Home » Exclusive » Aloe Vera Health Tips Telugu
Exclusive

Aloe Vera : అలోవేరాలో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా..? ఎక్కడ కనిపించినా ముందు ఇంటికి తెచ్చుకోండి..!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: July 10, 2021 9:43 pm
Advertisement

Aloe Vera : అలోవేరా తెలుసు కదా. దీన్నే మనం కలబంద అంటాం. అడవిలో ఎక్కడ చూసినా అలోవేరా కనిపిస్తుంది. ఆయుర్వేదంలో దీనికి చాల ప్రత్యేకత ఉంది. చాలా ఆయుర్వేద మందుల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉంటుంది అలోవేరా. అందుకే దీన్ని ఆయుర్వేదంలోనే రారాజు అని పిలుస్తారు. అలోవేరాను చాలామంది ఇంట్లో కూడా పెంచుకుంటారు. చూడటానికి గ్రీన్ కలర్ లో మెత్తగా ఉంటుంది ఈ మొక్క. దీని లోపల తెల్లటి జిగురు లాంటి పదార్థం ఉంటుంది. అదే మనకు ఎంతో మేలు చేస్తుంది.

Advertisement

aloe vera health tips telugu

కలబందలో పుష్కలంగా విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే.. కేవలం ఆరోగ్యం కోసమే కాదు.. కలబందను అందం కోసం కూడా వాడుతారు. చాలా బ్యూటీ ప్రాడక్ట్స్ లో కలబందను వాడుతుంటారు. అందం కోసమైనా.. ఆరోగ్యం కోసమైనా.. ఆరోగ్య నిపుణులు రెకమండ్ చేసేది కలబందనే.

Advertisement

aloe vera health tips telugu

Aloe Vera : అలోవేరా ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

అలోవేరాలో విటమిన్ ఏ, సీ, డీ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గేందుకు అలోవేరాను ఉపయోగిస్తుంటారు. శరీరంలో ఉన్న చెడు కొలెస్టరాల్ ను అలోవేరా తగ్గిస్తుంది. దానికి కారణం అలోవేరాలో ఉండే లిపాసెస్ అనే ఎంజైమ్. ప్రొటెనెస్ అనే మరో ఎంజైమ్ ను కూడా ఇది కలిగి ఉంటుంది. దీని వల్ల.. శరీరంలో ఉన్న ప్రొటీన్లు సరిగ్గా జీర్ణం అవుతాయి.

Advertisement

aloe vera health tips telugu

కడుపులో మంట ఉన్నా.. జీర్ణ శక్తి సరిగ్గా లేకున్నా.. జీర్ణ వ్యవస్థను మెరుగు పరచాలన్నా అలోవేరాను తీసుకోవాల్సిందే. అలోవేరాలో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటాయి. అవి శరీరంలోని విష పదార్థాలతో పోరాడుతాయి. గ్యాస్ సమస్యతో బాధపడుతున్నవాళ్లు కలబందను ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. మలబద్ధకం, కడుపు నొప్పి, లివర్ ఇన్ఫెక్షన్, షుగర్, రక్తహీనత.. ఒకటేమిటి.. ఇలాంటి ఎన్నో జబ్బులకు ఏకైక పరిష్కారం అలోవేర. దీన్ని చర్మానికి రాసుకున్నా కూడా చర్మం నిగనిగలాడుతుంది. అలోవేరా లోపల ఉండే జిగురు పదార్థాన్ని జ్యూస్ చేసుకొని తాగొచ్చు. లేదా దాన్ని అలాగే తినొచ్చు. ఇతర ఆహార పదార్థాల్లో కలుపుకొని కూడా తినొచ్చు.

ఇది కూడా చ‌ద‌వండి ==> Sugar Vs Honey : పంచదార కన్నా తేనె మంచిది… ఎందుకో మీకు తెలుసా?..

ఇది కూడా చ‌ద‌వండి ==> ఈ సీజన్ లోనే దొరికే ఈ పండు కనిపిస్తే అస్సలు వదలకండి.. దీని రహస్యం తెలిస్తే షాక్ అవుతారు?

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి ==> సీతాఫలం పండు మాత్రమే కాదు.. దాని ఆకుల వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

ఇది కూడా చ‌ద‌వండి ==> డ్రాగన్ ఫ్రూట్ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు.. మందుల అవసరమే లేదు..

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి