Youtube : యూట్యూబ్ చూసేవారికి షాక్… ఇకపై ఆ చార్జీలు చెల్లించాల్సిందే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Youtube : యూట్యూబ్ చూసేవారికి షాక్… ఇకపై ఆ చార్జీలు చెల్లించాల్సిందే…!

 Authored By prabhas | The Telugu News | Updated on :6 October 2022,12:00 pm

Youtube : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువగా ఉండడంతో ప్రతి ఒక్కరు యూట్యూబ్ చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే యూట్యూబ్ చార్జీలను విధించనుంది. ఇప్పటికే మనం చూస్తున్న వీడియోలలో యాడ్లు లేకుండా చూడాలంటే నెలకు 129 చెల్లించాల్సిందే. దీంతో మనపై ఆర్ధిక భారం పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో యూట్యూబ్ మరిన్ని నియమాలను తీసుకురానుంది. ప్రస్తుత యూట్యూబ్ క్రేజ్ పెరగడంతో అందరూ యూట్యూబ్ కు అలవాటు పడుతున్నారు. ప్రతి ఒక్కరు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో వీడియోలు చూస్తున్నారు. యాడ్ లేకుండా వీడియోలు చూసేందుకు ప్రతినెల డబ్బులు చెల్లిస్తున్నారు.

దీంతో వినియోగదారుల జేబులు గుల్ల చేసేందుకు యూట్యూబ్ రెడీ అయినట్టు చెబుతున్నారు. ఇకపై 4కె వీడియోలు చూడాలన్న చార్జీలు చెల్లించాల్సిందే. దీనికోసం మరో నిబంధన అమలులోకి తేనుంది. ఇక నుంచి 4 కె వీడియోలు చూసిన డబ్బులు చెల్లించాలని షరతు విధించడంతో యూట్యూబ్ చూడడం ఖర్చుతో కూడుకున్నదే అవుతుంది. భవిష్యత్తులో యూట్యూబ్ లో వీడియోలు చూడడం కూడా ఖర్చుతో కూడుకున్నదే అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. సామాజిక రంగంలో వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్‌ లు దూసుకుపోతున్నాయి. మిగతాయి ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఉన్న యూట్యూబ్ మాత్రం చార్జీలు చెల్లించాలని నిబంధన పెట్టడం సంచలనం కలిగిస్తుంది.

YouTube now has to pay those charges

YouTube now has to pay those charges

యూట్యూబ్ వీడియోలు చూసేందుకు కూడా రుసుము చెల్లించాలంటే వినియోగదారులు కష్టాలు ఎదుర్కోవడం తప్పనిసరి. రాబోయే కాలంలో యూట్యూబ్ ను ఇంకా ఎక్కువమంది చూస్తారని పలువురు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ సబ్ స్క్రైబ్ చేసిన వీడియోలకు యాడ్స్ లేకుండా ఉండేందుకు కూడా డబ్బులు వసూలు చేయాలి. ఇక మీదట యూట్యూబ్ ప్రసారాల్లో డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారని సమాచారం. దీనిపై భవిష్యత్తులో అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. దీనిపై యూట్యూబ్ కూడా సన్నాహాలు చేస్తుంది. కస్టమర్లక ఎంతవరకు వడ్డించాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయినట్లు సమాచారం.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది