YS Jagan : జగన్ వెనక బాహుబలిలా సపోర్ట్ గా నిలబడ్డ మోడీ.. ఈ సీన్ చూడండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : జగన్ వెనక బాహుబలిలా సపోర్ట్ గా నిలబడ్డ మోడీ.. ఈ సీన్ చూడండి..!

 Authored By kranthi | The Telugu News | Updated on :7 June 2023,1:00 pm

YS Jagan : ఇది పాలన అంటే. ఏమాత్రం అనుభవం లేకున్నా కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. అదంతా పక్కన పెడితే.. నిజాయితీగా పని చేసుకుంటూ పోతే శత్రువు అయినా శెభాష్ అంటాడు అని మరోసారి రుజువు అయింది. సీఎం జగన్ కు ఇప్పుడు కేంద్రం కూడా మద్దతు అందిస్తోంది. మోదీ సర్కార్ తాజాగా ఏపీ ప్రభుత్వాన్ని దన్నుగా నిలిచింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏకంగా రూ.12 వేల కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇది నిజంగా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. నిజానికి.. చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు వెంటనే పోలవరం పూర్తి చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక అసలు పోలవరం ప్రాజెక్ట్ నే మరిచిపోయారు.

కానీ.. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే.. కేంద్రంతో పోరాడి మరీ పోలవరానికి నిధులు తీసుకొచ్చారు. ఇలాంటి పని చంద్రబాబు చేయలేకపోయారు. కానీ.. ఢిల్లీలో నెలలకు నెలలు మకాం వేసి.. ఎన్నోసార్లు కాళ్లు అరిగేలా తిరిగి పోలవరం ప్రాజెక్ట్ ఆవశ్యకతను కేంద్రానికి సీఎం జగన్ స్పష్టం చేయగలిగారు. అందుకే ఇప్పుడు నిధులు వరదలా పారుతున్నాయి. పోలవరం ప్రాజెక్టును కాంట్రాక్టు కమిషన్ కు కక్కుర్తి పడి చంద్రబాబు అడ్డదిడ్డంగా నిర్మాణం చేపట్టారు. నాణ్యత లేకుండా చేపట్టారు. చివరకు నిధులు కూడా తీసుకురాలేకపోయారు. చంద్రబాబు చేసిన తప్పిదానికి రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

central govt good news to polavaram project

central govt good news to polavaram project

YS Jagan : కేంద్రంతో పోరాడి నిధులు తీసుకొచ్చిన సీఎం జగన్

కానీ.. సీఎం జగన్ మాత్రం కేంద్రంతో పోరాడి నిధులు తీసుకొచ్చారు. ఏపీ విభజన తర్వాత ఏపీకి రావాల్సిన రెవెన్యూ లోటు బడ్జెట్ నిధులు కూడా కేంద్రం నుంచి వచ్చేలా సీఎం జగన్ సాధించి చూపించారు. అవి రూ.10 వేల కోట్ల వరకు రాష్ట్రానికి వచ్చాయి. అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కూడా కేంద్రం తాజాగా నిధులు విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న ధరల ఆధారంగానే ఆ నిధులను కేంద్రం విడుదల చేయడం అనేది వైఎస్ జగన్ విజయంగానే చెప్పుకోవాలి. ఇప్పుడు ఎల్లో బ్యాచ్ ఏం సమాధానం చెబుతుంది. వైఎస్ జగన్ సర్కార్ ను ఊరికే విమర్శించడం, బురద జల్లడం కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న సీఎం జగన్ ను మెచ్చుకోకపోయినా పర్వాలేదు.. రాష్ట్ర అభివృద్ధిని చూసి అయినా నోర్మూసుకోవాలి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది