Custard Apple : సీతాఫలం పండు మాత్రమే కాదు.. దాని ఆకుల వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
Custard Apple : కస్టర్డ్ యాపిల్.. దీన్నే మనం సీతాఫలం పండు అంటాం. ఇది సీజనల్ పండు. వర్షాకాలం ప్రారంభం అయిన తర్వాత కాసే పండు ఇది. ఈ పండు ఎంతో మధురంగా ఉంటుంది. ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అది ఈ పండులో ఉండే టేస్ట్. ఈ పండులో చాలా విటమిన్లు ఉంటాయి. మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ పండును తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయిని నిపుణులు చెబుతుంటారు. దీంట్లో విటమిన్ సీతో పాటు.. పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. హైబీపీ ఉన్నవాళ్లు సీతాఫలం పండును తింటే రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది.
జీర్ణ సమస్యలు ఉన్నా.. కళ్ల సమస్యలు ఉన్నా.. మలబద్ధకం సమస్య ఉన్నా.. శరీరంలోని యాసిడ్స్ ను నాశనం చేయాలన్నా.. ఆర్థరైటిస్ సమస్య ఉన్నా.. రుమాటిజం సమస్య ఉన్నా.. ఎన్నో రకాల సమస్యలకు సీతాఫలం పండు చెక్ పెడుతుంది. అందుకే.. సీతాఫలం పండును తినాలని చెబుతుంటారు. అయితే.. కేవలం సీతాఫలం పండును తింటేనే కాదు.. సీతాఫలం ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి.
Custard Apple : సీతాఫలం చెట్టు ఆకుల వల్ల కలిగే లాభాలు ఇవే?
సీతాఫలం పండుతో పాటు.. చెట్టు బెరడు, చెట్టు ఆకుల వల్ల కూడా ఎన్నో లాభాలు ఉంటాయి. సీతాఫలం చెట్టు బెరడు వల్ల కడుపులో మంట తగ్గుతుంది. అలాగే మలబద్ధకం కూడా తగ్గుతుంది. సీతాఫలం పండు గింజలు కూడా మంచి ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. చెట్టు ఆకుల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చెట్టు ఆకులను తెంపి.. వాటిని పేస్ట్ లా చేసి ఆ మిశ్రమాన్ని చర్మం మీద రాసుకుంటే చాలామంది ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తులో చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే సీతాఫలం చెట్టు ఆకుల పేస్ట్ ను చర్మంపై రాసుకోవాలి. ఒకవేళ గజ్జి లేదా తామర వంటి సమస్యలు ఉన్నా కూడా ఆ ప్లేస్ లో ఈ మిశ్రమాన్ని రుద్దాలి. అలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇది కూడా చదవండి ==> మీకు సరిగా ఆకలి వేయడం లేదా.. అయితే ఈ చిన్న చిట్కాలతో మీ ఆకలిని పెంచుకోండి
ఇది కూడా చదవండి ==> Salt : మీరు ఉప్పు ఎక్కువగా తింటున్నారా… అయితే జబ్బులు రావడం గ్యారెంటీ…!
ఇది కూడా చదవండి ==> హై బీపీ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా.. అయితే మీరు ఈ ఆహారపదర్థాలు తినలేదని అర్థం..!
ఇది కూడా చదవండి ==> క్యాప్సికం గురించి అసలు నిజం తెలిస్తే.. వెంటనే మార్కెట్ కు వెళ్లి కొనుక్కొని తినేస్తారు..!