Almond With Honey : దీంతో తేనెను కలిపి ఎప్పుడైనా తిన్నారా… ఇలా చేస్తే 100 రోగాలకు ఇదే మందు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Almond With Honey : దీంతో తేనెను కలిపి ఎప్పుడైనా తిన్నారా… ఇలా చేస్తే 100 రోగాలకు ఇదే మందు…?

 Authored By ramu | The Telugu News | Updated on :28 February 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Almond With Honey : దీంతో తేనెను కలిపి ఎప్పుడైనా తిన్నారా... ఇలా చేస్తే 100 రోగాలకు ఇదే మందు...?

Almond With Honey : ఈరోజుల్లో చాలామంది కూడా డ్రై ఫ్రూట్స్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కొందరైతే డైట్ కోసం తింటుంటారు. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఆహారం. మనకి డ్రై ఫ్రూట్స్ ఎన్నో రకాలు లభిస్తాయి. అయితే అన్నిటిలో కెల్లా బాదంపప్పుకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఫైబరు ఎక్కువగా ఉంటుంది అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులను మరియు పోషకాలను కలిగి ఉంటుంది. బాదంపప్పులో విటమిన్ ఈ ఉంటుంది. ఇది మీ శరీర కణాలను దెబ్బ తినకుండా కాపాడగలుగుతుంది. బాదం లో క్యాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం అంటే పోషకాలు కూడా ఉంటాయి. ఇవి శరీరం బాగా పనిచేయడానికి అవసరం. అధ్యయనాల ప్రకారం, బాదంపప్పులో వివిధ రకాల పోషకాలు కలిగి ఉంటాయి. ఇందులో ప్రోటీన్లు మరియు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటివి అధికంగా ఉంటాయి. కేవలం కొన్ని బాదం పప్పులు ఒక వ్యక్తి రోజువారి ప్రోటీన్ అవసరాలు ఎనిమిదో వంతు కలిగి ఉంటాయి. చాలామంది బాదంపప్పును పచ్చిగా లేదా నానబెట్టి తినడానికి ఇష్టపడతారు. అయితే బాదంపప్పును తేనెలో కలిపి తింటే , మనకి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి.. అవేంటో తెలుసుకుందాం….

Almond With Honey దీంతో తేనెను కలిపి ఎప్పుడైనా తిన్నారా ఇలా చేస్తే 100 రోగాలకు ఇదే మందు

Almond With Honey : దీంతో తేనెను కలిపి ఎప్పుడైనా తిన్నారా… ఇలా చేస్తే 100 రోగాలకు ఇదే మందు…?

బాదంపప్పు ఎలాగైతే పోషకాలు గని, అలాగే తేనె కూడా ఆరోగ్యానికి ఔషధ నిధి. తేనెను ఆయుర్వేదంలో చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నారు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోవడమే కాదు ఔషధ ఉపయోగాలు కూడా కలిగి ఉంది. ఈ తేనెలో యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తుంది.యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికలకు నష్టం నుండి కాపాడుతుంది. తేనే బ్యాక్టీరియా, కొంగసులను చంపగలిగిన పరిశోధనలో తేలింది. ఇందులో సహజంగా లభించే హైడ్రోజన్ పెరాక్సైడ్ ను మరియు ఒక క్రిమిన ఆశక మందుగా కూడా వినియోగిస్తారు. ఇది యాంటీ బ్యాక్టీరియాల్ మరియు ఆంటీ ఫంగల్ గా కూడా పనిచేస్తుంది. తేన జీర్ణ క్రియను మెరుగుపరచడంలోనూ మరియు ఫ్లూ లక్షణాలు తగ్గించడంలో మనో బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. తేనె మరియు బాదం నుండి మరిన్ని ప్రయోజనాలు పొందాలంటే మీరు ఉదయాన్నే ఖాళీ కడుపున ఈ రెండిటిని కలిపి తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Almond With Honey తేనే మరియు బాదంపప్పు వలన ఉపయోగాలు

వేయించిన బాదంపప్పుకు కొంచెం తేనెను కలిపి తీసుకోవడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల స్థాయిలో మెరుగుపడతాయి. రెండు కూడా కలిపి తీసుకోవడం వల్ల గుండె జబ్బులను నివారించవచ్చు. చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ వస్తుంది చెక్కరకు బదులు తేనెను తీసుకుంటే బరువు తగ్గుతారు మరియు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. బాదంతో తేనెను కలిపి తీసుకుంటే రక్తంలో గ్లూకోజులు స్థాయిలు కూడా అదుపులోకి వస్తాయి తదుపరి శక్తి కూడా శరీరానికి లభిస్తుంది. బాదం జింక్, విటమిన్ బి, ఐరన్ వంటి పోషకాలకు నిలయం. తేనె రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. వీటిని కలిపి తీసుకుంటే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఈ బాదం తేనె కలిపి తీసుకుంటే ఫ్లూ సీజన్లో కూడా శరీరాన్ని కాపాడుకోవచ్చు.

తేనె మరియు బాదం కలిపి తినడం వల్ల మీ చర్మం కూడా మెరుస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కారం పప్పు పొడిని చేసి తేనెలో కలిపి తయారుచేసిన ఫేస్ ప్యాక్ ను చర్మం అప్లై చేయడం వల్ల చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది మరియు చర్మాన్ని మృదువుగాను, ప్రకాశవంతంగానూ చేస్తుంది. దీనివల్ల ముఖంపై ఏర్పడిన మొటిమలు మరియు మచ్చలు, ముడతలు కూడా తగ్గుతాయి. మెరుగైన ఫలితాలు కోసం ఈ మిశ్రమాన్ని కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ముఖంపై చూడవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది