Chandrababu : దీ తెలుగు న్యూస్ నుంచి చంద్రబాబు సరిగ్గా పది ప్రశ్నలు : టీడీపీ వాళ్ళు ఆన్సర్ చేయగలరా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : దీ తెలుగు న్యూస్ నుంచి చంద్రబాబు సరిగ్గా పది ప్రశ్నలు : టీడీపీ వాళ్ళు ఆన్సర్ చేయగలరా?

Chandrababu : చంద్రబాబు ఉమ్మడి ఏపీ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కలిపి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల తన పాలనలో ఎవరికి ఏం చేశారు. దీ తెలుగు న్యూస్ వెబ్ సైట్ అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకైనా చంద్రబాబు దగ్గర సమాధానం ఉందా? సమాధానం చెప్పగలరా? ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తర్వాత ఏపీలో తన 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఎంతమందిని ధనవంతులను చేశారు. ఎందరి జాతకాలను మార్చారు. మీ వల్ల ఎవరు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :6 June 2023,10:00 am

Chandrababu : చంద్రబాబు ఉమ్మడి ఏపీ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కలిపి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల తన పాలనలో ఎవరికి ఏం చేశారు. దీ తెలుగు న్యూస్ వెబ్ సైట్ అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకైనా చంద్రబాబు దగ్గర సమాధానం ఉందా? సమాధానం చెప్పగలరా? ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తర్వాత ఏపీలో తన 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఎంతమందిని ధనవంతులను చేశారు. ఎందరి జాతకాలను మార్చారు. మీ వల్ల ఎవరు కోట్లు సంపాదించారు. ఎవరు నష్టపోయారు. ధనికులను ఇంకా కోటీశ్వరులను చేయడమే మీ అజెండా కదా. ఒక సీఎం రమేశ్, ఒక మురళీ మోహన్.. వీళ్లంతా ఒకప్పుడు ఎక్కడ ఉండేవారు.. ఇప్పుడు ఎక్కడున్నారు. వీటికి సమాధానం చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా?

మీరు పేదవాళ్లా.. మీకు ఒకప్పుడు రెండు ఎకరాలు ఉండేది. ఇప్పుడు లక్షల కోట్లు ఉన్నాయి. మీరు ఎలా పేదవాళ్లు అవుతారు. ప్రత్యేక హోదా అంటూ పాట పాడుతున్నారు కదా. బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్లతో రాసుకు పూసుకు తిరిగినప్పుడు ప్రత్యేక హోదా ఎక్కడ పోయింది. అప్పుడెందుకు ప్రత్యేక హోదా గురించి నోరు మెదపలేదు. మీరు అధికారంలో ఉన్న ఐదేళ్లు మీ ఎంపీలు ఏం చేశారు. ఒకరు అమలు చేసే పథకాలను విమర్శించడం కాదు. అసలు మీరు మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ఎలా అమలు చేస్తారో ప్రజలకు చెప్పారా?

10 questions to chandrababu from the telugu news website

10 questions to chandrababu from the telugu news website

Chandrababu : అమరావతి రియల్ ఎస్టేట్ బిజినెస్ మీదే కదా?

అమరావతి రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ కు తెర లేపింది మీరే కదా. ప్రజలు ఇచ్చిన అధికారంతో వ్యాపారం చేసింది మీరే కదా. ఎవరి సంపద పెంచుతున్నారు. హైదరాబాద్ మీద ఉన్న పదేళ్ల హక్కులను కూడా వదిలేసుకొని పారిపోయి వచ్చారు. ఓటుకు నోటు కేసులో ఎక్కడ అరెస్ట్ అవుతావో అని భయపడి అన్నీ వదిలేసుకొని వచ్చింది మీరే కదా చంద్రబాబు. మీదే పెద్ద అవినీతి. మీరు అవినీతిని ఎలా నిర్మూలిస్తారు. ఎన్టీఆర్ నే వెన్నుపోటు పొడిచి పార్టీని చేజిక్కించుకున్న మీరు ఇప్పుడు అదే ఎన్టీఆర్ కు శత జయంతి ఉత్సవాలు జరుపుతూ.. ఆయనకు నమస్కరిస్తూ ఆయన గొప్పోడని పొగుడుతున్నారు చూడండి.. ఇది నిఖార్సయిన వెన్నుపోటు అంటే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది