AP Politics : రాక్షసులతో యుద్ధం : ఆంధ్ర రాజకీయాల మీద దీ తెలుగు న్యూస్ స్పెషల్ ఎనాలిసిస్ !
AP Politics : ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎందుకంటే.. ఎన్నికలకు ఇంకా ఒక్క సంవత్సరం మాత్రమే సమయం ఉంది. అందుకే రోజురోజుకూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు తూటాలుగా పేలుతున్నాయి. మాటల యుద్ధమే నడుస్తోంది వాళ్ల మధ్య. ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికలకు పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి.
ముఖ్యంగా ఇక్కడ యుద్ధం అనేది వైసీపీ ప్రభుత్వానికి, ప్రతిపక్ష టీడీపీ పార్టీ మధ్య. ఏపీకి సంబంధించి ఇటీవలే టీడీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. అప్పటి నుంచి ఆ వార్ ఇంకాస్త ముదిరింది అనే చెప్పుకోవాలి. దానికి కారణం.. మేనిఫెస్టోనే. ఎందుకంటే.. మేనిఫెస్టోను ప్రకటించిన చంద్రబాబు.. మొత్తం వైసీపీ ప్రభుత్వం పథకాలను కాపీ కొట్టారని అంటున్నారు. దీంతో వీళ్ల యుద్ధం మరింత రెచ్చిపోయినట్టయింది. తాజాగా చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు.ప్రస్తుతం ఏపీలో దేవుడికి, రాక్షసులకు మధ్య యుద్దం జరుగుతోందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు. దేవుడి పక్షాన జగన్ ఉద్యోగం చేస్తుండగా, రాక్షసుల పక్షాన చంద్రబాబు యుద్ధం చేస్తున్నారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని వర్గాల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారు.
AP Politics : దేవుడికి, రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతోంది
రైతుల కోసం ఆయన పని చేస్తున్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం పని చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం పదవి దాహంతో కొట్టుకుంటున్నారు. ఆయనకు పదవి దాహం తప్ప మరో దాహం లేదు.. అంటూ నారాయణ స్వామి ధ్వజమెత్తారు. చంద్రబాబు మేనిఫెస్టోను అసలు ప్రజలు పట్టించుకుంటున్నారా? ఆయన మేనిఫెస్టోల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గెలిచేంత వరకే మేనిఫెస్టోల గురించి. ఆ తర్వాత ఆయన మేనిఫెస్టోలనే పట్టించుకోరు. అందుకే ఔరంగజేబుకు, చంద్రబాబుకు మధ్య ఎలాంటి తేడా లేదు.. అంటూ చంద్రబాబుపై నారాయణస్వామి విమర్శనాస్త్రం సంధించారు.