Peaches : ఈ పండును తిన్నారా… తింటే వదలనే వదలరు.. వారం రోజులు తిని చూడండి..?

 Authored By ramu | The Telugu News | Updated on :29 April 2025,1:00 pm

Peaches : ప్రకృతిలో లభించే ప్రతి ఒక్క పండు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇలాంటి పండు లో ఒకటే పీచు పండు. ఈ పీచు పండును స్టోన్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఈ పండు పసుపు, తెలుపు,రంగులలో ఉండే పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని పోషకాహారాన్ని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిని నేరుగా… లేక జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు. ఈసారి మీ డైట్ లో ఈ పీచ్ ఫ్రూట్ ని చేర్చుకున్నట్లైతే మీ శరీరంలో ఊహించని విధంగా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కావున,ఈ పీచు పండు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం…

Peaches : ఈ పండును తిన్నారా... తింటే వదలనే వదలరు.. వారం రోజులు తిని చూడండి..?

Peaches : ఈ పండును తిన్నారా… తింటే వదలనే వదలరు.. వారం రోజులు తిని చూడండి..?

Peaches పీచు పండు ఆరోగ్య ప్రయోజనాలు

ఈ పీచు పండు లో విటమిన్స్, మినరల్స్,యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పీచు పండు కంటి ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇందులో విటమిన్ A తో పాటు బీటా కెరోటిన్ కూడా అధికంగా ఉండడం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన కంటి చూపును మెరుగుపరచుటకు ఇది క్యాట్రాక్ట్ సమస్య రాకుండా నివారిస్తుంది. బరువు తగ్గాలనే వారికి కూడా ఈ పీచుపండు బాగా పనిచేస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి, పీచు పండు తినడం వల్ల బరువు కూడా నియంత్రణలోకి వస్తుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది.పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎక్కువగా ఆహారాన్ని తినే వారికి స్పీచ్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల అధికంగా తినాల్సిన కోరిక పుట్టదు. అయితే, ఇది జీర్ణ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు,డయేరియా మలబద్ధక సమస్యలను దరిచేరకుండా చేస్తుంది. ముఖ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది.

Peaches పీచు పండు క్యాన్సర్ నివారిణి

ఈ పీచు పండు తింటే క్యాన్సర్ కణాల అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారించగలదు. ఫోను ఫాస్ మహిళలు రోజుకు కనీసం రెండు పీచు పనులు అయినా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. తే కాదు పీచు పండులో పాలిఫెనాల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లు ఉంటాయి. ఇంకా, నొప్పి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
పీచు పండు రక్తపోటును, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.గుండె జబ్బుల ప్రమాదాలను నివారిస్తుంది. గతంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని నిరోధించి, అలర్జీ లక్షణాలను తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి, పోలైట్ ప్రెగ్నెన్సీ మహిళలకు కూడా మేలు చేస్తుంది. పీచు పండును నేరుగా తినవచ్చు. లేదా స్మూతీ రూపంలో తీసుకోవచ్చు. ఇది మన చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. చర్మాన్ని ప్రకాశం అందంగా కనిపించేలా కూడా చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ పీచు పండులో.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి