల్, రేఖ సంతోషిస్తూ ఉంటారు.

ప్రాణాలతో అపర్ణ, సుభాష్.. పసికందులు సేఫ్

అందరూ చనిపోయారని రుద్రాణి అనుకుంటున్న వేళ.. తీవ్ర గాయాలతో ఉన్న అపర్ణలో కదలిక వస్తుంది. ఆమె మెల్లగా లేచి చూసేసరికి చుట్టూ కుటుంబ సభ్యులంతా రక్తపు మడుగులో పడిపోయి ఉంటారు. ముందు రాజ్ దగ్గరికి వెళ్లి లేపే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత అల్లుడి దగ్గరికి, కావ్య దగ్గరికి వెళ్లి లేపుతుంది. కానీ ఎవరిలోనూ చలనం ఉండదు. అయితే కావ్య ఒడిలో బిడ్డ మాత్రం క్షేమంగా బతికే ఉంటుంది. “నీ ప్రాణాన్ని పణంగా పెట్టి కాపాడుకున్న పాపను చూడు.. లెవ్వు కావ్య” అంటూ కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంది. ఆ తర్వాత సుభాష్‌లో కదలిక వస్తుంది. అతని చేతిలో అప్పు, కల్యాణ్ బిడ్డ సురక్షితంగా ఉంటుంది. తాను లేవలేకపోతున్నానని సుభాష్ అంటాడు.

గన్ పట్టిన రాహుల్.. అడ్డుకున్న రాజ్

అపర్ణ, సుభాష్ బతికి ఉండటం చూసిన రాహుల్ షాక్ అవుతాడు. శతృశేషం మిగలకూడదంటూ చేతిలో తుపాకీ పట్టుకొని కారు దిగి బయటకు వస్తాడు. అతన్ని చూడగానే అంబులెన్స్‌కు ఫోన్ చేయమని అపర్ణ ప్రాధేయపడుతుంది. కానీ రాహుల్ గన్ గురిపెట్టి.. “చంపాలనుకున్న వాళ్లే ఎలా కాపాడతారనుకున్నావ్ అత్తయ్యా.. ఆస్తి కోసమే ఇదంతా చేశాను” అంటూ అపర్ణను చంపడానికి వెళ్తాడు. అప్పుడే ఊహించని విధంగా రాజ్ వచ్చి రాహుల్‌ను అడ్డుకుంటాడు.

రాహుల్‌ను కాల్చి చంపిన రాజ్

“ఎందుకిదంతా చేశావ్.. డబ్బు కోసమా? అడిగితే ఇచ్చే వాడిని కదరా” అని రాజ్ అడుగుతాడు. దానికి రాహుల్.. “ఇవ్వడానికి నువ్వెవడివి? ఆ ఆస్తిలో నాకూ హక్కు ఉంది. అందుకే మిమ్మల్ని చంపడానికి మా అమ్మతో కలిసి ప్లాన్ చేశాం” అని సమాధానం ఇస్తూ.. రాజ్‌ను కాల్చి చంపడానికి ప్రయత్నిస్తాడు. దీంతో రాజ్ అతడిపై తిరగబడతాడు. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతుంది. ఆ క్రమంలో చేతిలో ఉన్న గన్ పేలి బుల్లెట్ రాహుల్‌కు తగులుతుంది. అనంతరం రాజ్ మరోసారి రాహుల్‌ను కాలుస్తాడు. దీంతో రాహుల్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడుస్తాడు. రాహుల్ చావు చూసి కారులో ఉన్న రేఖ గజగజ వణికిపోతుంది.

పగతో రగిలిపోయిన రుద్రాణి.. కావ్య లేస్తుందా?

ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న రుద్రాణి.. తన కొడుకు రాహుల్‌ను రాజ్ కాల్చి చంపడంతో రక్తం మరిగిపోయి పరిగెత్తుకుంటూ వస్తుంది. వెనుక నుంచి వచ్చి రాజ్ తలపై కర్రతో బలంగా కొడుతుంది. “నువ్వు నా వారసుడిని చంపావు కదా.. నేనూ మీ వాళ్లను చంపుతాను” అంటూ కిందపడ్డ గన్ను తీసుకుని అపర్ణ వైపు గురి పెడుతుంది. దెబ్బకు కిందపడిపోయిన రాజ్.. “వాళ్లను నువ్వే కాపాడాలి కావ్య.. లెవ్వు” అంటూ కావ్యను లేపే ప్రయత్నం చేస్తాడు. అక్కడితో బ్రహ్మముడి నేటి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ముగుస్తుంది.

రుద్రాణి చేతిలో తుపాకీ నుంచి అపర్ణను ఎవరు కాపాడుతారు? కావ్య ప్రాణాలతో లేస్తుందా? కొడుకు చావుతో రగిలిపోతున్న రుద్రాణిని ఆపేదెవరు? అనేది తెలియాలంటే బ్రహ్మముడి తదుపరి ఎపిసోడ్ ఫిబ్రవరి 26 ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి