Health Benefits : మీరు అరటి పండు తింటారా.. ఈ ప్రయోజనాలు తెలుసుకోండి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : మీరు అరటి పండు తింటారా.. ఈ ప్రయోజనాలు తెలుసుకోండి..

 Authored By pavan | The Telugu News | Updated on :17 April 2022,7:40 am

Health Benefits : ప్రస్తుతం ఉన్న ఆహార వ్యవస్థలో సరైన పోషకాలు శరీరానికి అందుతాయన్న నమ్మకం బహుశా ఎవరికీ ఉండదు. అందులోనూ ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవిత విధానం కూడా రోజు రోజుకి మనల్ని అనారోగ్య పీడితులని చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ రోజు ఇలాంటిదే ఒక అతి ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. రక్తంలో విటమిన్ బి-12 తగ్గితే ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది! వాటికి పరిహారం ఏంటి! విటమిన్ బి-12 అనేది మనిషికి చాలా ముఖ్యమైనది. కానీ, ఈ కాలంలో చాలా మందిలో విటమిన్-బి12 లోపం ఉంటుంది.బి-12 లోపం వల్ల రక్త హీనత మరియు నరల బలహీనత ఎదురుకుంటాం. మెగ్లోబ్లాస్టిక్ అనే అనీమియాను సృష్టిస్తుంది. దీనినే రక్త హీనత అని కూడా అంటారు. జుట్టు మూల జీవ కణాలను, వెన్నులోని శక్తిని కృశించేలా చేస్తుంది.

విటమిన్ బి-12 లోపం వల్ల అలసటగా అనిపిస్తుంది. ఒంట్లో ఏమాత్రం శక్తి లేని ఫీలింగ్ కలుగుతుంది. ఊపిరాడటానికి క్లిష్టంగా ఉంటుంది. విపరీతమైన తలనొప్పి, చిరాకు, కోపం ఎక్కువ రావటం. నాలుక మీద పుండు, నోట్లో పూతలు రావటం.- ఆకలి తగ్గిపోవటం, బరువు తగ్గిపోవటం. జలదరింపు, తిమ్మిరి లాంటి లక్షణాలు కనిపించటం. జుట్టు రాలిపోవడం, దృష్టి దోషం -మానసిక సమస్యలు ఇలాంటి లక్షణాలు కనిపించగానే వైద్యుల పర్యవేక్షణ తీసుకోవటం చాలా ముఖ్యం.మాంసాహారం తీసుకునే వారు వారంలో రెండు సార్లు చేపలు, కోడి గుడ్డు, అన్ని రకాల మాంసాహారం తీసుకుంటే రక్తంలో విటమిన్ బి-12 పెరుగుతుంది. ఆవు పాలు, పెరుగు, వెన్న, పన్నీర్ లాంటి డైరీ ప్రొడక్ట్స్ నియమంగా సేవించాలి. సోయా, బ్లాక్ బీన్స్, గింజలు, పప్పు ధాన్యాలు, బఠాణీల్లో బి కాంప్లెక్స్ ఉంటాయి.

amazing Health Benefits of banana

amazing Health Benefits of banana

కమల పళ్లు, అవకాడో, అరటి పండు, స్ట్రాబెర్రీ, కీవి, కర్బూజ, వాటర్ మెలన్, ఆపిల్, మామిడి పండ్లు పొద్దున్న టిఫిన్ కి ముందు తినవచ్చు. టొమాటో, క్యాప్సికమ్, బీట్రూట్, క్యారట్, క్యాబేజీ, పుట్ట-గొడుగు, ఆలూ, గుమ్మడి కూరగాయలు వంటల్లో వాడుకోవాలి. ఆకు కూరల్లో మెంతి, గోంగూర, పొన్నగంటి పాలకూర లాంటివి పెసరు మొలకలు ప్రతి రోజూ వాడుకోవాలి. బాదం పప్పు, వేరు శనగలు, పొద్దు తిరుగుడు పూల గింజలు, గుమ్మడి గింజలు, వాల్నట్, ఖజ్జురం లాంటి డ్రై ఫ్రూట్ నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు.వీటితో పాటు మంచి అలవాట్లు పెంచుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. పొద్దున్న సాయంత్రం ఒక అర గంట వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్ మంచి నీళ్ళు తాగాలి. తరచూ పళ్ళ రసాలు తీసుకోవాలి. ఎనిమిది గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. ఇలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లూ మన జీవితంలో ఆనందం మరియు ఆరోగ్యం తీసుకొస్తాయి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది