Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు.. మందుల అవసరమే లేదు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు.. మందుల అవసరమే లేదు..

 Authored By kondalrao | The Telugu News | Updated on :9 July 2021,2:25 pm

Dragon Fruit : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని కాయలూ తినాలి. అప్పుడే ఒంటికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. దాదాపు అవన్నీ ఒకే ఒక్క చోట దొరికే పండు డ్రాగన్. ఈ ఫ్రూట్ తింటే ఆరోగ్యం మన వెంటే అని ఒక్క మాటలో చెప్పొచ్చు. ఈ పండును ఇటీవల ప్రతి పట్టణంలోనూ, ప్రతి నగరంలోనూ అమ్ముతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ Dragon Fruit పైకి గులాబీ రంగులో ఉంటుంది. లోపల తెల్లటి గుజ్జు.. అందులో నల్లటి విత్తనాలు ఉంటాయి.

health benefits of Dragon Fruit

health benefits of Dragon Fruit

కేలరీలు తక్కువ.. ఖనిజాలు ఎక్కువ..

డ్రాగన్ Dragon Fruit ఫలంలో కేలరీలు తక్కువగా, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థం కూడా అధికంగానే ఉంటుంది. ఐరన్, ప్రొటీన్లు, పిండిపదార్థాలు, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఇ, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ తదితర విలువైన పోషకాలు లభిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ ఖరీదు కొంచెం ఎక్కువే అయినా దానికి తగ్గట్లే శరీరానికి శక్తినిచ్చే న్యూట్రియెంట్స్ లభిస్తాయి. కాబట్టి ఈ పండు దొరికితే కొనకుండా, తినకుండా వదలిపెట్టొద్దని అంటుంటారు.

రోగాలను దూరం చేసే..: Dragon Fruit

సహజంగా మన ఒంట్లో ఫ్రీరాడికల్స్ ఉంటే మనం అనారోగ్యం బారిన పడతాం. డ్రాగన్ ఫ్రూట్ Dragon Fruitని తింటే అది ఆ ఫ్రీరాడికల్స్ ని దూరం చేస్తుంది. తద్వారా మనం ఆరోగ్యాన్ని సంతరించుకుంటాం. డ్రాగన్ Dragon Fruit లో నేచురల్ గా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులను, క్యాన్సర్ ను, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తాయి. డ్రాగన్ లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు దాదాపు రావని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండో దశకు చేరిన షుగర్ జబ్బును సైతం డ్రాగన్ నియంత్రణలోకి తెస్తుంది.

ఇమ్యునిటీకి బూస్టింగ్.. Dragon Fruit

డ్రాగన్ లోని విటమిన్ సి, కెరోటినాయిడ్లు ఇమ్యునిటీని పెంచుతాయి. వైట్ బ్లడ్ సెల్స్ ను కాపాడటం ద్వారా రోగ నిరోధక శక్తిని పెరిగేలా చేస్తాయి. దీంతో అంటువ్యాధులు గానీ ఇతర ఏ జబ్బులు గానీ మన దరి చేరకుండా చూస్తాయి. బాడీలో ఐరన్ లోపిస్తే ఓపిక తగ్గుతుంది. అలాంటి పరిస్థితుల్లో శరీరానికి శక్తి రావాలంటే తిన్న ఆహారం జీర్ణమవ్వాలి.

తిండి జీర్ణం కావటానికి ఆక్సీజన్ అవసరం. ఒంటి నిండా ప్రాణ వాయువు సరఫరా కావాలంటే ఐరన్ పుష్కలంగా ఉండాలి. డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇనుము లోపాన్ని అధిగమించొచ్చు. మిగతా అన్ని పండ్లతో పోల్చితే మెగ్నీషియం ఎక్కువగా ఉండేది డ్రాగన్ ఫలంలోనే. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే మెగ్నీషియం తగినంత తగలాలి. బాడీలోని ఇతర బయో కెమికల్ రియాక్షన్స్ కీ ఈ లోహమే కీలకం.

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది