Sugar Vs Honey : పంచదార కన్నా తేనె మంచిది… ఎందుకో మీకు తెలుసా?..
Sugar Vs Honey : రుచి విషయంలో పంచదార, తేనె రెండూ తియ్యగానే ఉంటాయి. కానీ ఆరోగ్యపరంగా చూస్తే చక్కెర కన్నా తేనే మంచిది. పంచదార వల్ల అనారోగ్యం బారినపడతాం. అదే తేనె అయితే అలాంటి సమస్య ఉండదు. తేనె సహజసిద్ధంగా దొరుకుతుంది. అందుకే అందులో కెమికల్స్ ఉండవు. కానీ చెరకు రసం నుంచి పంచదారను తయారుచేసేటప్పుడు సల్ఫర్ అనే రసాయనాన్ని కలుపుతారు. ఆ సల్ఫరే షుగర్ తదితర హెల్త్ ప్రాబ్లమ్స్ కి అసలు కారణం. ఈ నేపథ్యంలో ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించేవారు పంచదారకు దూరంగా ఉంటున్నారు. దానికి బదులుగా తేనెను వాడుతున్నారు.
అది ఎందుకంత ప్రమాదం?..
చెరకు రసంతో షుగర్ ని తయారుచేసే క్రమంలో కలిపే సల్ఫర్ కి కరిగే గుణం తక్కువ. రోజూ మనం టీ, కాఫీ, ఇతర రూపాల్లో పంచదారను మెనూలో భాగంగా తీసుకుంటాం కాబట్టి అది మన శరీరంలోని రక్తంలోకి చేరుతుంది. కానీ చాలా నెమ్మదిగా కరగటం వల్ల బాడీలో అలాగే ఎక్కువ కాలం ఉండిపోతుంది. కరగని సల్ఫర్ కారణంగా మధుమేహం వస్తుంది. అందుకే పంచదారను సాధ్యమైనంత తక్కువగా వినియోగించటం మంచిది. షుగర్ బదులు తేనె అయితే బాగుంటుంది. అందులో సహజమైన పంచదారలు ఉంటాయి. అవి ఔషధ గుణాలను సైతం కలిగి ఉన్నాయి. కాబట్టి తేనె వల్ల రుచికి రుచికి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తాయి.
అన్నింటి కన్నా వేగంగా..: Sugar Vs Honey
మనం తినే అన్ని ఆహార పదార్థాల కన్నా తేనే అధిక వేగంగా జీర్ణమై వంటపడుతుంది. ఒంటికి శక్తిని ఇస్తుంది. నీరసాన్ని పోగొడుతుంది. తేనెలో 14 నుంచి 18 శాతం వరకు సహజమైన తేమ ఉంటుంది. అందుకే అది త్వరగా, తేలిగ్గా అరుగుతుంది. తేనెలోని తేమ సహజమైనది కావటం వల్ల అది పాడైపోవటం అనేది ఉండదు. చక్కెర ఒక విధంగా మత్తు మందు లాంటిది. పంచదారతో తయారుచేసిన తేనీరు తాగినప్పుడు కొద్దిసేపు యాక్టివ్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే కొందరు రోజుకి మూడు నాలుగు సార్లు టీ తాగుతుంటారు. దానికి బానిస అవుతారు కాబట్టి ఒక్కసారిగా, పూర్తిగా మానేయటం కొంచెం కష్టం.
కిడ్నీలపై ఎఫెక్ట్..
చక్కెరలోని సల్ఫర్ మన కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుంది. పంచదారతో పోలిస్తే తేనెలో కేలరీల సంఖ్య కూడా తక్కువే. పైగా అవి ఆరోగ్యకరమైనవి కూడా. తేనె ఎంత నేచురల్ ప్రొడక్ట్ అయినా ఈ రోజుల్లో కల్తీ తేనెలు కూడా మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. కాబట్టి క్వాలిటీ తేనె కొనుక్కొని తాగితే బెటర్. చక్కెర.. నీళ్లల్లో కరిగినంత సులభంగా మన శరీరంలో, రక్తంలో కరగదు. అందువల్ల స్థూలకాయం కూడా ఏర్పడుతుంది.
ఇది కూడా చదవండి ==> మీకు సరిగా ఆకలి వేయడం లేదా.. అయితే ఈ చిన్న చిట్కాలతో మీ ఆకలిని పెంచుకోండి
ఇది కూడా చదవండి ==> Salt : మీరు ఉప్పు ఎక్కువగా తింటున్నారా… అయితే జబ్బులు రావడం గ్యారెంటీ…!
ఇది కూడా చదవండి ==> హై బీపీ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా.. అయితే మీరు ఈ ఆహారపదర్థాలు తినలేదని అర్థం..!
ఇది కూడా చదవండి ==> క్యాప్సికం గురించి అసలు నిజం తెలిస్తే.. వెంటనే మార్కెట్ కు వెళ్లి కొనుక్కొని తినేస్తారు..!