Viral News : అన్నం వండలేదని రూమ్‌మేట్‌ని కొట్టి చంపేశారా.. ఇదెక్కడి దారుణం ?
Viral News : మనుషులలో మానవత్వం చచ్చిపోతుంది. ఒకరిపై ఒకరు పగ, ప్రతికారాలు పెంచుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకి చంపుకునేంత వరకు పోతున్నారు. క్షణికా ఆవేశమో, ఇతర కారణాలో తెలియదు కానీ.. ఈ తరం మనుషుల్లో మానవత్వం మచ్చుకైన కనపడకపోవడం బాధాకరం. భార్య భర్తలు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు, ఫ్రెండ్స్ ఇలా చాలా మంది మధ్య ప్రేమ, ఆప్యాయతలు కొరవడుతున్నాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి టైంకి అన్నం వండలేదనే కారణంతో స్నేహితులు అతడిని చంపిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. చిన్న కారణంతో ఓ వ్యక్తిని చంపడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
వివరాలలోకి వెళితే హైదరాబాద్ జీడీమెట్లలో అన్నం వండలేదనే కారణంతో 38 ఏళ్ల వ్యక్తిని అతని స్నేహితులు కొట్టి చంపారు. మృతుడిని రాజస్థాన్ కు చెందిన హన్స్ రామ్ అని తెలుస్తుంది. అతను గతంలో కుత్భుల్లాపూర్‌లో అద్దెంట్లో ఉండేవాడు. అయితే మద్యానికి బాగా బానిసైన అతను రోజూ తాగి వచ్చి భార్యని హింసించేవాడు. అయితే ఆ బాధని భరించలేక ఆమె తన తల్లి వద్దకు వెళ్లింది. ఇక భార్య వెళ్లిపోయిన క్రమంలో హన్స్‌రామ్ ఇల్లు ఖాళీ చేసి స్నేహితుడు బినయ్ సింగ్ ఇంట్లో ఉంటున్నా డు. స్థానిక గ్రానైట్ వ్యాపారి వద్ద పనిచేస్తున్న బినయ్ సింగ్ తనతో పాటు జీడిమెట్లలో ఉండమని చెప్పడంతో కొద్ది రోజులుగా కలిసి ఉంటున్నారు.
Viral News : అన్నం వండలేదని రూమ్‌మేట్‌ని కొట్టి చంపేశారా.. ఇదెక్కడి దారుణం ?
పని ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చిన స్నేహితులు వచ్చే సరికి అన్నం ఎందుకు వండలేదంటూ బినయ్ సింగ్‌పై దాడి చేశారు. హన్స్‌రామ్ ని చావబాదారు. ఈ క్రమంలో అతను మరణించాడు కూడా. అయితే నిందితులు వచ్చేసి బీహార్ కు చెందిన సోనూ తివారీ, ఉత్తరప్రదేశ్ కు చెందిన సందీప్ కుమార్ అని తెలుస్తుంది. వారు అతని సహోద్యోగులుగా పోలీసులు గుర్తించారు.. ఈ ఘటన తర్వాత బినయ్ సింగ్ తన యజమానికి సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.నిందితులు దాడి తర్వాత అక్కడి నుండి పారిపోయారు. అయితే తాజా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.