Health Benefits : రెండే రెండు సార్లు ఇది తాగారంటే చాలు.. దీర్ఘకాళిక సమస్యలన్నీ దూరం!
Health Benefits : ఆరోగ్యాన్ని కాపాడాలనుకునే వారు.. ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా జీవించాలనుకునే వారంతా ప్రతి రోజూ ఉదయం టీ, కాఫీలకు బదులుగా గ్లాసుడు నిమ్మ కాయ జ్యూస్ తాగడం మన చూస్తూనే ఉంటాం. ఇలా ప్రతిరోజూ బరువు తగ్గడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గిపోయి సన్నగా, నాజూగ్గా తయారు అవుతారు. అయితే ఇంతటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ చాలా మంది టీ, కాఫీలను వదులు కోలేక దీన్ని తాగడం మానేస్తున్నారు. కానీ గ్లాసుడు గోరు వెచ్చటి నీళ్లలో నిమ్మరసం, కాస్తంత పసుపు వేసి తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. నిమ్మకాయ నీరు తాగడం వల్ల కీళ్ల నొప్పులను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
అయితే గ్లాసుడు గోరు వెచ్చటి నీళ్లలో నిమ్మకాయ రసంతో పాటు కాస్త పసుపు అలాగే వీటికి తోడు తేనె లేదా అల్లం జోడించడం వల్ల మరింత మంచి జరుగుతుందని ఆరోగ్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయమే ఈ జ్యూస్ తాగడం వల్ల కడుపులో ఉండే విష పదార్థాలను బయటకు పంపడంతో పాటు శరీరంలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లు దూరం చేస్తాయి. ఈ నీరు శరీరానికి ఉత్సహాన్ని నింపడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా జోడిస్తుందట. దీన్ని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. అంతే కాకుండా ఉదయమే టీ, కాఫీలు కాకుండా ఈ నిమ్మరసం తాగడం వల్ల విటామిన్ సీతో పాటు ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోకి చేరుతాయి.
అలాగే శరీరానికి అవసరమయ్యే ఖనిజాలు, విటామిన్లను అందించే విషయంలోనూ ఇది ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది. తేనె వేసుకొని తాగాలనిపించని వారు.. లేదా ఇంట్లో తేనె లేని వారు గ్లాసుడు గోరు వెచ్చటి నీళ్లలో చిటికెడు పసుపు, అరచెక్క నిమ్మరసం కలపాలి. ఇందులో బ్లాక్ సాల్ట్ లేదా సైంధవ లవణాన్ని కలుపుకొని తాగొచ్చు. కిచెన్ సాల్ట్ మాత్రం అస్సలే వాడకూడదు. డయాబెటిస్ లేని వారు స్వచ్ఛమైన తేనె కూడా వాడొచ్చు. అలా కలిపిన నీటిగని గోరు వెచ్చగా ఉదయాన్నే తీసుకోవాలి. ఇది క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక బరువుతో పాటు కొవ్వు సమస్యలు, జీర్ణ సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. నిమ్మరసంలోని విటామిన్ సి వలన కాంతి వంతమైన చర్మం లభిస్తుంది. అలాగే అల్జీమర్స్, కీళ్ల నొప్పులు, ఒత్తిడి, కిడ్నీ సమస్యలు ఇక జీవితంలో మీ దరి చేరవు.