Health Benefits : చాలా మందికి చర్మం మీద అక్కడక్కడా గుల్లలు వస్తాయి. చిన్న బఠాణీ గింజలంత గడ్డలు, కురుపులు ఉంటాయి. ఇలాంటి గుల్లలు వస్తే వీటిని వేడి కురుపులు, సెగ గడ్డలు అంటారు. అది కొంచెం ఎర్రగా మారి నొప్పి వస్తుంది. కొన్ని రోజులకు క్కడ తగ్గి ఇంకో చోటు వస్తుంటుంది. అవి రెండు, మూడు నెలలకు మచ్చలుగా మారుతాయి. ఇవి ఎక్కువగా పిరుదులు, వీపు, ముఖం మీద వస్తుంటాయి. ఇలాంటి గుల్లలు వేడి చేస్తే వస్తుంటాయి అంటారు. అది నిజమేనా… అసలు ఇవి ఎందుకు, ఎలా వస్తాయి, రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వ కాలం నుంచి మన పెద్దలు అందరికీ అర్థం అయ్యేలా చెప్పాలని పచ్చళ్లు, మసాలాలు తింటే వేడి చేస్తుందని అనేవారు. నిజానికి అలా చెప్తే వింటారని మాత్రమే. అయితే అది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. గుల్లల్లో ఉండే చీము బయటకు రావడానికి అది గడ్డలా తయారవుతుంది. కానీ వేడి వల్ల కాదు. ఇలా సెగ కరుపులు, సెగ గడ్డలు లేదా చర్మంపై ఏర్పడే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కి రోజూ హనీ, లెమన్ వాటర్ రోజుకు ఐదారు సార్లు తాగాలి. నాలుగైదు స్పూన్ల తేనె, అర చెక్క నిమ్మరసం కలపాలి. రోజుకు నాలుగు లీటర్ల మంచి నీళ్లు తాగుతూ ఉంటే శరీరంలో ఉన్న టాక్సిన్లు, విష వ్యర్థాలు బయటకు పోతాయి. తేనె తాగడం వల్ల వేడి చేయదు. నీళ్ల తాగకపోవడం వల్ల ఏర్పడే ఇబ్బంది అది.
రోజుకు రెండు బోండాల కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. జ్యూస్, కూరగాయల రసాలన్నీ ఎక్కువగా తీసుకోండి. అలా చేయడం వల్ల రక్త శుద్ధి జరిగి బాక్టీరియా ఇన్ఫెక్షన్ లు తగ్గుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పండ్లు తీసుకోవడం వల్ల బాక్టీరియా తగ్గుతుంది. రోజూ ఐదారు లీటర్ల మంచి నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల పాత గడ్డలు మళ్లీ రాకుండా చేస్తాయి. రోజుకు రెండు సార్లు విరోచనం అయ్యేలా చేస్తుంది. ఉదయాన్నే ఒక జ్యూస్ తప్పకుండా తాగండి. ఒఖ వెజిటబుల్ జ్యూస్, సాయంత్రం ఒక పండ్ల రసం తాగాలి. త్వరగా ఆహారం తీసుకోవాలి. టాక్సిన్లు పోవడం వల్ల సెగ కురుపులు రాకుండా ఉంటాయి. ఇలా రెండు మూడు నెలలు చేస్తే ఆరోగ్యంతో పాటు సెగ గడ్డలు, కురుపులు కూడా తగ్గుతాయి.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.