Hair Tips : తెల్ల జుట్టు సమస్యతో బాధపడే వారికి చక్కటి చిట్కా… ఒకసారి ట్రై చేయండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : తెల్ల జుట్టు సమస్యతో బాధపడే వారికి చక్కటి చిట్కా… ఒకసారి ట్రై చేయండి…!

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య తెల్ల జుట్టు…అయితే నేటి కాలంలో మారిన ఆహారపు అలవాట్లు మరియు వాతావరణ పరిస్థితుల కారణంగా అతి చిన్న వయసు వారికి కూడా తెల్ల జుట్టు వస్తుంది. దీంతో వయసుకు చిన్న వారైనా సరే చాలా పెద్దవారిలా కనిపిస్తున్నారు. దీంతో చాలామంది ప్రస్తుతం మార్కెట్ లో దొరికే వివిధ రకాల ప్రొడక్ట్స్ వినియోగిస్తూ జుట్టును నల్లగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మార్కెట్ లో దొరికే […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 April 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Hair Tips : తెల్ల జుట్టు సమస్యతో బాధపడే వారికి చక్కటి చిట్కా... ఒకసారి ట్రై చేయండి...!

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య తెల్ల జుట్టు…అయితే నేటి కాలంలో మారిన ఆహారపు అలవాట్లు మరియు వాతావరణ పరిస్థితుల కారణంగా అతి చిన్న వయసు వారికి కూడా తెల్ల జుట్టు వస్తుంది. దీంతో వయసుకు చిన్న వారైనా సరే చాలా పెద్దవారిలా కనిపిస్తున్నారు. దీంతో చాలామంది ప్రస్తుతం మార్కెట్ లో దొరికే వివిధ రకాల ప్రొడక్ట్స్ వినియోగిస్తూ జుట్టును నల్లగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ ను అనే రకాల రసాయనాలతో తయారుచేస్తారు. తద్వారా వీటిని ఎక్కువగా వినియోగించడం వలన మీ జుట్టు కుదుళ్ళు బలహీనంగా మారి జుట్టు రాలే సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడకుండానే ఇంట్లో దొరికే వాటితో ఒక మంచి చిట్కాను మీ ముందుకు తీసుకొచ్చాం.

Hair Tips ఎలా తయారు చేసుకోవాలంటే…

ఈ విధంగా ఇంట్లో దొరికే వస్తువులతో ఈ మిశ్రమాన్ని తయారు చేసుకొని వారానికి 2 లేదా 3సార్లు జుట్టుకు అప్లై చేసి మర్దన చేయడం ద్వారా మీ తెల్ల జుట్టు సమస్య తీరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి… దీనికోసం ముందుగా ఒక కళాయి తీసుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించుకొని దానిపై ఈ కళాయి పెట్టాలి. దీనిలోకి ఒక గ్లాస్ నీళ్లను తీసుకోవాలి. కాసేపు నీటిని బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు రెండు స్పూన్ల కాఫీ పౌడర్ ని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలో కొద్దిగా గ్రీన్ కలర్ హెన్నా ను తీసుకుని బాగా కలుపుకోవాలి. మీ జుట్టుకు సరిపడా హెన్నాని మాత్రమే తీసుకోండి. ఇక ఈ మిశ్రమం ఉండలు కాకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత దీనిలో కాస్త ఉసిరి పౌడర్ ని కూడా వేసుకోవాలి. దీనిని కూడా ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి.

Hair Tips తెల్ల జుట్టు సమస్యతో బాధపడే వారికి చక్కటి చిట్కా ఒకసారి ట్రై చేయండి

Hair Tips : తెల్ల జుట్టు సమస్యతో బాధపడే వారికి చక్కటి చిట్కా… ఒకసారి ట్రై చేయండి…!

ఈ విధంగా మిశ్రమం తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రెండు పెద్ద స్పూన్ల పెరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని రాత్రి మొత్తం అలా గాలికి వదిలేయాలి.ఒకవేళ పెరుగు పడని వారు ఉంటే పెరుగుకి బదులుగా నిమ్మకాయ ను కూడా కలుపుకోవచ్చు. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే 1 లేదా 2 గంటల పాటు దానిని అలానే ఉంచేసి ఆ తర్వాత దానిని జుట్టుకి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వారానికి 2 లేదా 3సార్లు తలకు పట్టించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. అంతేకాదు ఈ మిశ్రమాన్ని ఇంట్లో దొరికే వాటితో తయారు చేసుకోవడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మరి ఇంకెందుకు ఆలస్యం తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు వెంటనే ఈమాశ్రమాన్ని తయారు చేసుకోండి. మనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ది తెలుగు న్యూస్ దీనిని ధృవీకరించలేదు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది