Water Apple : ఈ సీజన్ లోనే దొరికే ఈ పండు కనిపిస్తే అస్సలు వదలకండి.. దీని రహస్యం తెలిస్తే షాక్ అవుతారు?
Water Apple : వాటర్ యాపిల్.. దీన్నే రోజ్ యాపిల్ లేదా గులాబీ యాపిల్ అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఇదే పండును బెల్ ఫ్రూట్ అని పిలుస్తారు. ఈ పండు ఎక్కువగా ఇండియా, ఇండోనేషియా, మలేషియాలో పండుతుంది. ఇది చూడటానికి అచ్చం జామపండులా ఉంటుంది. అలాగే.. బాగా పక్వానికి వస్తే.. గులాబీ రంగులో ఉంటుంది ఈ పండు. కొన్ని పండ్లు పసుపు రంగులో, మరికొన్ని ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ పండును తింటే.. చాలా రుచిగా ఉంటుంది. అలాగే.. కొద్దిగా తీపి, కొద్దిగా చేదు రుచితో ఉంటుంది ఈ పండు.
చూడటానికి ముద్దుముద్దుగా ఉండే ఈ పండును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ ఈ పండు ద్వారా లభిస్తాయి. వాటర్ ఆపిల్ ఈ సీజన్ లోనే ఎక్కువగా దొరుకుతుంది. అయితే.. ఈ పండు అంతట దొరకదు. కొన్ని ప్రాంతాల్లోనే దొరుకుతుంది. అందుకే ఈ పండు ఎక్కడ కనిపించినా అస్సలు వదలొద్దు. వెంటనే దీన్ని తీనేయాలి.
Water Apple : వాటర్ యాపిల్ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంట్లో ఉండే విటమిన్లు, మినరల్స్.. ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెడతాయి. ముఖ్యంగా దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అతి తక్కువగా ఉండటంతో.. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అందుకే.. డయాబెటిస్ ఉన్నవాళ్లు ఈ పండును ఎక్కువగా తీసుకోవాలి. దీన్ని మాంచి రోగనిరోధక బూస్టర్ అని కూడా పిలుస్తారు.
ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. దంతాలను బలంగా చేస్తుంది. చిగుళ్లను గట్టిగా చేస్తుంది. కంటి సమస్యలను దూరం చేస్తుంది. పలు రకాల బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈపండులో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అది గుండె జబ్బులను రాకుండా కాపాడుతుంది. క్యాన్సర్ నుంచి రక్షణ పొందడానికి కూడా ఈ పండును ఎక్కువగా తీసుకోవాలి. క్యాన్సర్ కణాలను ఈ పండు నాశనం చేస్తుంది. ఈ పండును నిత్యం తీసుకుంటే.. దాదాపు అన్ని రోగాలు నయం అవుతాయి. ఎంతో ఆరోగ్యవంతులు అవుతారు.
ఇది కూడా చదవండి ==> మీకు సరిగా ఆకలి వేయడం లేదా.. అయితే ఈ చిన్న చిట్కాలతో మీ ఆకలిని పెంచుకోండి
ఇది కూడా చదవండి ==> Salt : మీరు ఉప్పు ఎక్కువగా తింటున్నారా… అయితే జబ్బులు రావడం గ్యారెంటీ…!
ఇది కూడా చదవండి ==> హై బీపీ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా.. అయితే మీరు ఈ ఆహారపదర్థాలు తినలేదని అర్థం..!
ఇది కూడా చదవండి ==> క్యాప్సికం గురించి అసలు నిజం తెలిస్తే.. వెంటనే మార్కెట్ కు వెళ్లి కొనుక్కొని తినేస్తారు..!