Diabetes : మధుమేహం బాధితులకు జామ ఆకులతో అద్భుతమైన టిప్… ఎన్నో ఆశ్చర్యకరమైన లాభాలు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : మధుమేహం బాధితులకు జామ ఆకులతో అద్భుతమైన టిప్… ఎన్నో ఆశ్చర్యకరమైన లాభాలు…

 Authored By aruna | The Telugu News | Updated on :24 August 2022,7:30 am

Diabetes : జామ పండ్లు అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే పండు జామ పండు. అలాగే ధర తక్కువ ప్రయోజనాలు ఎక్కువ.. ఈ జామ పండ్లలో వివిధ రకాల పోషకాలు ఉంటాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే జామ పండ్లు కాకుండా జామ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతూ ఉంటాయి. ఈ జామాకులలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ జామ ఆకులతో టీ చేసి త్రాగినట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అదేవిధంగా శరీరంలో వివిధ రకాల ఇన్ఫెక్షన్లను తొలగించే గుణం కూడా దీనికి ఉంది. అలాగే వైరస్ ల, బ్యాక్టీరియా వల్ల వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే జలుబు, దగ్గు తగ్గిపోతాయి. ఈ జామ ఆకులు టీ తాగడం వలన ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.

దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే మొహం మీద వచ్చే మొటిమలు కూడా తగ్గిపోతాయి. ఈ టీ తాగడం వలన అధిక బరువు కూడా తగ్గుతారు. అదేవిధంగా బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే ఈ ఆకులలో ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. కాబట్టి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే నొప్పుల నివారణ కు బాగా ఉపయోగపడుతుంది. పంటి నొప్పిని తగ్గించడమే కాకుండా మెదడు ఆరోగ్యానికి మంచిది. అలాగే జుట్టు రాలిపోవడానికి కూడా ఆగిపోయేలా చేస్తుంది. ఈ టీ తాగడం వలన కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అలాగే ఈ జామ ఆకులలో క్యాన్సర్ కి వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటుంది. అలాగే ఈ ఆకులలో ఉండే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు రోగాలు రాకుండా ఇమ్యూనిటీ ను పెంచుతుంది.

Amazing Benefits of Guava Leaves for Diabetes Persons

Amazing Benefits of Guava Leaves for Diabetes Persons

ఇవి శరీరంలో మెటపాలిజం ని పెంచి అధిక కొవ్వును కరిగిస్తుంది. అలాగే ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మం మృదువుగా, కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే ఈ ఆకుల వల్ల కొల్లజెన్ ఉత్పత్తి కూడా అవుతుంది. కొవ్వుని కంట్రోల్ చేయడంలో ఈ ఆకులు చాలా బాగా సహాయపడతాయి. రక్తనాళాలలో ఉండే మలినాలను తొలగిస్తాయి. గుండె సంబంధించిన వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. అదేవిధంగా మధుమేహం బాధితులకు ఈ జామాకులు ఎంతో లాభాలను కలిగిస్తాయి. ఇవి చక్కర స్థాయిని కంట్రోల్ చేస్తాయి. దీంతో మధుమేహం కంట్రోల్లో ఉంటుంది. అయితే ఈ జామకులను నిత్యము తినలేము. అయితే రెండు ఆకులను తీసుకొని శుభ్రం చేసి వాటిని నీటిలో వేసి పది నిమిషాల పాటు మరగబెట్టి తర్వాత వడకట్టుకుని దానిలో కొద్దిగా తేనె, కొంచెం నిమ్మరసం వేసి హెర్బల్ టీల మార్చుకుని నిత్యము త్రాగాలి ఇలా త్రాగినట్లయితే మీరు మంచి ఆరోగ్యం పొందుతారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది