Health Benefits : శరీరంపై ఏర్పడే కొవ్వు గడ్డలను కరిగించే ఆ ఆకులేంటో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : శరీరంపై ఏర్పడే కొవ్వు గడ్డలను కరిగించే ఆ ఆకులేంటో తెలుసా?

Health Benefits : పల్లెలు, గ్రామాల్లో పెరిగిన ప్రతీ ఒక్కరికి ఉత్తరేణి మొక్క తెలుసు. దాని వల్ల కలిగే లాభాల గురించి కూడా కనీస అవగాహన ఉండే ఉంటుంది. అయితే పట్టణాల్లో ఉండే వాళ్లకు మాత్రం అంటే చాలా ఎక్కువ మందికి దీని వల్ల కల్గే ప్రయోజనాల గురించి తెలియదు. మన భారత దేశ ఆయుర్వేద వైద్యంలో ఉత్తరేణి కొన్ని వందల రకాల రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఆ మొక్క ఆకులు, విత్తనాలు, వేర్లతో సహా […]

 Authored By pavan | The Telugu News | Updated on :4 April 2022,5:00 pm

Health Benefits : పల్లెలు, గ్రామాల్లో పెరిగిన ప్రతీ ఒక్కరికి ఉత్తరేణి మొక్క తెలుసు. దాని వల్ల కలిగే లాభాల గురించి కూడా కనీస అవగాహన ఉండే ఉంటుంది. అయితే పట్టణాల్లో ఉండే వాళ్లకు మాత్రం అంటే చాలా ఎక్కువ మందికి దీని వల్ల కల్గే ప్రయోజనాల గురించి తెలియదు. మన భారత దేశ ఆయుర్వేద వైద్యంలో ఉత్తరేణి కొన్ని వందల రకాల రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఆ మొక్క ఆకులు, విత్తనాలు, వేర్లతో సహా అన్నింటిని ఆయుర్వేద మందుల తయారీల్లో, వైద్యంలో ఉపయోగిస్తుంటారు. అయితే ఉత్తరేణి మొక్కను ఉపయోగించి శరీరంలో వచ్చే గడ్డలను తగ్గించుకోవచ్చట. అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే వినాయక చవితి పండుగలో వినాయకుడికి సమర్పించే ఆకుల్లో ఉత్తరేణి ఒకటి. ఉత్తరేణి ఆకులు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. శరీరంపై వచ్చే దురద, పొక్కులు, పొట్టుకు చెక్ పెట్టేందుకు చాలా మంది ఉత్తరేణి ఆకుల రసాన్నివాడుతుంటారు. అంతే కాదండోయ్ ఉబ్బసం, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఉత్తరేణి చెట్టు ఎండిన ఆకులను మంటల్లో వేసి ఈ పొగను పీల్చితే… ఈ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయట. అలాగే ఉత్తరేణి ఆకుల బూడిదను ఆముదంతో కలిపి దురద, గజ్జి, తామరపై లేపనంలా రాస్తే క్రమంగా తగ్గిపోతుంది. కందిరీగలు, తేనెటీగలు మరియు తేల్లు కరిచినప్పుడు ఈ ఆకులను నలిపి పసరు పూయడం వల్ల నొప్పి మరియు దురద తగ్గుతుంది.

amazing health benifits of uthhareni plant

amazing health benifits of uthhareni plant

అంతే కాకుండా పంటి నొప్పి తీవ్రంగా ఉంటే… ఉత్తరేమి గింజల పొడి, ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం కలిపి ముద్ద చేసి… ఆ పేస్టును పంటిపై రాస్తే పంటి నొప్పి తగ్గుతుంది. చిగుళ్ల నుంచి రక్త స్రావం ఆగుతుంది. శరీరంలోని కొవ్వు కరగాలంటే ఉత్తరేణి ఆకుల రసంలో నువ్వుల నూనె వేసి బాగా మరిగించి పొట్టపై రాసుకోవాలి. అలాగే శరీరంలో కొవ్వు గడ్డలు ఏర్పడినప్పుడు ఈ ఆకులను మెత్తగా దంచి ఆకుల పేస్టును కొవ్వు గడ్డలపై పెట్టాలి. ఆ తర్వాత దానిపై బ్యాండేజీ వేయాలి. ఒక రాత్రంతా అలాగే ఉంటి మరుసటి రోజు శభ్ర పరుచుకోవాలి. ఇలా కనీసం రెండు మూడ్రోజులు చేయడం వల్ల కొవ్వు గడ్డలు కరిగిపోతాయి. వీటి రసాన్ని అప్లై చేయడం వల్ల ఎక్కడైనా చర్మ సమస్యలు వచ్చినా నయమైపోతాయి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది