Hair Health Tips : అసలు తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది… తెల్ల జుట్టుని,నల్లగా ఎలా మార్చాలి… సింపుల్ చిట్కా…?
ప్రధానాంశాలు:
Hair Health Tips : అసలు తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది... తెల్ల జుట్టుని,నల్లగా ఎలా మార్చాలి... సింపుల్ చిట్కా...?
Hair Health Tips : ప్రతి ఒక్కరికి కూడా తెల్ల జుట్టు సమస్య వేధిస్తుంది. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం వల్ల వయసు పెద్దదిగా అనిపిస్తుంది. దీనిని బాల నరుపు అని కూడా అంటారు.ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా తాత్కాలికంగా పైపై మెరుగులు వరకే కానీ, తెల్ల జుట్టుకి శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది. దీనికి ఎలాంటి ఆహారాలను తీసుకుంటే దీని నుంచి పూర్తిగా బయటపడవచ్చు. ఈ ప్రక్రియలో ఆహారం,ఒత్తిడి నియంత్రణ, ఆయుర్వేద చిట్కాలు కీలకపాత్రను పోషిస్తాయి.దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం…
శతకాలంలో చాలామందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం మనం చూస్తూనే ఉన్నాం. దీనిని బాల నరుపు అంటారు. దీనికి పోషకాలు సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి,జీవన ఈ విధానం సరిగా లేకపోవడం,వారసత్వంగా రావడం వంటివి కారణాలు ఉండొచ్చు. కొందరికీ మంచి అలవాట్లతో జుట్టు తెల్లబడడానికి ఆలస్యం కావచ్చు. ఇప్పుడు,అలాంటి సహజ పద్ధతులు సులభమైన మార్గాలు గురించి నిపుణులు ఏమంటున్నారు తెలుసుకుందాం..

Hair Health Tips : అసలు తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది… తెల్ల జుట్టుని,నల్లగా ఎలా మార్చాలి… సింపుల్ చిట్కా…?
Hair Health Tips జుట్టు ఆరోగ్యానికి యాంటీ ఆక్సిడెంట్లు
ఆరోగ్యవంతమైన జుట్టుని పొందాలంటే శరీరాన్ని ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి కాపాడాలి. బెర్రీలు, ఆకుకూరలు,బాదం,వాల్నట్స్ లాంటివి మంచి యాంటీ ఆక్సిడెంట్లను ఇస్తాయి.ఇవి జుట్టు పెరగడానికి నలుపు రంగులో నిలబెట్టడానికి సహాయపడతాయి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకుంటే తెల్లజుట్టుకు చెక్ పెట్టవచ్చు.
తలకు ఆయిల్ మసాజ్ : తనకు సరిగ్గా నువ్వు నన్ను రాసి మెల్లగా మసాజ్ చేస్తే తల చర్మంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇంకా జుట్టుకు ఒత్తిడిని తగ్గిస్తుంది. బలంగాను, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. కొబ్బరి నూనె, భృంగరాజు నూనె,నువ్వుల నూనె లాంటివి మంచి ఫలితాలను ఇస్తాయి.
శరీరానికి సరిపడా నీరు : శరీరంలో నీటి శాతం తక్కువగా ఉంటే,జుట్టు వాడిపోతుంది. రంగు మారే అవకాశాలు ఉంటాయి. రోజుకు కనీస 8 నుంచి 10 గ్లాసులు నీరు తాగితే శరీరంలో విష పదార్థాలు బయటికి వెళ్లిపోయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. తల తేమగా ఉండడం వల్ల జుట్టులో సాధ్యమెరుపు కనిపిస్తుంది.
ఒత్తిడిని తగ్గించడం : ఒత్తిడికి ఎక్కువగా గురైతే,జుట్టు త్వరగా తెల్లబడే అవకాశాలు ఉంటాయి. దీని నివారణకు యోగ, ధ్యానం, నడక, సంగీతం లాంటిది మనసుకు ఇస్తూ ఒత్తిడిని తగ్గిస్తుంది.దినీ ప్రభావం జుట్టు రంగుపై మంచి ప్రభావాన్ని చూపుతుంది.
పొగ తాగడం మానేయండి : పొగ తాగితే శరీరంలోని కణాలు తొందరగా పాడవుతాయి. జుట్టు రంగు కూడా మారిపోతుంది. పొగ తాగితే రక్త ప్రసరణ అడ్డంకులు ఏర్పడతాయి. దాని వల్ల తల వెంట్రుకలకు సరిపడా ఆక్సిజన్ లభించదు. పోషకాలు అందవు. కాబట్టి,అలవాట్లను పూర్తిగా మానేస్తే మంచిది.
విటమిన్ B12 లోపం : B12 లోపం వల్ల జుట్టు తెలపడే అవకాశం ఉంటుంది. దీనిని ఆపడానికి B12 వల్ల ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. చికెన్, చేపలు, గుడ్లు, పాల పదార్థాలు లాంటివి ఉపయోగపడతాయి. శాఖాహారులు ఫోర్టీ పైడ్ తీసుకుంటే ఈ విటమిన్ లభిస్తుంది.
తులసి, గోరింటాకుతో తలస్థానం : తులసీ ఆకులు, గోరింటాకులు, ఉల్లిపాయ పొడిని సమానంగా తీసుకుని వాటిని కొద్దిగా నీటిలో మరిగించాలి. ఆ నీరు చల్లారిన తర్వాత తలస్తానానికి ఉపయోగించవచ్చు. వారానికి రెండు లేదా మూడుసార్లు ఇలా చేస్తే జుట్టు నల్లగా మారుతుంది.
ఉలవలు,ఉల్లిపాయ రసం ట్రీట్మెంట్ : ఉలవలను నీటిలో మరిగించి,ఆ నీటిని వడకట్టాలి. దీనికి ఉల్లిపాయల రసం కలిపి తలకి పట్టించాలి ఇది తల చర్మానికి పోషకాలను అందించి జుట్టును బలంగా మారుస్తుంది 20 నిమిషాల తర్వాత తలను శుభ్రంగా కడగాలి ఇది సహజమైన రసాయనాలు లేని చికిత్స.
జుట్టు తెల్లబడడాన్ని పూర్తిగా ఆపలేకపోయినా,కొన్ని సాధ్యమైన పద్ధతుల ద్వారా దాన్ని ఆలస్యం చేయవచ్చు.సరైన ఆహారం, వ్యాయామం తగిన జాగ్రత్తలు తీసుకుంటే,ఆయుర్వేదం ఇంటి చిట్కాల ద్వారా సహజ నలుపు జుట్టును ఎక్కువ కాలం ఉంచుకోవచ్చు. ఈ సలహాను పాటిస్తే మీ జుట్టు ఆరోగ్యంగాను, నల్లగా, యవ్వనంగా ఉంచుతుంది.